News October 29, 2025

దేవుడు ఎవరిపై అనుగ్రహం చూపుతాడంటే?

image

‘భక్త్యాత్యనన్యయా శక్యః’ అంటుంది భగవద్గీత. అంటే అనన్య భక్తి కల్గిన వారికే దేవుడు స్వాధీనమవుతాడని అర్థం. ఎలాంటి ఆశలు లేకుండా, కేవలం భగవంతుడిపైనే విశ్వాసం ఉంచి, ఆయనతో నిలబడే భక్తులపైనే ఆయన అనుగ్రహం ఉంటుంది. అనన్య భక్తితో పూజ, సేవ, నామస్మరణ, కీర్తన, జపం, ధ్యానం వంటి సాధనలు చేసే వారికి, ఆ దేవుడు కేవలం స్వామీ, రక్షకుడే కాకుండా, వారి హృదయాలలో సులభంగా లభించేవాడుగా, స్వాధీనమయ్యేవాడుగా ఉంటాడు. <<-se>>#WhoIsGod<<>>

News October 29, 2025

ఇందిరా గాంధీ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

ఢిల్లీలోని ఇందిరా గాంధీ హాస్పిటల్‌ 26 రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మెడిసిన్, పీడియాట్రిక్స్, అనస్తీషియా, జనరల్ సర్జరీ, గైనకాలజీ, రేడియో-డయాగ్నోసిస్ ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, DNB, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు నవంబర్ 7 వరకు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. వెబ్‌సైట్: https://igh.delhi.gov.in/

News October 29, 2025

ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

image

మొంథా తుఫాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని IMD తెలిపింది. ఏపీలోని గుంటూరు, ప్రకాశం, టీజీలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. కాగా ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

News October 29, 2025

ఆర్థిక పొదుపు.. తెలివిగా ఆలోచించు!

image

మెరుగైన భవిష్యత్తు కోసం ఆర్థిక నిర్వహణ అత్యవసరం. ప్రతి నెల ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ‘ముఖ్యంగా క్రెడిట్ కార్డు అప్పులను త్వరగా తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఊహించని ఖర్చుల కోసం కనీసం 3-6 నెలల జీవన వ్యయానికి సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం తెలివైన పని. ఈ అలవాట్లు స్థిరమైన ఆర్థిక భద్రతను అందిస్తాయి’ అని చెబుతున్నారు.

News October 29, 2025

వరి పంట.. గింజ గట్టిపడే దశలో ఉంటే ఏం చేయాలి?

image

గింజ గట్టిపడే దశలో వరి పంట ఉంటే.. ముందుగా పొలంలో నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. గింజలో నిద్రావస్థ తొలగి నిలబడి ఉన్న. పడిపోయిన చేలలో మొలక వచ్చే అవకాశం ఉంది. కోత దశలో లేదా పడిపోయిన పంటలో కంకిలో మొలకలు కనబడితే, 5% ఉప్పు ద్రావణం (50 గ్రాములు కల్లు ఉప్పును లీటరు నీటికి కలపాలి) కలిపి పిచికారీ చేస్తే మొలకెత్తడాన్ని, రంగు మారడాన్ని నివారించవచ్చని ఏపీ వ్యవసాయశాఖ తెలిపింది.

News October 29, 2025

మహిళలు ఎక్కువ ఒత్తిడికి గురయ్యేది ఇందుకే!

image

తాను పనిచేస్తుంటే హెల్ప్ చేయకుండా ఫోన్ చూస్తూ విశ్రాంతి తీసుకుంటున్న భర్తను చూసి మహిళలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇది ఉద్యోగం కంటే కూడా ఎక్కువ స్ట్రెస్ ఇస్తుందని తేలింది. ఇంటి పనులు, వంట, పిల్లల సంరక్షణతో మహిళల్లో కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయులు పెరుగుతాయి. ఇది సోమరితనం కాదని, బాధ్యతల్లో అసమతుల్యత అని నిపుణులు చెబుతున్నారు. *ఇంట్లో భార్యకు హెల్ప్ చేయండి బాస్

News October 29, 2025

భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 110 అప్రెంటిస్‌లు

image

సంగారెడ్డిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (<>BDL<<>>)లో 110 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. www.apprenticeshipindia.gov.in పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థులు టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కులు, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులు అనర్హులు. వెబ్‌సైట్: https://bdl-india.in/

News October 29, 2025

ఇంటి చిట్కాలు

image

* ఓవెన్‌ని క్లీన్ చేయడానికి ఒక బౌల్‌లో నిమ్మ ముక్కల్ని వేసి ఓవెన్‌లో పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత ఒక తడి క్లాత్‌తో ఓవెన్‌ని తుడిస్తే సరిపోతుంది.
* గ్లాస్‌ ఓవెన్‌ డోర్‌పై బేకింగ్‌ సోడా-నీళ్లు కలిపి రాసి పొడి క్లాత్‌తో తుడిస్తే మరకలు వదిలిపోతాయి.
* కిచెన్‌ సింక్, వాష్‌బేసిన్లపై పడే మరకలపై టూత్‌పేస్ట్‌ పూసి అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఆపై స్పాంజ్‌తో రుద్ది కడిగేస్తే మరకలు సులభంగా వదిలిపోతాయి.

News October 29, 2025

60 మంది డ్రగ్ పెడ్లర్ల కాల్చివేత

image

2,500మంది బ్రెజిల్ పోలీసులు, జవాన్లు రియోలో డ్రగ్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌పై సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. 60మంది అనుమానితులను కాల్చివేశారు. 81 మందిని అరెస్ట్ చేశారు. నలుగురు పోలీసులూ చనిపోయారు. 93 రైఫిల్స్, 500కిలోల డ్రగ్స్ సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో హెలికాప్టర్లు, ఆర్మ్‌డ్ వెహికల్స్‌ ఉపయోగించారు. ఈ దాడిని UN హ్యూమన్ రైట్స్ ఆఫీస్ ఖండించింది. విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.

News October 29, 2025

APPLY NOW: ICMRలో ఉద్యోగాలు

image

ICMR-న్యూఢిల్లీ 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. MBBS/MD/MS/PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1500. SC/ST/PWBD/EWS/మహిళలకు ఫీజు లేదు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.icmr.gov.in/