News January 25, 2025

APPLY NOW: భారీ జీతంతో ఉద్యోగాలు

image

ESICలో 608 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాలకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. MBBS పూర్తి చేసి, యూపీఎస్సీ నిర్వహించిన CMSE-2022&2023 ఉత్తీర్ణులైన వారు అర్హులు. వయసు 35 ఏళ్లు మించరాదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. ఎంపికైన వారికి రూ.56,100-రూ.1,77,500 జీతం ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News January 25, 2025

ఫల‘సాయం’తో వీరికి పద్మశ్రీ

image

హరిమాన్ శర్మ(హిమాచల్‌), హంగ్‌థింగ్‌(నాగాలాండ్‌)కు ‘పద్మశ్రీ’లు లభించాయి. ఇద్దరూ పళ్ల రైతులే. రోగనిరోధకతతో, చల్లదనం తక్కువగా ఉన్నా పెరిగే ‘HRMN 99’ యాపిల్‌ రకాన్ని శర్మ అభివృద్ధి చేశారు. దేశవిదేశాల్లో ఈ రకానికి చెందిన 14 లక్షల మొక్కల్ని లక్షమందికి పైగా రైతులు పెంచుతున్నారు. ఇక తమ ప్రాంతానికి చెందని పళ్లు, కూరగాయల్ని ఎలా పండించాలన్నదానిపై 40 గ్రామాల్లోని 200మంది రైతులకు హంగ్‌థింగ్ శిక్షణనిచ్చారు.

News January 25, 2025

ఇది దేశం గర్వించదగిన సందర్భం: రాష్ట్రపతి

image

రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఈ గణతంత్ర దినోత్సవం ప్రత్యేకమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఇది యావత్ దేశం గర్వించదగిన సందర్భమన్నారు. అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ చాలా ఎదిగిందని వివరించారు. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని అందరూ స్మరించుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అణుగుణంగా కొత్త చట్టాలను రూపొందించి అమల్లోకి తెచ్చామని ఆమె గుర్తుచేశారు.

News January 25, 2025

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన వారిని ఈ అవార్డులతో సత్కరించింది. డా. నీర్జా భట్ల(ఢిల్లీ), సామాజిక కార్యకర్త భీమ్ సింగ్ భవేశ్(బిహార్), సంగీత విద్వాంసుడు దక్షిణమూర్తి(తమిళనాడు), పండ్ల రైతు హంగ్ తింగ్‌(నాగాలాండ్), హరిమాణ్ శర్మ(హిమాచల్ ప్రదేశ్) పద్మశ్రీకి ఎంపిక చేసింది. పూర్తి లిస్టు మరికాసేపట్లో రానుంది.

News January 25, 2025

మీర్‌పేట్ ఘటనలో కీలక UPDATE

image

HYD మీర్‌పేట్ <<15256609>>హత్య కేసులో<<>> పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటివరకు మిస్సింగ్‌గా ఉన్న కేసును హత్య కేసుగా మార్చారు. మాధవి భర్త గురుమూర్తిని నిందితుడిగా తేల్చారు. ఆమెను భర్త హత్య చేసినట్లు పలు ఆధారాలను సేకరించారు. వాటర్ హీటర్, బకెట్‌పై అవశేషాలను ఫోరెన్సిక్ బృందం గుర్తించింది. మాధవిని చంపి బకెట్‌లో పెట్టి వాటర్ హీటర్‌తో ఉడికించినట్లు తేల్చారు. అవశేషాలను మాధవి DNAతో ఫోరెన్సిక్ బృందం సరిపోల్చనుంది.

News January 25, 2025

బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి: టీపీసీసీ చీఫ్

image

TG: ఇందిరమ్మ ఇళ్లకు PM ఆవాస్ యోజన పేరు పెట్టాలన్న కేంద్ర మంత్రి <<15254662>>బండి సంజయ్‌కు<<>> టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. మోదీకి, ఉక్కు మహిళ ఇందిరకు పోలిక ఏంటని ప్రశ్నించారు. పేదల ఇళ్లకు ఇందిర పేరు పెడితే తప్పేంటన్నారు. ఇందిరను అవమానించిన సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం అనడానికి దావోస్ పెట్టుబడులే నిదర్శనమని తెలిపారు.

News January 25, 2025

విజయసాయి ప్రకటనపై స్పందించిన వైసీపీ

image

AP: రాజకీయాలకు దూరమవుతున్నట్లు <<15252568>>విజయసాయిరెడ్డి<<>> తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ స్వాగతిస్తున్నట్లు ట్వీట్ చేసింది. పార్టీ ఆరంభం నుంచి కష్టాల్లోనూ, విజయాల్లోనూ అండగా ఉన్నారని పేర్కొంది. రాజకీయాలు వీడి వ్యవసాయం చేయాలన్న VSR నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో ఆయనకు మరింత మంచి జరగాలని ఆకాంక్షించింది.

News January 25, 2025

4 పథకాలు.. సీఎం ప్రారంభించేది ఎక్కడంటే?

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. కోస్గి మండలంలోని చంద్రవంచలో మధ్యాహ్నం ఒంటి గంటకు 4 కొత్త పథకాలను ఆయన ప్రారంభిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో పర్యటించి ఈ స్కీములను ప్రారంభించనున్నారు.

News January 25, 2025

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

image

చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జట్టులో పలుమార్పులు చేశారు.
IND: శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్య (C), హార్దిక్, ధ్రువ్ జురెల్, సుందర్, అక్షర్, అర్ష్‌దీప్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
ENG: బట్లర్ (కెప్టెన్‌), సాల్ట్(కీపర్), డకెట్, బ్రూక్, లివింగ్‌స్టోన్, కార్సే, ఓవర్టన్, జె.స్మిత్, అర్చర్, రషీద్, వుడ్.

News January 25, 2025

మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

image

TG: తనకు మంత్రి పదవి కావాలనుకుంటే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసేవాడినని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజలతో ఉన్న అనుబంధంతోనే అక్కడ పోటీ చేశానని పేర్కొన్నారు. మునుగోడు ప్రజలు తనను గతంలో కంటే డబుల్ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు. మినిస్టర్‌ను కావాలనుకుంటే ఏడాది క్రితమే అయ్యేవాడినని వ్యాఖ్యానించారు.