News October 29, 2025

ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

image

TG: ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని HYD IMD వెల్లడించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, MHBD, WGL, HNK, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, జనగామ, నాగర్ కర్నూల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని తెలిపింది.

News October 29, 2025

దేశవాళీ వరి.. ఒకసారి నాటితే 3 పంటలు పక్కా

image

ఒకసారి నాటితే 3 సార్లు కోతకు వచ్చే ‘తులసి బాసో’ దేశవాళీ వరి రకాన్ని సాగు చేస్తున్నారు చిత్తూరు(D) పలమనేరుకు చెందిన చందూల్ కుమార్‌రెడ్డి. ఇది సువాసన కలిగిన చాలా చిన్న గింజ వరి. మంచి పోషక, ఔషధ గుణాలు కలిగి తినడానికి మధురంగా ఉంటుంది. తొలి పంట 135 రోజులకు, 2వ పంట 60 నుంచి 70 రోజులకు, 3వ పంట 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. ✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News October 29, 2025

ఇతిహాసాలు క్విజ్ – 50

image

1. తులసి దేవికి పూర్వ జన్మలో ఉన్న పేరు ఏంటి?
2. త్రిపురాంతకుడు అంటే ఏ దేవుడు?
3. కర్ణుడి కవచకుండలాలను దానం చేయమని కోరింది ఎవరు?
4. వాక్కుకు అధిష్టాన దేవత ఎవరు?
5. ఎవరి ఆజ్ఞ మేరకు పరశురాముడు తన తల్లి తల నరికాడు?
☛ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 29, 2025

నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

CSIR-నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(NBRI) 17 MTS పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 25 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC,ST,PWBD,మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://nbri.res.in/

News October 29, 2025

‘తులసి బాసో’ వరి రకం ప్రత్యేకతలు ఇవే

image

తులసి బాసో ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర దేశీయ వరి రకం. దీనిలో ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఖరీఫ్‌కి మాత్రమే అనువైన రకం. 135 రోజుల తర్వాత ఎకరాకు 15-18 క్వింటాళ్లు, రెండవ కోతకు 6-8 క్వింటాళ్లు, మూడో కోతకు 5-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొదటి కోతకి మూడో కోతకు గింజ పరిమాణం, సువాసన ఏమాత్రం తగ్గదు. ఎంతటి గాలులనైనా తట్టుకొని పంట ఒరగదు. రైతు ఫోన్ నెంబరు 6300027502, 9440809364.

News October 29, 2025

తుఫానుగా బలహీనపడ్డ మొంథా

image

AP: తీవ్ర తుఫానుగా తీరం దాటిన ‘మొంథా’ తుఫానుగా బలహీనపడినట్లు IMD పేర్కొంది. ‘నర్సాపూర్‌కు పశ్చిమ-వాయవ్య దిశలో 20K.M, మచిలీపట్నానికి ఈశాన్యంగా 50K.M, కాకినాడకు పశ్చిమ-నైరుతి దిశలో 90K.M, విశాఖకు నైరుతి దిశలో 230K.M, గోపాల్‌పూర్(ఒడిశా)కు నైరుతి దిశలో 470K.M. దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాబోయే 6 గంటల పాటు తుఫాను ప్రభావం కొనసాగించి, తదుపరి 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది’ అని పేర్కొంది.

News October 29, 2025

కర్నూలు ప్రమాదం.. బస్సు డ్రైవర్ అరెస్ట్

image

AP: కర్నూలులో జరిగిన ఘోర <<18110276>>బస్సు ప్రమాదం<<>> కేసులో వేమూరి కావేరి ట్రావెల్స్ డ్రైవర్‌ లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేశారు. A2గా ఉన్న బస్సు యజమాని కోసం గాలిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన రమేశ్ అనే ప్రయాణికుడి ఫిర్యాదుతో ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి 10 ని. ముందు అటుగా వెళ్లిన 35మంది డ్రైవర్లను ప్రశ్నించి.. లక్ష్మయ్య నిర్లక్ష్యమూ ప్రమాదానికి కారణమని గుర్తించి అరెస్టు చేశారు.

News October 29, 2025

అంగన్‌వాడీల్లో 14వేల పోస్టులు.. మంత్రి కీలక ఆదేశాలు

image

TG: అంగన్‌వాడీల్లో 14K పోస్టుల నియామకానికి చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఏజెన్సీలో STలకు 100% కోటాపై సుప్రీంకోర్టు స్టే ఎత్తివేతకు వెకేట్ పిటిషన్ వేయాలన్నారు. KA, AP, ఛత్తీస్‌గఢ్‌లో అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వ సర్వీస్‌గా పరిగణించకపోవడంతో 50% రిజర్వేషన్ రూల్ వర్తించట్లేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఇక్కడా అదే విధానాన్ని అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

News October 29, 2025

మామిడిలో చెదను ఎలా నివారించాలి?

image

మామిడిలో OCT నుంచి డిసెంబర్ వరకు చెదల బెడద ఎక్కువ. అందుకే చెట్ల బెరడుపై మట్టి గూళ్లను గమనించిన వెంటనే వాటిని తొలగించాలి. చెట్ల మొదలు, కాండంపైన లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 20EC 3-5ml కలిపి పిచికారీ చేయాలి. తోటలలో, గట్లపై చెద పుట్టలను తవ్వి లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 20 EC 10ml కలిపి పోయాలి. వర్షాలు తగ్గిన తర్వాత తప్పకుండా కాండానికి 2-3 అడుగుల ఎత్తు వరకు బోర్డోపేస్ట్/బ్లైటాక్స్‌ని పూతగా పూయాలి.

News October 29, 2025

పిల్లలు అబద్ధాలు చెబుతున్నారా?

image

పిల్లలు అబద్ధాలు చెప్పడం కామన్. కానీ అన్నిటికీ అబద్ధాలు చెబుతుంటే మాత్రం తల్లిదండ్రులు జాగ్రత్తపడాలంటున్నారు నిపుణులు. చాలావరకు తమను రక్షించుకోవడానికే పిల్లలు అబద్ధాలు చెబుతారు. అసలు వారు ఎందుకు అబద్ధం చెబుతున్నారో తెలుసుకోవాలి. నిజం చెప్పినా ఏంకాదన్న భరోసా వారికి ఇవ్వాలి. అప్పుడే అబద్ధాలు చెప్పకుండా ఉంటారు. తల్లిదండ్రులు తరచుగా అబద్ధాలు చెప్తుంటే పిల్లలూ అదే నేర్చుకుంటారంటున్నారు నిపుణులు.