India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో 30 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు.. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.590, SC,ST,దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/

వ్యవసాయంలో సహజ సేద్య పద్ధతుల వైపు నేడు చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం ఈ విధానంలో పెట్టుబడి ఖర్చు తగ్గడమే. సహజ సేద్యంలో లాభాలు తొలుత ఆలస్యమైనా, కొంత కాలానికి సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న రైతులతో సమానంగా ఆదాయం వస్తుంది. క్రిమిసంహారక మందులు, ఎరువులపై వెచ్చించే వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణానికి, మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మహిళలు ఎక్కువగా ఈ విధానం అనుసరిస్తున్నారు.

భగవంతుని నామాన్ని పలకడానికి భక్తి ఉన్నా లేకున్నా, శుచిగా ఉన్నా లేకున్నా ‘దేవుడా! నీవే శరణం’ అని మనసులో అనుకుంటే చాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అపవిత్ర స్థితిలో కూడా ఆయన నామాన్ని స్మరించవచ్చట. సూర్యుని ప్రకాశానికి చీకటి అడ్డులేని విధంగా దైవ నామం స్మరించే వారికి ఇహలోక దుఃఖాలు, పాపాలు అంటవని, ముక్తి లభిస్తుందని వాక్కు. నామస్మరణ చేయువారు కాలానుగుణ కర్మలు చేయకున్నా ఏం కాదని పండితులు అంటున్నారు.<<-se>>#Bakthi<<>>

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వానలు పడతాయంటూ IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పిల్లల్ని బయటికి పంపించొద్దని తల్లిదండ్రులకు సూచించారు.

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) 340 ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. BE, B.Tech, BSc(Eng) ఫస్ట్ క్లాస్‌లో పాసైనవారు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అప్లికేషన్ ఫీజు రూ.1180, SC/ST/ PwBDలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి ఆసుపత్రి, జైలు, శ్మశానాన్ని సందర్శించాలని స్పిరిచ్యువల్, లైఫ్ కోచెస్ సూచిస్తున్నారు. ఆసుపత్రిలో ఆరోగ్యం విలువ, జైలులో ఒక తప్పుడు నిర్ణయం జీవితాన్ని ఎలా మారుస్తాయో తెలుస్తుంది. శ్మశానంలో ధనిక, పేద తేడా లేకుండా అందరూ ఒకే నేలలో కలిసిపోతారు. చివరికి మనం మిగిల్చిపోయే జ్ఞాపకాలు, మనతో తీసుకెళ్లే పశ్చాత్తాపాలే ముఖ్యమని ఈ మూడు వివరిస్తాయని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్.

భారీ డేటా ఉల్లంఘనలో 183 మిలియన్లకు పైగా ఈమెయిల్ పాస్‌వర్డ్‌లు లీక్ అయినట్లు AUS సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ట్రాయ్ హంట్ ధ్రువీకరించారు. వీటిలో Gmail ఖాతాల వివరాలు కూడా ఉన్నాయి. మాల్‌వేర్ ద్వారా దొంగిలించిన లాగిన్ ఐడీలతో మొత్తం 3.5 టెరాబైట్ల (875 HD సినిమాలకు సమానం) డేటాను హ్యాకర్స్ రూపొందించారు. మీ ఖాతా వివరాలు లీక్ అయ్యాయో లేదో తనిఖీ చేసుకుని, వెంటనే పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని ట్రాయ్ సూచించారు.

అరటి కాయల పరిమాణం పెరుగుదలకు భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ బంచ్ ఫీడింగ్ మిశ్రమం రూపొందించింది. 100ml నీటిలో 7.5 గ్రా. నత్రజని ఎరువు, 7.5 గ్రాముల పొటాష్ ఎరువు కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని 500 గ్రాముల పేడలో బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని పైన ఫొటోలో చూపినట్లు కాయలు కాసిన తర్వాత క్రింది పువ్వును కత్తిరించి, ఆ మిశ్రమం ఉన్న పాలిథిన్ సంచిలో కాయలు కాసిన కాడకు ఒక అడుగు దూరం వదిలి గట్టిగా కట్టాలి.

పుణ్యకాలాలన్నింటిలోకెల్లా కార్తీకమాసం అత్యుత్తమమైనది. వేదాల కంటే గొప్ప శాస్త్రం, గంగ కంటే గొప్ప తీర్థం, భార్యతో సమానమైన సుఖం, ధర్మంతో సమానమైన స్నేహం లేనట్టే.. ఈ కార్తీక మాసానికి సాటి వచ్చే పుణ్య కాలం లేదు. కార్తీక దామోదరుని (విష్ణువు) కంటే గొప్ప దైవం మరొకరు లేరు. ఈ సత్యాన్ని తెలుసుకొని, ఈ మాసంలో భక్తితో ధర్మాన్ని ఆచరించే వ్యక్తి తప్పక వైకుంఠాన్ని చేరుకుంటాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి.<<-se>>#Karthikam<<>>

CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్, జమ్మూ (IIIM) 19 MTS పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 25 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అభ్యర్థులను రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iiim.res.in/
Sorry, no posts matched your criteria.