News April 19, 2024

ఖరీఫ్ నుంచి వరికి రూ.500 బోనస్ ఇస్తాం: పొన్నం ప్రభాకర్

image

TG: ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌ నుంచి క్వింటా వరికి రూ.500 బోనస్ ఇస్తామని తెలిపారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు కూడా రాబోతున్నాయని చెప్పారు. హుస్నాబాద్‌లో మాట్లాడుతూ.. ‘ఒకట్రెండు రోజుల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిని అధిష్ఠానం ఎంపిక చేస్తుంది. ఆయనను మంచి మెజార్టీతో గెలిపించాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.

News April 19, 2024

లిక్కర్ స్కాం కేసులో అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కేసులోనూ నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. సెక్షన్ 164 కింద సీబీఐ కోర్టులో ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. కాగా ఈడీ కేసులో గతంలోనే శరత్ అప్రూవర్‌గా మారారు. కాగా ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సైతం సీబీఐ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది.

News April 19, 2024

విజయవాడ సెంట్రల్‌లో విజయమెవరిదో?

image

AP: రాష్ట్ర రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షించే విజయవాడ ప్రాంతంలోని కీలక నియోజకవర్గం విజయవాడ సెంట్రల్. 2008లో సెగ్మెంట్ ఏర్పడగా.. కాంగ్రెస్, TDP, YCP చెరొకసారి గెలిచాయి. 2019 ఎన్నికల్లో TDP అభ్యర్థి బోండా ఉమపై మల్లాది విష్ణు(YCP) 25 ఓట్ల తేడాతోనే గెలిచారు. ఈసారి విజయవాడ వెస్ట్ MLA వెల్లంపల్లి శ్రీనివాస్‌ని YCP ఇక్కడ పోటీ చేయిస్తోంది. TDP నుంచి ఉమ మరోసారి పోటీకి సై అంటున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 19, 2024

నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్

image

తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ CM కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు, ఆలూపూరీ వంటివి తింటున్నారని ED ఆరోపించింది. బెయిల్ పొందడం కోసం ఇలా చేస్తున్నారని ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టుకి తెలిపింది. దీనిపై కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. 48 సార్లు భోజనంలో తాను 3 మామిడి పండ్లు మాత్రమే తిన్నానని కోర్టుకు వివరించారు. ఒక్కసారి మాత్రమే ఆలూపూరీ తీసుకున్నానని.. అది కూడా నవరాత్రి ప్రసాదమని తెలిపారు.

News April 19, 2024

ఈ జిల్లాల్లో భారీ వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల బలమైన ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అటు నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో వడగండ్ల వాన పడుతోంది.

News April 19, 2024

కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర: ఆప్

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ కోర్టులో ఆరోపించింది. ‘డయాబెటిస్‌తో బాధపడుతున్న ఆయనకు రోజుకు రెండుసార్లు ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. మేమెంత రిక్వెస్ట్ చేసినా అధికారులు తగినంత డోసు ఇన్సులిన్ ఇవ్వడం లేదు’ అని ఆరోపించింది. ఆయనకు తగిన వైద్యం అందేలా చూడాలని కోర్టును కోరింది. కాగా.. కేజ్రీ కావాలనే షుగర్ పెంచుకుంటున్నారని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

News April 19, 2024

KCR బస్సుయాత్ర షెడ్యూల్ ఖరారు

image

BRS చీఫ్ కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 10 వరకు ఆయన బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రకు ఈసీ వికాస్ రాజ్ కూడా అనుమతి మంజూరు చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 3 లేదా 4 రోడ్ షోలు ఉండనున్నాయి. రోడ్ షోలు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయి. సిద్దిపేట్, వరంగల్ వంటి ప్రాంతాల్లో బహిరంగ సభలు కూడా ఉండనున్నాయి.

News April 19, 2024

గురుకుల ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల

image

TG: తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 11న ఈ పరీక్ష నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. ఎంపికైన విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది. సైట్: https://tgcet.cgg.gov.in

News April 19, 2024

జూన్ 1న ఎగ్జిట్ పోల్స్‌

image

ఎన్నికల పోలింగ్ ముగిశాక వెలువడే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అందరిలో ఆసక్తిని కలిగిస్తాయి. తుది ఫలితాలకు ముందు విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్‌పై భారీగా అంచనాలు ఉండటంతో వీటికి ప్రాధాన్యం పెరిగింది. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ఇవాళ మొదలైంది. జూన్ 1తో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. అదే రోజు సా.6.30 నుంచి ఆయా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడిస్తాయి. జూన్ 4న తుది ఫలితాలు వెలువడుతాయి.

News April 19, 2024

హసన్: అప్పుడు తాతలు.. ఇప్పుడు మనవళ్లు ప్రత్యర్థులు

image

కర్ణాటకలోని హసన్ MP స్థానం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇది మాజీ PM దేవెగౌడ కుటుంబానికి కంచుకోట. ఇలాంటి చోట ఆయనను మాజీ మంత్రి పుట్టస్వామి గౌడ 1999లో తొలిసారి ఓడించారు. ఈసారి వారి మనవళ్లు ప్రజ్వల్(JDS), శ్రేయస్(INC) బరిలో దిగుతున్నారు. దీంతో పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హోళెనరసిపుర MLA స్థానంలో శ్రేయస్ 3వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
<<-se>>#ELECTIONS2024<<>>