News October 29, 2025

పిల్లలకు ఈ టీకాలు వేయిస్తున్నారా?

image

భారత ప్రభుత్వం సార్వత్రిక టీకా కార్యక్రమం కింద క్షయ (BCG), పోలియో, ధనుర్వాతం (టెటనస్), హెపటైటిస్-బి, డిప్తీరియా, కోరింత దగ్గు, మెదడువాపు (హిబ్), న్యుమోకోక్కల్ వంటి 10కి పైగా టీకాలను ఉచితంగా అందిస్తోంది. ఈ టీకాల ద్వారా పిల్లల మరణాల రేటు గణనీయంగా తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇవి లేకపోతే భారతీయ సగటు ఆయుర్దాయం 30-40 ఏళ్లకే పరిమితమయ్యేదట. అందుకే ప్రతి బిడ్డకు టీకాలు వేయించడం తప్పనిసరి. SHARE IT

News October 29, 2025

పుట్టుకతో గుండె లోపాలుంటే పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు

image

గుండెలోపాలతో పుట్టే శిశువులకు, వారి తల్లులకు క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ప్రచురించిన ఈ అధ్యయనంలో గుండెలోపాలున్న శిశువుల్లో 66% ఎక్కువ క్యాన్సర్లు బయటపడ్డాయి. ముఖ్యంగా రక్తనాళాలు, గుండెకవాటాల లోపం ఉంటే ముప్పు రెండింతలు ఎక్కువగా ఉంది. తల్లి జన్యు స్వభావం వల్ల తల్లీబిడ్డలిద్దరీ క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు.

News October 29, 2025

టీమ్‌గా పనిచేసి నష్టనివారణ చర్యలు చేపట్టాం: CM చంద్రబాబు

image

AP: సమర్థంగా వ్యవహరించి తుఫాన్ నష్టనివారణ చర్యలు చేపట్టామని కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్‌లో CM చంద్రబాబు అన్నారు. ‘అంతా టీమ్‌గా పనిచేశాం. ప్రతిఒక్కరికీ అభినందనలు. మరో 2 రోజులు ఇలానే చేస్తే మరింత ఊరట ఇవ్వగలం. మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి. ప్రభుత్వం ఏం చేసిందో చెబుతూ సమస్యలు అడిగి తెలుసుకోవాలి. నష్టం అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వాలి’ అని ఆదేశించారు.

News October 29, 2025

TTD దేవాలయాలన్నిటిలో అన్నదానం

image

AP: ట్రస్టు డిపాజిట్లు ₹2500 కోట్లకు చేరనుండడంతో దేశంలోని తమ అన్ని దేవాలయాల్లోనూ ‘అన్నదానం’ చేయాలని TTD నిర్ణయించింది. కరీంనగర్(TG)లో ఆలయ నిర్మాణానికి ₹30 కోట్లు కేటాయించింది. అక్కడే ₹3 కోట్లతో ‘ఆధ్యాత్మిక ఉద్యానవనం’ నిర్మించనుంది. తక్కువ ధరలకు మందులు విక్రయించేలా స్విమ్స్ ఆధ్వర్యంలో మెడికల్ షాపులను ఏర్పాటు చేయనుంది. వైకుంఠ ద్వార దర్శన విధానాన్ని 10 రోజుల పాటు కొనసాగించనుంది.

News October 29, 2025

కాసేపట్లో మ్యాచ్.. రికార్డుల్లో మనదే పైచేయి!

image

ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు ఆస్ట్రేలియాVsభారత్ తొలి T20 ప్రారంభం కానుంది. అయితే ఆసీస్‌పై పొట్టి క్రికెట్లో మనదే పైచేయి. కంగారూ గడ్డపై ఇప్పటి వరకు ఇండియా టీ20 సిరీస్ కోల్పోలేదు. 2012లో 1-1తో సమం కాగా 2016లో 3-0 తేడాతో గెలిచింది. 2018లో మళ్లీ 1-1తో సమం చేయగా 2020లో 2-1తో సిరీస్ సాధించింది. ఇక AUS-IND మధ్య జరిగిన చివరి 8 మ్యాచుల్లో భారత్ ఏడింట్లో గెలవడం విశేషం.

News October 29, 2025

SECLలో 595 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

సౌత్ ఈస్ట్రర్న్ కోల్‌ఫీల్డ్స్‌(SECL)లో<> 595 <<>>పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మైనింగ్ సిర్దార్, జూనియర్ ఓవర్‌మెన్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా , మైనింగ్ సిర్దార్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ పాటు పని అనుభవం గల అభ్యర్థులు రేపటివరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://secl-cil.in

News October 29, 2025

తుఫాన్.. ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు

image

AP: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలు, మత్స్యకారులకు ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయనుంది. ప్రతి కుటుంబానికి 25కేజీల బియ్యం(మత్స్యకారులకు 50కేజీలు), లీటర్ నూనె, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, చక్కెర అందించనుంది. బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర సరఫరా వెంటనే ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేయాలని మార్కెటింగ్ కమిషనర్‌కు సూచించింది.

News October 29, 2025

భారీ వర్షాలు.. కల్లాల మీద ధాన్యం ఉందా?

image

కోతకోసి కుప్ప మీద ఉన్న ధాన్యాన్ని బరకాలు కప్పుకొని రైతులు రక్షించుకోవాలి. నూర్చిన ధాన్యం రెండు మూడు రోజులు ఎండబెట్టడానికి వీలులేని పరిస్థితుల్లో ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల పొడి ఊక లేదా ఎండు వరిగడ్డిని కలిపితే గింజను వారం రోజులపాటు మొలకెత్తి చెడిపోకుండా నివారించుకోవచ్చు. ఎండ కాసిన తర్వాత ధాన్యాన్ని ఎండబెట్టి, తూర్పార పట్టి నిలువ చేసుకోవాలని ఏపీ వ్యవసాయ శాఖ సూచించింది.

News October 29, 2025

డౌన్స్‌ సిండ్రోమ్ పిల్లలకు ఈ పరీక్షలు చేయిస్తున్నారా?

image

డౌన్స్‌ సిండ్రోమ్‌ ఉన్న పిల్లలకు క్రమం తప్పకుండా కొన్ని వైద్య పరీక్షలు చేయించాలని వైద్యులు చెబుతున్నారు. ఏడాదికోసారి కంటి పరీక్షలు, 6-12 నెలలకు ఒకసారి చెవి పరీక్షలు చేయించాలి. ప్రతి ఆర్నెల్లకోసారి దంత పరీక్షలు, 3-5 ఏళ్లకోసారి ఛాతీ, మెడ భాగాన్ని ఎక్స్‌రే తీసి పరీక్షిస్తూ ఉండాలి. అమ్మాయిల్లో యుక్త వయసు రాగానే పాప్‌ స్మియర్‌ పరీక్ష, సంవత్సరానికోసారి థైరాయిడ్‌ పరీక్ష చేయిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.

News October 29, 2025

49 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఘజియాబాద్‌లో 49 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్-C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్, ITI, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590, SC/ST/PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://bdl-india.in/