India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వివిధ కేసుల్లో నిందితులకు పోలీసులు వాట్సాప్‌లో/ఇతరత్రా ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో నోటీసులు పంపకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. CrPC సెక్షన్ 41-A, 1973/BNSS సెక్షన్ 35, 2023 ప్రకారం నిర్దేశించిన పద్ధతిలోనే(వ్యక్తిగతంగా/కుటుంబ సభ్యులకు ఇవ్వడం/ఇంటి గోడలకు ప్రతులు అంటించడం, ఇతరత్రా) అందజేయాలని పేర్కొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు శాఖకు స్టాండింగ్ ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించింది.

మల్టీ లెవెల్ మార్కెటింగ్ మాయలో పడి మోసపోవద్దని ప్రజలకు TG పోలీసులు సూచించారు. ‘ఇంట్లో ఉంటూనే సంపాదించవచ్చనే ప్రకటనలను నమ్మొద్దు. ప్రొడక్ట్స్ కొంటే లాభాలు వస్తాయని, మీతో పాటు నలుగురిని చేర్చుకోవాలంటూ బ్రెయిన్ వాష్ చేసే వారితో జాగ్రత్త. ముఖ్యంగా గృహిణులు అప్రమత్తంగా ఉండాలి. పేరు ఏదైనా అక్కడ జరిగేది పచ్చి మోసం. మీతోపాటు మరికొందరిని బలి చేయొద్దు’ అని హెచ్చరించారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఇప్పటివరకు రూ.276 కోట్లు వసూలు చేసింది. థియేటర్లలో క్రేజ్ తగ్గకపోవడం, కొత్త సినిమాలు లేకపోవడంతో ఓటీటీ విడుదల వాయిదా పడనున్నట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి రెండో వారంలోనే జీ5లో స్ట్రీమింగ్‌కు రావాల్సి ఉండగా మరికొంత గడువు ఇవ్వాలని మేకర్స్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి/ఏప్రిల్‌లోనే ఓటీటీలోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

TG: గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు కేటాయించిన వాటాలను కాపాడేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కోరారు. రాష్ట్రానికి ప్రాజెక్టుల అనుమతుల విషయంలో జరుగుతున్న నష్టంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతుల సాధనలో విఫలమవ్వడంతో ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతోందన్నారు. రాష్ట్ర హక్కులను కాపాడేందుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలని కోరారు.

రానున్న వేసవిలో కైలాస మానస సరోవర్ యాత్ర పున:ప్రారంభించాలని భారత్, చైనా నిర్ణయించాయి. భారత్ నుంచి చైనాకు నేరుగా విమానాలు నడిపేందుకు ఇరుదేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. చైనా పర్యటనలో భాగంగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయి ఇరుదేశాల మధ్య బంధాలు బలపడటానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2020లో ఆగిన యాత్ర తిరిగి ప్రారంభమవనుంది.

కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తొలి విడతలో హమాస్ 33 మంది బందీల విడుదలకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో 8 మంది చనిపోయినట్లు హమాస్ వెల్లడించిందని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. ఇప్పటికే ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది. ఈ క్రమంలో పలువురు బందీలు మరణించడంపై ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

TG: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జోరుగా సాగుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మండలానికొకటి చొప్పున ఎంపిక చేసిన గ్రామాల్లో తొలిరోజు 15,414 కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు వెల్లడించారు. పాత కార్డుల్లో 1.03 లక్షల మంది పేర్లు చేర్చినట్లు పేర్కొన్నారు. 561 గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభమైందని, 20,336 మంది అకౌంట్లలో ₹6K చొప్పున జమ చేసినట్లు చెప్పారు.

విండీస్‌తో జరిగిన <<15279795>>రెండో టెస్టులో<<>> PAK స్పిన్నర్ నోమన్ అలీ రికార్డు సృష్టించారు. 141 ఏళ్ల చరిత్రలో మ్యాచ్ తొలిరోజు మొదటి గంటలోనే హ్యాట్రిక్ వికెట్లు తీసిన స్పిన్నర్‌గా నిలిచారు. 1883లో ఆసీస్ బౌలర్ బిల్లీ గేట్స్ ఈ ఘనత సాధించారు. అలాగే ఫస్ట్ సెషన్‌లోనే హ్యాట్రిక్ తీసిన ఆరో బౌలర్‌గా, సెకండ్ ఓల్డెస్ట్ ప్లేయర్(38Y 139D)గానూ నిలిచారు. శ్రీలంక క్రికెటర్ రంగన హెరాత్ 38Y 110D వయసులో హ్యాట్రిక్ తీశారు.

TG: దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన నాగోబా జాతర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదిలాబాద్ (D) కేస్లాపూర్‌లో (మెన్షన్) మెస్రం వంశస్థుల ఆధ్వర్యంలో 5 రోజుల పాటు సాగుతుందని, భక్తులు నాగోబాను దర్శించుకొని ఆశీస్సులు అందుకోవాలని ఆకాంక్షించారు. అధికారికంగా నిర్వహిస్తున్న ఈ జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు వెల్లడించారు. కాగా రేపటి నుంచి జాతర ప్రారంభం కానుంది.

AP: అధికార మదంతో కూటమి నేతలు ఊరురా దాడులు, దౌర్జన్యానికి పాల్పడుతూ అక్రమాలు చేస్తున్నారని వైసీపీ మండిపడింది. బాధితులకు అండగా ఉంటామంటూ కొత్త క్యాంపెయిన్ షురూ చేసింది. ‘మీ ఊరిలో కూటమి నేతలు అరాచకాలు చేస్తే ఫొటోలు, వీడియోలు తీసి #KutamiFiles #ConstituencyName ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయండి’ అని పిలుపునిచ్చింది. బాధితుల తరఫున వైసీపీ పోరాటం చేస్తుందని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.