News October 29, 2025

గొర్రె, మేక పిల్లల పెంపకం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

గొర్రె, మేక పిల్లలు పుట్టాక వారం వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి నుంచి సరిపడా పాలు అందుతున్నాయా? లేదా? గమనించాలి. ఇది వాటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెటర్నరీ డాక్టరు సూచన మేరకు దాణా అందించాలి. రెండు నుంచి ఐదు నెలల వరకు జొన్నలను దాణాగా ఇవ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలను పెట్టాలి. విటమిన్స్, కాల్షియం దాణాలో తగినంత ఉండేలా చూడాలి. పిల్లలకు 3 నెలల వయసులో డీవార్మింగ్ ప్రారంభించాలి.

News October 29, 2025

పెరిగిన బంగారం, వెండి ధరలు!

image

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రా.ల బంగారం ధర రూ.760 పెరిగి రూ.1,21,580కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా.ల పసిడి ధర రూ.700 ఎగబాకి రూ.1,11,450గా ఉంది. అటు కేజీ వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,66,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 29, 2025

బాత్రూమ్‌లో ఈ తప్పులు చేయకండి!

image

బాత్రూమ్‌లో స్నానం చేసేటప్పుడు చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.
*బాత్రూంలో ఫోన్ వాడొద్దు.
*మూత తెరిచి ఫ్లష్ చేస్తే వ్యాధికారక క్రిములు వ్యాపిస్తాయి.
*ఎక్కువ సేపు కమోడ్‌పై కూర్చుంటే పైల్స్ రావచ్చు.
*రోజూ వేడి నీటి స్నానం చర్మాన్ని పొడి బారుస్తుంది.
*ఎక్కువ సబ్బు వాడటం చర్మానికి హానికరం.
*బలంగా టవల్‌తో రుద్దితే అది చర్మానికి నష్టం కలిగిస్తుంది. Share it

News October 29, 2025

ఆ రూ.20 లక్షలు మాకొద్దు: బాధితురాలు

image

కరూర్‌ తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాల సహాయార్థం TVK చీఫ్ విజయ్ రూ.20 లక్షల చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. అయితే మృతుల్లో ఒకరైన రమేశ్ భార్య సంఘవి ఆ డబ్బును తిప్పి పంపడం చర్చనీయాంశమైంది. ‘మాకీ డబ్బు ముఖ్యం కాదు. నేరుగా వచ్చి పరామర్శిస్తానని, ముందు డబ్బు తీసుకోమని చెప్పారు. ఆయన పరామర్శ కోసం ఎదురుచూశాం. చెన్నై సమావేశానికి వెళ్లేందుకు మేము నిరాకరిస్తే మా బంధువులను తీసుకెళ్లారు’ అని తెలిపారు.

News October 29, 2025

ప్యాడ్స్ వాడితే దద్దుర్లు వస్తున్నాయా?

image

పీరియడ్స్‌లో అమ్మాయిలు చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ప్యాడ్స్ వాడటం వల్ల దద్దుర్లు, దురద వేధిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కాటన్ ప్యాడ్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సెంటెడ్ ప్లాస్టిక్ పూత ఉన్న ప్యాడ్స్ వల్ల గాలి ప్రసరణ జరగక సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే 4-6 గంటలకు ఓ సారి ప్యాడ్స్ మార్చాలి. మైల్డ్, సువాసన లేని సబ్బు, గోరువెచ్చని నీటితో వెజినాని క్లీన్ చేయడం వల్ల కూడా సమస్య అదుపులో ఉంటుంది.

News October 29, 2025

30 ఇంజినీర్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో 30 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు.. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.590, SC,ST,దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/

News October 29, 2025

సహజ సేద్యంతో ఎక్కువ లాభం.. ఎందుకంటే?

image

వ్యవసాయంలో సహజ సేద్య పద్ధతుల వైపు నేడు చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం ఈ విధానంలో పెట్టుబడి ఖర్చు తగ్గడమే. సహజ సేద్యంలో లాభాలు తొలుత ఆలస్యమైనా, కొంత కాలానికి సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న రైతులతో సమానంగా ఆదాయం వస్తుంది. క్రిమిసంహారక మందులు, ఎరువులపై వెచ్చించే వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణానికి, మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మహిళలు ఎక్కువగా ఈ విధానం అనుసరిస్తున్నారు.

News October 29, 2025

ముక్తిని ప్రసాదించే భగవంతుడి నామ స్మరణ

image

భగవంతుని నామాన్ని పలకడానికి భక్తి ఉన్నా లేకున్నా, శుచిగా ఉన్నా లేకున్నా ‘దేవుడా! నీవే శరణం’ అని మనసులో అనుకుంటే చాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అపవిత్ర స్థితిలో కూడా ఆయన నామాన్ని స్మరించవచ్చట. సూర్యుని ప్రకాశానికి చీకటి అడ్డులేని విధంగా దైవ నామం స్మరించే వారికి ఇహలోక దుఃఖాలు, పాపాలు అంటవని, ముక్తి లభిస్తుందని వాక్కు. నామస్మరణ చేయువారు కాలానుగుణ కర్మలు చేయకున్నా ఏం కాదని పండితులు అంటున్నారు.<<-se>>#Bakthi<<>>

News October 29, 2025

TG: మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వానలు పడతాయంటూ IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పిల్లల్ని బయటికి పంపించొద్దని తల్లిదండ్రులకు సూచించారు.

News October 29, 2025

BELలో 340 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) 340 ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. BE, B.Tech, BSc(Eng) ఫస్ట్ క్లాస్‌లో పాసైనవారు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అప్లికేషన్ ఫీజు రూ.1180, SC/ST/ PwBDలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.