News April 24, 2024

ఎల్లుండి మెట్రో రైలు సమయం పొడిగింపు

image

TG: ఈ నెల 25న HYDలోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్, ఆర్సీబీ మధ్య ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో రైల్ సమయాన్ని పొడిగించారు. ఆ రోజు అర్ధరాత్రి 12:15 గంటలకు చివరి రైళ్లు టెర్మినల్ స్టేషన్ నుంచి ప్రారంభమై 1:10 గంటలకు గమ్యాన్ని చేరుకుంటాయని మెట్రో అధికారులు తెలిపారు. ఈ సమయాల్లో ఉప్పల్, స్టేడియం, NGRI స్టేషన్ల‌లోనే ప్రయాణికుల ఎంట్రీకి అనుమతి ఇస్తామని.. మిగతా స్టేషన్లలో ఎగ్జిట్ ఉంటుందని పేర్కొన్నారు.

News April 24, 2024

‘INDIA’ ఫ్రంట్ కాదు.. ఇదొక వేదిక: పినరయి

image

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ INDIA కూటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా బ్లాక్ ఫ్రంట్ కాదని.. అధికార బీజేపీపై పోరాడేందుకు ప్రతిపక్షాల కోసం ఉన్న వేదిక అని అన్నారు. ఇండియా బ్లాక్‌లోని భాగస్వామ్య పార్టీలు LDF (CPI(M) నేతృత్వంలోనిది), UDF (కాంగ్రెస్ నేతృత్వంలోనిది) మధ్య తీవ్రమైన పోరు నెలకొన్న నేపథ్యంలో విజయన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

News April 24, 2024

మసాలాల నిషేధంపై వివరణ కోరిన భారత్!

image

భారత్‌కు చెందిన MDH, ఎవరెస్ట్ మసాలాలను సింగపూర్, హాంగ్‌కాంగ్ దేశాలు నిషేధించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మరో ముందడుగు పడింది. నిషేధానికి గల కారణాలను వివరించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆయా దేశాలను కోరినట్లు తెలుస్తోంది. కాగా.. అందులో పురుగు మందుల ఆనవాళ్లున్నాయని సింగపూర్, క్యాన్సర్ కారకాలున్నాయని హాంగ్‌కాంగ్ గతంలో ఆరోపించాయి.

News April 24, 2024

ఈయన జీతం రోజుకు రూ.50 లక్షలు

image

ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు వార్షిక వేతనాలు భారీగానే ఉంటాయి. కొందరు రోజుకు రూ.వేలల్లో సంపాదిస్తే ఇంకొందరు రోజుకు రూ.లక్షల్లో ఆర్జిస్తారు. అయితే కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ సింగిశెట్టి గత ఆర్థిక సంవత్సరం అత్యధిక వేతనం పొందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా నిలిచారు. ఆయన రోజుకు రూ.50 లక్షల వేతనం అందుకున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఆయన వార్షిక వేతనం సుమారు రూ.186 కోట్లు.

News April 24, 2024

బాబును నమ్మి ఎన్నారైలు బలి కావొద్దు: జోగి

image

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నారైలు డబ్బు తరలిస్తే మనీలాండరింగ్ కేసులో ఇరుక్కుంటారని మంత్రి జోగి రమేశ్ అన్నారు. ‘ఎన్నారైలు బాబును నమ్మితే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే. వారు ప్రజా సేవ చేస్తే అభ్యంతరం లేదు. కానీ బాబును నమ్మి కేసుల్లో ఇరుక్కోవద్దు. ఎవరు మంచి చేస్తున్నారో ఎన్నారైలు ఆలోచించుకోవాలి. సుపరిపాలన అందిస్తున్న జగన్‌కు మద్దతు తెలపాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.

News April 24, 2024

ఇవాళ నామినేషన్లు వేసిన ప్రముఖులు వీరే?

image

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల సందడి కొనసాగుతోంది. ఇవాళ కొందరు ప్రముఖులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్-పిఠాపురం, విజయసాయిరెడ్డి-నెల్లూరు MP, సత్యకుమార్-ధర్మవరం, ప్రత్తిపాటి పుల్లారావు-చిలకలూరిపేట, పేర్ని కిట్టు-మచిలీపట్నం, కారుమూరి సునీల్-ఏలూరు MP, స్వామి పరిపూర్ణానంద-హిందూపురం(IND), కాసాని జ్ఞానేశ్వర్(BRS), రంజిత్ రెడ్డి(INC)-చేవెళ్ల MP, బర్రెలక్క(IND), మల్లు రవి-నాగర్ కర్నూల్ ఎంపీ.

News April 24, 2024

టీ20 పండుగకు సర్వం సిద్ధం?

image

టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా, వెస్టిండీస్ సర్వం సిద్ధం చేస్తున్నాయి. న్యూయార్క్‌లో కొత్త స్టేడియం నిర్మిస్తున్నారు. అలాగే విండీస్‌లోని స్టేడియాలకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. WCకు మరో రెండు నెలల సమయం ఉండటంతో పనులు వేగవంతం చేస్తున్నారు. కాగా జూన్ 2 నుంచి టీ20 WC ప్రారంభం కానుంది. మొత్తం 20 జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. జూన్ 9న న్యూయార్క్‌లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది.

News April 24, 2024

అశ్వత్థామ ఎవరో తెలుసా?(1/2)

image

‘కల్కి’ సినిమాలో అమితాబ్ పోషిస్తున్న పాత్ర అశ్వత్థామ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. పురాణాల ప్రకారం మహాభారతంలోని ఒక పాత్రే అశ్వత్థామ. సప్త చిరంజీవుల్లో ఒకడు. పాండవులకు, కౌరవులకు గురువైన ద్రోణుడి ఏకైక కుమారుడు. శివుడి వరంతో అతడు నుదిటిపై మణితో జన్మిస్తాడు. మహాభారతంలో కౌరవుల పక్షాన ఉంటాడు. యుద్ధంలో తండ్రి మరణం, స్నేహితులను కోల్పోవడంతో కోపంతో ద్రౌపదీ పుత్రులను చంపేస్తాడు.

News April 24, 2024

KCR మోకాళ్ల యాత్ర చేసినా డిపాజిట్ రాదు: కోమటిరెడ్డి

image

TG: కేసీఆర్ బస్సు యాత్రపై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఆయన మోకాళ్ల యాత్ర చేసినా నల్గొండ, భువనగిరిలో డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలకు కాలం చెల్లిందని, పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ రాదని, త్వరలో తండ్రీకొడుకులు జైలుకెళతారని అన్నారు.

News April 24, 2024

రేపు ఉ.10 గంటలకు శ్రీవారి టికెట్లు విడుదల

image

తిరుమల శ్రీవారి జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 కోటా) టికెట్లను టీటీడీ రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. అలాగే జులై నెలకు సంబంధించి తిరుమల, తిరుపతిలో వసతి కోటా టికెట్లను కూడా ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. అటు వృద్ధులు, వికలాంగుల కోటా టికెట్లు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదలయ్యాయి.