News June 4, 2024

చంద్రబాబు, పవన్‌కు కేసీఆర్ అభినందనలు

image

ఏపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్‌కు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న వీరికి శుభాకాంక్షలు తెలిపారు.

News June 4, 2024

NEET UG ఫలితాలు రిలీజ్.. 89 మందికి 720/720

image

దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET యూజీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థి అప్లికేషన్ నంబర్, DOBతో ఫలితాలు తెలుసుకోవచ్చు. MBBS, BDS, BSMS, BUMS BHMS కోర్సుల ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తుంటారు. ఈసారి 89 మందికి 720/720 మార్కులు వచ్చాయి. దీంతో లాటరీ విధానం ద్వారా AIIMS ఢిల్లీలో సీటు ఎవరికి వస్తుందో నిర్ణయిస్తారు. గతేడాది ఇద్దరికి మాత్రమే 720 మార్క్స్ వచ్చాయి.

News June 4, 2024

పల్నాడులో చెల్లని నెల్లూరు అ’నిల్’!

image

AP: వైసీపీ మాస్ లీడర్ అనిల్ కుమార్ యాదవ్‌ని పల్నాడు ప్రజలు ఆదరించలేదు. నెల్లూరు సిటీ MLAగా ఉన్న ఆయనను నరసరావుపేట MP అభ్యర్థిగా YCP నిలబెట్టింది. గతంలో ఇక్కడ నెల్లూరు జిల్లా నేతలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి వలసొచ్చి గెలిచారు. అయితే ఈ సెంటిమెంట్ ఈసారి వర్కౌట్ కాలేదు. యాదవ వర్గం ఓట్లు దాదాపు లక్ష ఉన్నప్పటికీ అనిల్‌కు కలిసిరాలేదు. లక్షన్నర ఓట్లకు పైగా తేడాలో ఓటమి చవి చూశారు.

News June 4, 2024

యంగెస్ట్, ఓల్డెస్ట్ ఎంపీలు వీరే!

image

యూపీలోని సమాజ్‌వాది పార్టీకి చెందిన పుష్పేంద్ర సరోజ్(కౌశాంబి), ప్రియ సరోజ్(మచ్లిషహర్) లోక్‌సభకు ఎన్నికైన అతిపిన్న వయస్కులుగా నిలిచారు. వీరిద్దరూ 25 ఏళ్లకే ఎంపీగా ఎన్నికయ్యారు. మరోవైపు తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ డీఎంకే అభ్యర్థి TR బాలు(82) లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన అతిపెద్ద వయస్కునిగా నిలిచారు.

News June 4, 2024

చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్న పవన్ కుమారుడు

image

AP: ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చి పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారంపై చర్చించారు. ఈ క్రమంలో పవన్ కుమారుడు అకీరా నందన్.. చంద్రబాబు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.

News June 4, 2024

భారీ విజయం దిశగా కూటమి MP అభ్యర్థులు

image

కూటమి పార్లమెంట్ అభ్యర్థులు ఉత్తరాంధ్రలో భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. శ్రీకాకుళం TDP MP అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 3,14,107, VZM TDP అభ్యర్థి అప్పలనాయుడు 2,41,740.. విశాఖ TDP అభ్యర్థి భరత్ 4,73,013.. అనకాపల్లి BJP MP అభ్యర్థి C.M.రమేష్ 2,85,529 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. అరకులో YCP అభ్యర్థి తనూజా రాణి 54,264 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. మొత్తం 5 MP స్థానాలకు నాలుగింటిలో కూటమి సత్తా చాటింది.

News June 4, 2024

నిజమే గెలిచింది: భువనేశ్వరి

image

AP: విజయం సాధించిన కూటమి అభ్యర్థులకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అభినందనలు చెప్పారు. ‘నా సంకల్పం.. “నిజం గెలవాలి” అన్న నా ఆకాంక్ష ఫలించింది. అంతిమంగా నిజమే గెలిచింది. ఇంతటి చారిత్రాత్మక విజయం అందించిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు. అద్భుత ప్రజాదరణతో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థులందరికీ అభినందనలు’ అని ఆమె ట్వీట్ చేశారు.

News June 4, 2024

ఏడోసారి MLAగా గెలిచిన అయ్యన్నపాత్రుడు

image

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడు ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి పి. ఉమాశంకర్‌ గణేష్‌‌పై 23,860కి పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1983లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అయ్యన్న.. ఇప్పటి వరకు 10 సార్లు MLAగా పోటీ చేశారు. 7 సార్లు గెలుపొందారు. గత ఎన్నికల్లో YCP అభ్యర్థి గణేష్ చేతిలో 22,839 ఓట్ల తేడాతో అయ్యన్న ఓటమిపాలయ్యారు.

News June 4, 2024

AP అభివృద్ధికి అంతా కలిసి పనిచేస్తాం: మోదీ

image

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీయేకు అసాధారణమైన విజయాన్ని అందించారని, వారు అందించిన ఆశీస్సులకు ధన్యవాదాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలను ఆయన అభినందించారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని, రాబోయే కాలంలో రాష్ట్రం అభివృద్ధి చెందేలా కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు.

News June 4, 2024

అసెంబ్లీకి వెళ్లాలనుకున్నారు.. పార్లమెంట్‌కు పంపించారు

image

TG: కరీంనగర్ సిటింగ్ ఎంపీగా ఉంటూ 2023లో అక్కడి నుంచే అసెంబ్లీకి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఓటమిచెందారు. అయితే ఈ ఎన్నికల్లో ఎంపీగా మళ్లీ పోటీకి దిగి 2.12లక్షల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన అసెంబ్లీకి వెళ్లాలని అనుకున్నా కరీంనగర్ ప్రజలు మాత్రం పార్లమెంట్‌లో ఉండండంటూ తీర్పునిచ్చారు.