India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
YS జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్‌కు చెందిన ₹793 కోట్ల ఆస్తులను ED జప్తు చేసినట్లు తెలుస్తోంది. అందులో ₹377 కోట్ల విలువైన భూమి ఉంది. భారతీ సిమెంట్స్‌లో క్విడ్ ప్రోకో జరిగిందని.. పునీత్ దాల్మియా, విజయసాయికి మధ్య డీల్ కుదిరిందని తేల్చినట్లు సమాచారం. భారతీ సిమెంట్స్‌లో దాల్మియా పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్చిన లాభంలో రూ.55 కోట్లు 2010-11 మధ్య జగన్‌కు బదిలీ చేశారని గతంలో CBI ఆరోపించింది.
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,508 పాయింట్లు వృద్ధి చెంది 78,553 వద్ద సెటిల్ అయింది. నిఫ్టీ 414 పాయింట్లు లాభపడి 23,851 వద్ద స్థిరపడింది. బ్యాంక్, ఆయిల్, గ్యాస్ సెక్టార్ల షేర్లు దూసుకెళ్లాయి. ఎటర్నల్, ICICI బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, SBI, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ షేర్లు టాప్‌లో నిలిచాయి.
వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘ది గోట్ లైఫ్(ఆడు జీవితం)’ సినిమా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుకలో సత్తా చాటింది. ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంపికవ్వగా మొత్తం 9 విభాగాల్లో పురస్కారాలను కైవసం చేసుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. బ్లెస్సీ తెరకెక్కించిన ఈ సినిమాలో అమలాపాల్ హీరోయిన్గా నటించారు. ఈ మూవీలో పృథ్వీరాజ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి సమాధిపై గుడి గోపురం నమూనాను ప్రతిబింబించడంపై BJP తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. DMK హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్ ట్వీట్ చేశారు. ‘గోపురం నమూనాను ఓ సమాధిపై ఎలా పెడతారు? ఇది అహంకారం, మూర్ఖత్వానికి నిదర్శనం. హిందువుల సెంటిమెంట్లతో ఆడుకుంటున్న DMK మూల్యం చెల్లించుకుంటుంది’ అని వ్యాఖ్యానించారు. 2023లోనూ ఇలాంటి వివాదమే నెలకొంది.
TG: కాంగ్రెస్ నేతలను చూసి BJP భయపడుతోందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. HYDలోని ఈడీ ఆఫీసు ముందు చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సోనియా, రాహుల్ కేసులకు భయపడరని చెప్పారు. బ్రిటిష్ వారికే ఆ కుటుంబం భయపడలేదన్నారు. సంస్థను కాపాడేందుకు ప్రయత్నిస్తే కేసులు పెట్టి విచారణకు పిలుస్తారా అని ప్రశ్నించారు. కేంద్రం తీరును ప్రతి ఒక్కరూ ఎండగట్టాలన్నారు. కార్పొరేట్ సంస్థలపై బీజేపీ ఆధారపడుతోందని ఆరోపించారు.
TG: రాజకీయ కక్షతోనే సోనియా, రాహుల్‌పై కేసులు పెట్టారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. షేర్ హక్కులు లేకుండానే మనీలాండరింగ్ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. రూ.90 కోట్ల అప్పులు ఉన్నా ప్రజల కోసం సంస్థను నడుపుతున్నారని తెలిపారు. దేశం కోసం రాజీవ్ ప్రాణాలు అర్పిస్తే వారి కుటుంబంపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నిరంకుశ ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామన్నారు.
నటి మంచు లక్ష్మి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ‘ఈ యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు. నేను కూడా ఇది వాడుతున్నా’ అంటూ దుండగులు ఆమె ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. విషయం తెలిసిన లక్ష్మి ఇలాంటివి నమ్మొద్దని, తన ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ అయిందని ట్వీట్ చేశారు. తనకు డబ్బు అవసరమైతే సోషల్ మీడియాలో కాకుండా నేరుగా అడుగుతానని, స్టోరీలకు రిప్లై ఇవ్వొద్దని సూచించారు.
కార్లు ఎంత సేఫ్ అనే విషయాన్ని NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్‌ను బట్టి తెలుసుకుంటాం. INDలో 5 స్టార్ రేటింగ్ సాధించిన తొలి SUV కారు టాటా నెక్సాన్. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో ఇది 32 పాయింట్లకు 29.41 పాయింట్లు సాధించింది. ఆ తర్వాత మార్కెట్లోకి వచ్చిన టాటా పంచ్ ఈవీ(31.46/32), మహీంద్రా XUV 400(30.38/32), కియా సిరోస్(30.21/32), స్కోడా కైలాక్(30.88/32) ఫైవ్ స్టార్ రేటింగ్ పొందాయి. మీకు నచ్చిన కారేంటి?
IPL ఆరంభం చప్పగా సాగినా ఇప్పుడు మజా ఇస్తోంది. ఒకదానికి మించి మరొకటి అభిమానులకు థ్రిల్ పంచుతున్నాయి. పంజాబ్‌పై SRH 246 రన్స్ ఛేజింగ్, లక్నోపై ధోనీ ఫినిషింగ్, పంజాబ్ కింగ్స్ టోర్నీ చరిత్రలోనే లోయెస్ట్ టోటల్(111)ను డిఫెండ్ చేసుకోవడం, రాజస్థాన్-ఢిల్లీ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ జరగడంతో ఫ్యాన్స్ థ్రిల్ ఫీలయ్యారు. ఇంకా మున్ముందు ఇంకెన్ని ట్విస్ట్‌లు చూడాలో అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
వేసవి సెలవులు విద్యార్థులకు స్కిల్స్ పెంచుకోవడానికి, డబ్బు సంపాదించడానికి మంచి అవకాశం. ప్రస్తుతం టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు పలు ఆదాయ మార్గాలు ఉన్నాయి. కాల్‌సెంటర్లు/బీపీఓలు, ట్యూటరింగ్/హోమ్ ట్యూషన్లు, రిటైల్, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, క్యాషియర్, డెలివరీ బాయ్, షోరూమ్స్ వంటి వాటిల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. వీరిని పార్ట్‌టైమ్ జాబ్‌లో చేర్చుకోవడానికి కంపెనీలు కూడా సిద్ధంగా ఉంటాయి.
Sorry, no posts matched your criteria.