News April 24, 2024

బంగ్లాకు భారత మహిళా క్రికెట్ జట్టు

image

భారత మహిళా క్రికెటర్లు బంగ్లాదేశ్‌కు పయనమయ్యారు. ఐదు టీ20ల సిరీస్ కోసం హర్మన్ ప్రీత్ నాయకత్వంలో 16 మందితో కూడిన జట్టు బెంగళూరు నుంచి సిల్హెట్‌కు తరలి వెళ్లింది. భారత్-బంగ్లా మధ్య ఈ నెల 28న తొలి టీ20తో సిరీస్ మొదలుకానుంది. ఈ నెల 30న, మే 2, 6, 8 తేదీల్లో మిగతా మ్యాచ్‌లు జరుగుతాయి.

News April 24, 2024

కవితకు బెయిల్ ఇవ్వొద్దు: ఈడీ

image

లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్ట్‌పై కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఆమె అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగిందని, బెయిల్ ఇవ్వొద్దని ఈడీ వాదిస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో కవిత స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేయాల్సి ఉందని, బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు లాయర్ కోరారు. కాసేపట్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది.

News April 24, 2024

భారత్‌లో 14ఏళ్ల గరిష్ఠానికి వ్యాపార కార్యకలాపాలు!

image

భారత్‌లో వ్యాపారం శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఈనెలలో వ్యాపార కార్యకలాపాలు 14ఏళ్ల గరిష్ఠానికి చేరాయి. మార్చి నెలలో 61.8గా ఉన్న వ్యాపార కార్యకలాపాల సూచీ ఈనెలలో 62.2కు చేరినట్లు HSBC పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) వెల్లడించింది. మానుఫాక్చరింగ్, సర్వీస్ సెక్టార్లు రాణించడమే ఈ వృద్ధికి కారణమని పేర్కొంది. 800 సంస్థలపై సర్వే చేపట్టి ఈ విషయాలు వెల్లడించింది.

News April 24, 2024

ప్రతిపక్షంలో ముద్దులు.. అధికారంలో పిడిగుద్దులు: బాబు

image

AP: సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టారని.. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు కురిపిస్తున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు. ‘అప్పట్లో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. కానీ ఇప్పుడు జగన్ మాత్రం సొంత చెల్లికే ఆస్తి కాకుండా అప్పులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటోంది. రాష్ట్రంలోని ప్రతీ మహిళను లక్షాధికారి చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

News April 24, 2024

కేజ్రీవాల్, కవితకు రిమాండ్ పొడిగింపు

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జుడీషియల్ రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. మే 7 వరకు(14 రోజులు) పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు చెప్పారు. కవిత జుడీషియల్ రిమాండ్ నేటితో ముగియగా ఆమెను ఈడీ, సీబీఐ వర్చువల్‌గా కోర్టులో హాజరుపర్చాయి. దీంతో కవిత రిమాండ్‌ను కోర్టు పొడిగించింది.

News April 24, 2024

విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వడంలో తప్పులేదు.. కానీ..: వెంకయ్య

image

ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తున్నాయని విమర్శించారు. విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వడంలో తప్పులేదని, కానీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు ఏమాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. హామీల అమలుకు నిధులు లేక మళ్లీ అప్పులు చేయడం సరికాదని వెంకయ్య అన్నారు.

News April 24, 2024

RECORD: 1,400 మందికి 590 మార్కులు

image

AP: ఈ ఏడాది పదో తరగతి విద్యార్థుల్లో చాలా మందికి టాప్ మార్కులు వచ్చాయి. దాదాపు 1,400 మందికి 590, ఆ పైన మార్కులు వచ్చాయి. గతంలో ఎన్నడూ ఇంత మందికి 590 మార్కులు రాలేదు. 18,000 మంది 570+ మార్కులు సాధించారు. ప్రభుత్వ స్కూళ్లలో 104 మందికి 590 పైగా మార్కులు వచ్చాయి. ఇక అన్నమయ్య జిల్లాలోని ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినికి 597 మార్కులు వచ్చాయి.

News April 24, 2024

‘సీఎం జగన్‌పై దాడి’.. రేపటికి తీర్పు రిజర్వ్

image

AP: సీఎం జగన్‌పై దాడి చేసిన కేసులో తీర్పును విజయవాడ కోర్టు రేపటికి రిజర్వ్ చేసింది. నిందితుడు సతీశ్‌ను ఏడు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌‌పై కోర్టు నేడు విచారణ చేపట్టింది.

News April 24, 2024

వెంటనే పాన్ పొందాలా.. ఇలా చేయండి!

image

ఆర్థిక లావాదేవీల విషయంలో పాన్ కార్డు తప్పనిసరి. మరి అత్యవసరంగా పాన్ నంబర్ కావాలంటే ఎలా? దానికి ఐటీ విభాగం ఫ్రీగా ఇ-పాన్‌ను అందిస్తోంది. దీని కోసం https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్ లింక్‌లోకి వెళ్లాలి. అక్కడి క్విక్ లింక్స్‌ సెక్షన్లో ఇన్‌స్టంట్ ఇ-పాన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తదనంతరం సూచించే విధంగా అనుసరిస్తే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే చాలు.. మీ పాన్ నంబర్ రెడీ.

News April 24, 2024

దుబాయ్ ఎలా మారిందో చూశారా..!

image

గల్ఫ్ దేశాలను ఇటీవల వరదలు వణికించిన సంగతి తెలిసిందే. ఏడాదిన్నర కాలంలో కురిసే వర్షం కొన్ని గంటల్లోనే కురవడంతో నీరు ముంచెత్తింది. ఉపగ్రహ చిత్రాల్లో ఆ తీవ్రత స్పష్టంగా కనిపించింది. నాసాకు చెందిన ల్యాండ్‌శాట్-9 తీసిన ఫొటోల్లో వరద గుంటలు నీలిరంగులో కనిపిస్తున్నాయి. కాగా.. దుబాయ్‌లో వర్షాలు కురవడం మిగిలిన ఖండాల పర్యావరణానికి అంత మంచిది కాదంటూ పర్యావరణ నిపుణుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.