News January 27, 2025

అడ్వాంటేజ్ కోసం జనసేనలో చేరొద్దు: నాగబాబు

image

AP: జనసేనలో చేరేవారికి ఆ పార్టీ నేత నాగబాబు కీలక విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్నామనే అడ్వాంటేజ్ కోసం తమ పార్టీలో చేరొద్దని సూచించారు. పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామకు చెందిన పలువురు వైసీపీ నేతలు ఆయన సమక్షంలో జనసేనలో చేరారు. ప్రజల కోసమే నిస్వార్థంగా పనిచేయాలన్నారు. అధినేత లక్ష్యాన్ని జనంలోకి తీసుకెళ్లాలని ఆయన తెలిపారు.

News January 27, 2025

UGC గైడ్‌లైన్స్‌ను వ్యతిరేకిస్తున్నాం: ఉన్నత విద్యామండలి

image

TG: VCల నియామకంపై UGC జారీ చేసిన గైడ్‌లైన్స్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రకటించారు. ఈ గైడ్‌లైన్స్ వల్ల వీసీల నియామకం కేంద్రం చేతుల్లోకి వెళ్తుందన్నారు. వీసీలుగా బ్యూరోక్రాట్స్‌ను నియమించాలనుకోవడం సరికాదని, ఇవి ప్రైవేటైజేషన్‌ను ప్రోత్సహించేలా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర యూనివర్సిటీలను దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.

News January 27, 2025

అకౌంట్లోకి డబ్బులు.. కీలక ప్రకటన

image

TG: రైతుభరోసా డబ్బుల జమపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. తొలి విడతలో మండలానికొక గ్రామంలో సొమ్ము విడుదల చేశామని వెల్లడించారు. ఇవాళ 4,41,911 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని, 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు రూ.563 కోట్లు రిలీజ్ చేసినట్లు తెలిపారు.

News January 27, 2025

ఈ రూల్స్ పాటించండి.. డబ్బును ఆదా చేసుకోండి!

image

ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఒకటో తేదీన వచ్చిన జీతం 10రోజులకే ఖాళీ అవుతుంది. అందుకే ‘ఫస్ట్ వీక్ రూల్’ను పాటించాలి. అంటే మీ ఆదాయంలోని 20% మొత్తాన్ని సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మొదటి వారమే పెట్టేయాలి. అధిక వడ్డీలతో అప్పులు చేయొద్దు. ఆదాయస్థాయి కంటే తక్కువలోనే ఖర్చు చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటుచేసుకోవాలి. బేరం ఆడటం, పన్నులను మేనేజ్ చేయడం నేర్చుకోండి. కొత్త ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకోవాలి.

News January 27, 2025

పోలవరం నిర్మాణాన్ని జగన్ ఆపేస్తే CBN ఊపిరిపోశారు: నిమ్మల

image

AP: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా 2025 జులైకు పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తిచేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పురుషోత్తపట్నం మీదుగా ఉత్తరాంధ్రకు నీరు ఇస్తామన్నారు. పోలవరం నిర్మాణ పనులను వైఎస్ జగన్ పూర్తిగా నిలిపేస్తే చంద్రబాబు ఊపిరి పోశారని చెప్పారు. గతంలో రైతులు కన్నీళ్లు పెట్టినా వైసీపీ ప్రభుత్వం కనికరం చూపలేదని దుయ్యబట్టారు.

News January 27, 2025

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో మహిళ అరెస్ట్

image

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో ఓ మహిళ అరెస్టైంది. పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాలో ఆమెను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ వాడిన సిమ్ ఈ మహిళ పేరు మీద రిజిస్టరై ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను ముంబై తీసుకెళ్లి విచారించేందుకు ఆ రాష్ట్ర పోలీసుల అనుమతి తీసుకోనున్నారు. సైఫ్‌పై తన ఇంట్లోనే ఈ నెల 16న దాడి జరిగిన విషయం తెలిసిందే.

News January 27, 2025

చేపల మొప్పల నుంచి మన చెవుల ఆవిర్భావం?

image

మనిషి సహా ఉపరితల జీవుల చెవులు చేపల మొప్పల నుంచి అభివృద్ధి చెందాయని అమెరికా పరిశోధకులు తేల్చారు. ‘మన చెవుల్లో ఉండే జన్యువుల్ని జీబ్రాఫిష్ జినోమ్‌లోకి ప్రవేశపెడితే ఆ చేప మొప్పల్లో మార్పు కనిపించింది. ఇక జీబ్రా ఫిష్ నుంచి జన్యువుల్ని చిట్టెలుకల్లో ప్రయోగించగా వాటి చెవుల్లో మార్పులు కనిపించాయి. పరిణామక్రమంలో చేపల మొప్పలే భూమ్మీద జీవులకు చెవులయ్యాయనేది మా అధ్యయనంలో తేలింది’ అని పేర్కొన్నారు.

News January 27, 2025

ఘోరాలకు ఆజ్యం పోస్తున్న వెబ్ సిరీస్‌లు?

image

నానాటికీ పెరుగుతున్న<<15262482>>murder<<>>, అత్యాచారాలు, ఘోరాల వెనుక OTT సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రధాన కారణమవుతున్నాయా? గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల బట్టి ఇవే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీ కంటెంట్‌పై నియంత్రణ లేదు. దీంతో హింసాత్మక, జుగుప్సాకరమైన కంటెంట్ సులువుగా నెట్టింట లభిస్తోంది. బలహీన మనస్కులపై అది ప్రభావం చూపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మీ కామెంట్?

News January 27, 2025

ICC క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్-2024 వీరే..

image

* మెన్స్ వన్డే క్రికెటర్-అజ్మతుల్లా(ఆఫ్గానిస్థాన్)
* మెన్స్ టెస్ట్ క్రికెటర్ -బుమ్రా(ఇండియా)
* మెన్స్ టీ20 క్రికెటర్ -అర్ష్‌దీప్(ఇండియా)
* మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్-కమిందు మెండిస్(శ్రీలంక)
* ఉమెన్స్ వన్డే క్రికెటర్-స్మృతి మంధాన(ఇండియా)
* ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్-డెర్క్సెన్(దక్షిణాఫ్రికా)
* ఉమెన్స్ టీ20 క్రికెటర్-మెలి కెర్(న్యూజిలాండ్)
* అంపైర్-రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్

News January 27, 2025

అప్పులు చేస్తే చెల్లించే శక్తి ఏపీకి లేదు: సీఎం చంద్రబాబు

image

AP: YCP ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని CM చంద్రబాబు మరోసారి విమర్శించారు. 2022-23కు గాను నీతి ఆయోగ్ నివేదికపై ఆయన మాట్లాడారు. అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులు తప్పవని, తిరిగి తీర్చే శక్తి రాష్ట్రానికి లేదని చెప్పారు. అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుందన్నారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకుంటే ప్రజలే బాధపడతారని పేర్కొన్నారు. రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు.