India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రఫ్ఫాడించింది. తెలంగాణలో ఇప్పటికే 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ 8 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ 8 అసెంబ్లీ స్థానాల్లో జెండా పాతింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి NO. 8 బాగా కలిసొచ్చిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో ఈ పార్టీ 4 స్థానాల్లోనే గెలిచింది.
లోక్‌సభ ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో పొత్తుల వైపు దృష్టి సారించాయి. ఇప్పటికే తమతో పొత్తు ఉన్న పార్టీలను కాపాడుకోవడంతో పాటు ప్రతిపక్ష పార్టీలను ఆకర్షించే ప్రయత్నాలు మొదలెట్టాయి. ఓ వైపు ఇండియా కూటమి BJD, జేడీ(యూ), టీడీపీతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ NDAలోని పార్టీలతో ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదింపులు చేసి పదవులు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.
కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా, ఇప్పటివరకు బీజేపీ 16, కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధించాయి. జేడీ(ఎస్) 2 చోట్ల గెలుపొందింది. బీజేపీ, కాంగ్రెస్ చెరో స్థానంలో లీడింగ్‌లో ఉన్నాయి. అటు తమిళనాడులో కాంగ్రెస్ ఒక చోట గెలిచి, 8 స్థానాల్లో ముందంజలో ఉంది. సీపీఎం ఒక చోట గెలిచి, మరో స్థానంలో లీడింగ్‌లో కొనసాగుతోంది. డీఎంకే 22, VCK 2, సీపీఐ 2 చోట్ల గెలవగా, MDMK, IUML తలో చోట ఆధిక్యంలో ఉన్నాయి.
AP: వైఎస్ జగన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. విజయవాడ రాజ్‌భవన్‌లోని గవర్నర్ నజీర్‌కు రాజీనామా లేఖను పంపారు. కాగా 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ.. ఇప్పటివరకు 9 సీట్లలోనే విజయం సాధించింది.
AP: ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని, కక్షసాధింపుల సమయం కాదని కార్యకర్తలకు జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించారు. ‘ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే సమయం. అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండాల్సిన సమయం. రక్షణ లేని ఆడబిడ్డలకు రక్షణ కల్పించే సమయం. వైఎస్ జగన్ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం పనిచేయడమే నా లక్ష్యం’ అని పవన్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి భారీగా సీట్లు పెరగడం వెనక పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కృషి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచడంలో రాహుల్ సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. ఇప్పుడు ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాకపోయినా వచ్చే ఎన్నికల నాటికి పార్టీ తరఫున రాహుల్ ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలుస్తారని అభిప్రాయపడుతున్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి అధిక స్థానాలు కైవసం చేసుకోవడంపై కాంగ్రెస్ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ విక్టరీ సింబల్ చూపిస్తూ ఫొటోకు పోజిచ్చారు. కాగా ప్రస్తుతం ఎన్డీఏ 293, ఇండియా కూటమి 232 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు కలిసొస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నాలుగోసారి ముఖ్యమంత్రి కాబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ అభినందనలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. మీ నాయకత్వం, దార్శనికత చాలా కాలంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు స్ఫూర్తిదాయకం. భారతదేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు మీపై ఆధారపడి ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. మొత్తం 10 స్థానాల్లో విజయం సాధించారు. ఆమదాలవలస, ఇచ్ఛాపురం, నరసన్నపేట, పలాస, పాతపట్నం, రాజాం, శ్రీకాకుళం, టెక్కలిలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా.. పాలకొండలో జనసేన, ఎచ్చెర్లలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. గత ఎన్నికల్లో 10 స్థానాలకు గాను 8 స్థానాల్లో గెలిచిన వైసీపీ ఇప్పుడు ఒక్కస్థానంలో కూడా విజయాన్ని దక్కించుకోలేకపోయింది.
AP: రాష్ట్రంలో ఎనిమిది మంది మాజీ సీఎంల వారసులు ఎన్నికల కదనరంగంలో కాలుదువ్వారు. ఇందులో YS జగన్, నారా లోకేశ్, బాలకృష్ణ, పురందీశ్వరి(BJP), కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి(TDP), నాదెండ్ల మనోహర్(జనసేన) విజయదుందుభి మోగించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, నేదురుమల్లి రామ్‌కుమార్(వెంకటగిరి, వైసీపీ) ఓటమి పాలయ్యారు. కాగా లోకేశ్, కోట్ల తొలిసారి ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి వెళ్లనున్నారు.
Sorry, no posts matched your criteria.