News January 25, 2025

మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

image

TG: తనకు మంత్రి పదవి కావాలనుకుంటే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసేవాడినని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజలతో ఉన్న అనుబంధంతోనే అక్కడ పోటీ చేశానని పేర్కొన్నారు. మునుగోడు ప్రజలు తనను గతంలో కంటే డబుల్ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు. మినిస్టర్‌ను కావాలనుకుంటే ఏడాది క్రితమే అయ్యేవాడినని వ్యాఖ్యానించారు.

News January 25, 2025

ALERT.. రేపు, ఎల్లుండి జాగ్రత్త

image

తెలంగాణలో రానున్న 3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆయా జిల్లాల్లో 11-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

News January 25, 2025

ఒకప్పుడు ఎండిపోయిన కొండ.. కానీ నేడు..

image

MPలోని ఇండోర్‌లో కేసర్ పర్వత్ ఒకప్పుడు పూర్తిగా బీడు వారిన ఓ కొండ ప్రాంతం. కానీ నేడు కశ్మీరీ కుంకుమ పువ్వు మొక్కలు, నేపాలీ రుద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్స్, అవకాడో, ఖర్జూరం వంటి అనేక వృక్షాలకు నెలవు. శంకర్ లాల్ గార్గ్ కృషి ఫలితమే ఆ పచ్చదనం. 2016లో ఆ కొండను కొన్న ఆయన 40వేల చెట్లను పెంచారు. పచ్చదనం చేరికతో ఇప్పుడు 30 రకాల పక్షులు, 25 రకాల సీతాకోకచిలుకలు, పలు జంతువులు ఆక్కడ ఆశ్రయం పొందుతున్నాయి.

News January 25, 2025

సైఫ్ అలీఖాన్‌పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

image

సైఫ్ అలీఖాన్ లవ్ జిహాదీకి పాల్పడి ముంబైలో హీరోలా తిరుగుతున్నారని BJP MLA రాజాసింగ్ అన్నారు. ఆయన మొదటి భార్య అమృతా సింగ్, రెండో భార్య కరీనా కపూర్ ఇద్దరూ హిందువులేనని పేర్కొన్నారు. ‘ఖాన్ మన కూతుళ్లను ట్రాప్ చేస్తున్నారు’ అని ఆరోపించారు. ఆయనపై దాడి చేసింది హిందువు అని ఓ NCP లీడర్ అన్నారని, కానీ బంగ్లాదేశ్ ముస్లిం దాడి చేసినట్లు తేలిందని గుర్తు చేశారు. దీనిపై ఎవరేం మాట్లాడరేంటి అని ప్రశ్నించారు.

News January 25, 2025

ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్.. ఎక్కడ ఉందంటే..

image

ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్‌గా పేర్కొనే దాన్ని 1913లో పూర్తి చేశారు. భూగర్భంలో రెండు అంతస్థుల్లో 44 ఫ్లాట్‌ఫామ్‌లు, 67 ట్రాక్స్ ఆ స్టేషన్లో ఏర్పాటు చేశారు. రోజూ 1.50 లక్షలమంది ప్రయాణికులు, 660 మెట్రో రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయి. న్యూయార్క్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అదీ ఒకటి. పలు హాలీవుడ్ సినిమాల్ని అక్కడ తీయడం విశేషం.

News January 25, 2025

ఫిబ్రవరి 1న ఇళ్ల పంపిణీ: మంత్రి

image

AP: PMAY కింద మార్చిలోపు 7 లక్షల ఇళ్లు నిర్మించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి తెలిపారు. రెండో విడతలో 6 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. ఫిబ్రవరి 1న ప.గో జిల్లా తణుకు(M) తేతలిలో సీఎం చంద్రబాబు ఇళ్ల పంపిణీ ప్రారంభిస్తారని చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్ల స్థలం ఇస్తామని పేర్కొన్నారు.

News January 25, 2025

ఈ-కామర్స్ సంస్థలకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక

image

AP: గిఫ్ట్ కార్డ్ ఓచర్స్ విషయంలో ఈ-కామర్స్ సంస్థలకు Dy CM పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. ‘అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌ను వాడకపోతే అవి నిరుపయోగ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తున్నట్లు నాకు ఫిర్యాదులు వస్తున్నాయి. రూ.కోట్ల ప్రజాధనం వృథా అవుతోంది. RBI గైడ్‌లైన్స్ ప్రకారం కార్డులకు ఏడాది పరిమితి ఉండాలి. ఆ తర్వాత నోటీసులు ఇచ్చాక KYC లింక్ అయిన బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయాలి’ అని స్పష్టం చేశారు.

News January 25, 2025

విజయసాయి బీజేపీలో చేరడం లేదు: పురందీశ్వరి

image

AP: విజయసాయి రెడ్డి బీజేపీలో చేరుతారన్న ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందీశ్వరి అన్నారు. ‘విజయసాయి బీజేపీలో చేరుతారని ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పారా? ప్రతి సభ్యుడికి వారిద్దరూ సపోర్ట్‌గా ఉంటారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ తనకు సపోర్ట్ చేశారని మాత్రమే VSR అన్నారు’ అని గుర్తుచేశారు.

News January 25, 2025

ఆసుపత్రిపై డ్రోన్ దాడి.. 30 మంది మృతి!

image

ఆఫ్రికా దేశం సూడాన్‌లోని ఆసుపత్రిపై డ్రోన్ దాడి కలకలం రేపింది. ఈ దాడిలో ఏకంగా 30 మంది మరణించగా పదుల సంఖ్యలో గాయపడినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. 2023 ఏప్రిల్ నుంచి ఈ దేశంలో సూడాన్ ఆర్మీకి అక్కడ రాపిడ్ ఫోర్స్‌కి మధ్య యుద్ధం కొనసాగుతోంది. కొన్ని వారాల క్రితం ఆసుపత్రిపై ఇదే తరహా డ్రోన్ దాడి జరిగినట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి.

News January 25, 2025

నమ్మిన వాళ్లను జగన్ మోసం చేశారు: షర్మిల

image

AP: బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి రెడ్డి వైసీపీని వీడారని అన్నారు. ‘జగన్‌కు విజయసాయి అత్యంత సన్నిహితుడు. ఎవరిని తిట్టమంటే వారిని తిడతాడు. అలాంటి ఆయన రాజీనామా చేశారంటే చిన్న విషయం కాదు. నమ్మిన వాళ్లను జగన్ మోసం చేశారు. నా అనుకున్న వాళ్లను కాపాడుకోలేక పోతున్నారు. VSRను BJPలోకి పంపుతున్నారు’ అని ఆరోపించారు.