News January 28, 2025

IND vs ENG: మనోళ్లు సిరీస్ పట్టేస్తారా?

image

భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఇవాళ మూడో టీ20 జరగనుంది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా 5 మ్యాచుల సిరీస్‌లో టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తూ ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన భావిస్తోంది. మరోవైపు ఇవాళ గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచులో టాస్ కీలకంగా మారనుంది.

News January 28, 2025

నేడు ప్రొద్దుటూర్‌కు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ ఇవాళ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ 150 ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ‘ఎక్స్‌పీరియం పార్కు’ను ఆయన ప్రారంభిస్తారు. ఇదే కార్యక్రమంలో సినీ నటుడు చిరంజీవి కూడా పాల్గొంటారు. కాగా రూ.450 కోట్ల వ్యయంతో రామ్‌దేవ్ రావు ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఇందులో 85 దేశాల నుంచి అనేక రకాల జాతుల మొక్కలు, చెట్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు.

News January 28, 2025

SSMB 29: మహేశ్ బాబు ఫోన్‌కూ నో పర్మిషన్

image

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం నుంచి ఎలాంటి లీక్‌లు బయటకు రాకుండా మేకర్స్ జాగ్రత్తలు పడ్డట్లు టాక్. మహేశ్‌తో సహా ఎవరూ సెట్‌లోకి ఫోన్ తీసుకురాకూడదట. అందరితో నాన్-డిస్‌క్లోజ్ అగ్రిమెంట్(NDA)చేసుకున్నట్లు తెలుస్తోంది. లీక్ చేస్తే భారీ మూల్యం చెల్లించాలి.

News January 28, 2025

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త సూసైడ్

image

భార్య వేధింపులతో మరో భర్త సూసైడ్ చేసుకున్నారు. KAలోని హుబ్లీలో పీటర్, ఫిబీ(పింకీ)లకు రెండేళ్ల కిందట పెళ్లి కాగా, మనస్పర్థలతో 3నెలలుగా విడిగా ఉంటున్నారు. ‘నా భార్య నన్ను చంపుతోంది. నేను చనిపోవాలని ఆమె కోరుకుంది’ అని పీటర్ రాసిన సూసైడ్ నోట్ వైరలవుతోంది. విడాకుల కోసం ఫిబీ సోదరుడు రూ.20 లక్షలు డిమాండ్ చేశాడని, ఆఫీస్ మీటింగ్‌లో ఉండగా భార్య గొడవపడటంతో పీటర్ జాబ్ పోయిందని మృతుడి తండ్రి చెప్పారు.

News January 28, 2025

పని వేళల్లో నిద్ర ముంచుకొస్తోందా?

image

కొందరికి మధ్యాహ్న భోజనం అనంతరం నిద్ర ముంచుకు వస్తుంది. పని చేసేందుకు శరీరం ఏమాత్రం సహకరించదు. కానీ కొన్ని పద్ధతులు పాటిస్తే నిద్రను కట్టడి చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఖచ్చితంగా ఒకే సమయానికి నిద్ర పోవాలి. రాత్రి వేళల్లో టీ, కాఫీ తాగితే సరిగా నిద్ర పట్టదు. దీంతో మధ్యాహ్నం నిద్ర వస్తుంది. అందుకే వాటికి దూరంగా ఉండటం మంచిది. ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. టీవీ, ఫోన్లు చూడటం తగ్గించడం ఉత్తమం.

News January 28, 2025

ఆడవాళ్లకే చలి ఎక్కువ.. ఎందుకంటే?

image

పురుషులతో పోలిస్తే మహిళలే చలికి ఎక్కువగా వణుకుతుంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత, నెలసరి, జీవక్రియ రేటు కారణంగా శరీరంలో తక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వారు మరింత చలి ఫీల్ అవుతారు. అలాగే వారి శరీరంలోని కొవ్వు అంతర్గత వేడిని ప్రసరింపజేసే రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీంతో ఆడవాళ్లు మరింత చలిని అనుభవిస్తారు.

News January 28, 2025

గాజాకు క్యూ కట్టిన పాలస్తీనియన్లు

image

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగియడంతో లక్షల మంది పాలస్తీనియన్లు గాజా బాటపట్టారు. 15 నెలల తర్వాత వారు శిథిలమైన తమ నివాసాలను చేరుకునేందుకు శరణార్థ శిబిరాల నుంచి గాజా వైపు వెళ్తున్నారు. కాగా 2023 అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో 45 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. లక్షలాది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజా నగరం దాదాపు 80 శాతం ధ్వంసమైంది.

News January 28, 2025

లివ్ ఇన్ రిలేషన్‌లో పిల్లలు పుడితే.. సీఎం సంచలన వ్యాఖ్యలు

image

ఉత్తరాఖండ్‌లో నేటి నుంచి యూసీసీ అమలు చేస్తున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. ఇకపై తల్లిదండ్రుల ఆస్తుల్లో కూతుర్లకు సమాన హక్కులు ఉంటాయన్నారు. రెండో వివాహం, లివ్ ఇన్ రిలేషన్‌లో జన్మించిన ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటా ఉంటుందన్నారు. దీని కోసం లివ్ ఇన్ రిలేషన్ షిప్‌‌లో ఉన్నట్లు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఈ విషయాన్ని వారి పేరెంట్స్‌కు సమాచారం ఇస్తామన్నారు. ఇది గోప్యంగా ఉంటుందని పేర్కొన్నారు.

News January 28, 2025

‘మ్యాన్ ఈటర్’ పొట్టలో మహిళ వెంట్రుకలు, రింగులు

image

కేరళలోని వయనాడ్‌లో రాధ (45) అనే మహిళను తిన్న ‘మ్యాన్ ఈటర్’ పొట్టలో ఆమె అవశేషాలు కనిపించాయని అధికారులు నిర్ధారించారు. పోస్టుమార్టంలో ఆమె వెంట్రుకలు, చెవి రింగులు పులి పొట్టలో లభించినట్లు తెలిపారు. పులి కోసం అటవీ అధికారులు వేటాడుతుండగా ఓ పాడుబడిన ఇంట్లో చనిపోయి కనిపించింది. వెంటనే దానికి పోస్టుమార్టం నిర్వహించారు. టీమ్ ఇండియా క్రికెటర్ మిన్ను మణికి మృతురాలు రాధ సమీప బంధువు అన్న విషయం తెలిసిందే.

News January 28, 2025

జనవరి 28: చరిత్రలో ఈ రోజు

image

1950: భారత సుప్రీంకోర్టు ఏర్పాటు
1865: జాతీయోద్యమ నాయకుడు లాలా లజపతిరాయ్ జననం
1885: భాషా పరిశోధకుడు గిడుగు వెంకట సీతాపతి జననం
1920: నిర్మాత, దర్శకుడు బి.విఠలాచార్య జననం
1986: హీరోయిన్ శ్రుతి హాసన్ జననం
2004: దర్శకుడు, క్రీడాకారుడు పామర్తి సుబ్బారావు మరణం
2014: దర్శకుడు, నట శిక్షకుడు బీరం మస్తాన్‌రావు మరణం