India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

✒ తేది: జనవరి 28, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.33 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.09 గంటలకు
✒ ఇష: రాత్రి 7.24 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

✒ తిథి: బహుళ చతుర్దశి రా.7.29 వరకు
✒ నక్షత్రం: పూర్వాషాడ ఉ.8.57 గంటల వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ప.3.00-4.30 వరకు
✒ యమగండం: ఉ.9.00-10.30 వరకు
✒ దుర్ముహూర్తం: 1.ఉ.8.24-9.12 వరకు
2.రా.10.46-11.36 వరకు
✒ వర్జ్యం: సా.4.59-6.35 వరకు
✒ అమృత ఘడియలు: రా.3.04-4.40 వరకు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

* ఆర్థిక పరిస్థితి పుంజుకున్నాకే పథకాలు: ఏపీ సీఎం చంద్రబాబు
* ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువ పెంపు: మంత్రి అనగాని
* ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు చెప్పేవి పచ్చి అబద్ధాలు: అంబటి
* రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ ప్రయత్నాలను అడ్డుకుంటాం: సీఎం రేవంత్
* గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వం: బండి సంజయ్
* ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024గా బుమ్రా

TG: గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వబోమన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఆరెస్సెస్, బీజేపీ నేతలకే అవార్డులు ఇవ్వాలా అని ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. ప్రజా యుద్ధ నౌకగా గద్దర్ పేరు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

శరీరం డీహైడ్రేషన్‌కు గురవ్వకుండా ఉండాలంటే తగినంత నీరు అవసరం. రోజును గ్లాసు నీళ్లతో ప్రారంభించడమే కాకుండా నిద్ర పోయే ముందూ గ్లాసు నీరు తాగడం ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరం నుంచి విష పదార్థాలను తొలగిస్తుందంటున్నారు. అజీర్తి, గ్యాస్ సమస్యలు ఉన్నవారు గ్లాసు గోరు వెచ్చని నీరు తాగితే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు.

మలేషియాకు చెందిన షజాలీ సులేమాన్ అనే వ్యక్తి వినూత్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. భార్యల ముందు హీరో అవ్వాలనుకునే భర్తలు తనను విలన్‌గా అద్దెకు తీసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపాడు. భర్త దగ్గర లేని సమయంలో తాను వచ్చి భార్యను వేధిస్తానని, వెంటనే భర్త వచ్చి తనను కొట్టి భార్యను కాపాడి ఆమె ముందు హీరో కావొచ్చని ఆఫర్ ఇచ్చాడు. దీనికోసం వారాంతాల్లో రూ.2963, ఇతర రోజుల్లో రూ.1975 ఛార్జ్ చేస్తున్నాడు.

AP: <<15257420>>అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఓచర్స్<<>> విషయంపై Dy CM పవన్ మరోసారి స్పందించారు. ‘గిఫ్ట్ కార్డుల్లో డబ్బు జమ చేయడం సులభం. అయితే కాలపరిమితి ముగిసిన కార్డుల నుంచి డబ్బు వెనక్కి తీసుకోవడం కష్టమైన ప్రక్రియ. ఇది సులభతరంగా ఉండాలి. గిఫ్ట్ కార్డులో బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా మెయిన్ ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ కావాలి. ఈ విధానంపై అమెజాన్ ఆలోచించాలని కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మల, RBIని ట్యాగ్ చేశారు.

TG: సినిమా థియేటర్లకు 16 ఏళ్లలోపు పిల్లలు వెళ్లే సమయ వేళలపై హైకోర్టు ఆంక్షలు విధించింది. రా.11 నుంచి ఉ.11 గంటల వరకు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని అధికారులను ఆదేశించింది. ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతిపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను FEB 22కు వాయిదా వేసింది.

AP: కేంద్రం తీసుకొచ్చిన <<15279838>>వక్ఫ్ సవరణ బిల్లు<<>>లో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కీలక మార్పులను ప్రతిపాదించారు. భూవివాదాలపై విచారణ జరిపే అధికారాన్ని కలెక్టర్‌కు బదులుగా ఆపై ర్యాంకులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారికి అప్పగించాలని ఆయన సూచించారు. దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. కాగా 44 మార్పులపై చర్చ చేపట్టి 14 సవరణలను జేపీసీ ఆమోదించిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.