News January 23, 2025

షమీకి ఏమైంది? నిన్న ఎందుకు ఆడలేదు?

image

ఇంగ్లండ్‌తో T20 సిరీస్‌కు ఎంపికైన భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ నిన్నటి తుది జట్టులో లేకపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. అతడు ఫిట్‌నెస్ సాధించలేదా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా ముగ్గురు స్పిన్నర్లు ఆడించాలని జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించడంతో షమీకి చోటు దక్కలేదని భావిస్తున్నట్లు మ్యాచ్ అయ్యాక అభిషేక్ చెప్పారు. దీంతో 2వ T20లో షమీ తుది జట్టులో ఉండే అవకాశముంది.

News January 23, 2025

Stock Markets: నష్టాలకే అవకాశం..

image

స్టాక్‌మార్కెట్లు నేడు నెగటివ్ జోన్లో మొదలయ్యే అవకాశముంది. గిఫ్ట్‌నిఫ్టీ 40pts మేర పతనమవ్వడం దీనినే సూచిస్తోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. క్రూడాయిల్, US బాండ్ యీల్డులు, బంగారం ధరలు తగ్గినప్పటికీ డాలర్ ఇండెక్స్ పెరగడం కలవరపెడుతోంది. నిఫ్టీ 23,150 పైస్థాయిలో నిలదొక్కుకోవడం కీలకం. నేడు DR REDDY, HPCL, ADANI ENERGY, ADANI GREEN ENERGY, TEJAS NETWORK ఫలితాలు రానున్నాయి.

News January 23, 2025

గణతంత్ర పరేడ్‌లో ఏపీ శకటం

image

ఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిగే 76వ రిపబ్లిక్ డే పరేడ్‌లో 26 శకటాలను ప్రదర్శించనున్నారు. ఇందులో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, 10 కేంద్ర ప్రభుత్వ శకటాలు ఉన్నాయి. దక్షిణాది నుంచి AP, KAలకు అవకాశం దక్కగా, TGకు దక్కలేదు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న AKP(D) ఏటికొప్పాక బొమ్మల శకటానికి స్థానం దక్కింది. అంకుడు కర్రతో చేతితో తయారు చేసే ఈ బొమ్మలకు 2017లో భౌగోళిక గుర్తింపు దక్కింది. ఇవి పర్యావరణ అనుకూలమైనవి.

News January 23, 2025

వారికి ఖాన్స్ కావాలి.. హిందూ నటులను పట్టించుకోరు: BJP నేత

image

బంగ్లాదేశీయుడు నిజంగానే సైఫ్‌ను కత్తితో పొడిచాడా లేక ఆయన యాక్ట్ చేస్తున్నారా అని MH మంత్రి నితేశ్ రాణె ప్రశ్నించారు. పరిస్థితుల్ని గమనిస్తే డౌట్ వస్తోందన్నారు. ‘చూస్తుంటే షరీఫుల్‌ను సైఫ్ స్వయంగా స్వాగతించినట్టు అనిపిస్తోంది. ఇక ప్రతిపక్షాలకేమో ఖాన్ యాక్టర్స్ తప్ప హిందూ నటులపై జాలి ఉండదు. సుశాంత్‌ గురించి సుప్రియా, జితేందర్ ఎప్పుడైనా అడిగారా? సైఫ్, షారుఖ్ కొడుకునైతే పట్టించుకుంటారు’ అని అన్నారు.

News January 23, 2025

సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు

image

AP: మాజీ సీఎం YS జగన్‌కు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు చెందిన సరస్వతీ పవర్, ఇండస్ట్రీస్ కోసం పల్నాడు జిల్లాలో కొనుగోలు చేసిన భూముల్లోని ప్రభుత్వ, అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. మాచవరం(మ) వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లిలో 4.84 ఎకరాల దస్తావేజులను రద్దు చేస్తున్నట్లు తహశీల్దార్ ప్రకటించారు. డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు భూముల్లో సర్వే చేసి GOVT భూములను గుర్తించారు.

News January 23, 2025

పొద్దున చలి.. మధ్యాహ్నం ఎండ

image

TG: రాష్ట్రంలో పొద్దున, రాత్రి చలి వణికిస్తుండగా మధ్యాహ్నం ఎండ దంచుతోంది. ఉదయం 9 గంటలైనా పొగమంచుతో కూడిన చలి ఉంటోంది. సాయంత్రం 6 అయితే చాలు ఉష్ణోగ్రతలు పడిపోయి గజగజ మొదలవుతోంది. చాలా జిల్లాల్లో 10 డిగ్రీలలోపు టెంపరేచర్ నమోదవుతోంది. ఇక మధ్యాహ్నం ఎండ సుర్రుమంటోంది. 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ఈ భిన్న వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

News January 23, 2025

హైదరాబాద్ నుంచి వియత్నాంకు విమాన సర్వీస్

image

TG: మార్చి 18 నుంచి హైదరాబాద్, వియత్నాం మధ్య విమాన సర్వీస్ అందుబాటులోకి రానుంది. వియట్‌జెట్ సంస్థ నడిపే ఈ విమాన సర్వీసులు వారంలో రెండు రోజులు(మంగళ, శనివారం) మాత్రమే అందుబాటులో ఉంటాయి. హోచిమన్ సిటీ(వియత్నాం) నుంచి రాత్రి 7.40కు బయల్దేరే ఫ్లైట్ రాత్రి 10.35కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుతుంది. రాత్రి 11.35కు శంషాబాద్‌లో బయల్దేరి, తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు వియత్నాం చేరుతుంది.

News January 23, 2025

పౌర విమానయానంలో 15% వృద్ధి: రామ్మోహన్

image

PM మోదీ నేతృత్వంలో భారత్ ముందుకెళ్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అత్యుత్తమ విధానాలే బలమైన దేశంగా మారడానికి కారణమని చెప్పారు. ‘ప్రపంచ దేశాలన్నీ అవకాశాల కోసం భారత్ వైపు చూస్తున్నాయి. పౌర విమానయాన రంగాన్ని సుస్థిరం చేయడమే మా లక్ష్యం. ఏఐ, డీప్ టెక్ లాంటి సాంకేతికత ద్వారా సేవలు మరింత విస్తృత పరుస్తాం. పౌరవిమానయాన రంగం ప్రస్తుతం 15% వృద్ధి చెందుతోంది’ అని దావోస్‌లో రామ్మోహన్ తెలిపారు.

News January 23, 2025

తెలంగాణలో JSW రూ.800 కోట్ల పెట్టుబడులు

image

TGలో రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు JSW సంస్థ దావోస్‌లో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. USకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 200 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి. రక్షణ రంగంలో అత్యాధునిక టెక్నాలజీతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.

News January 23, 2025

కాలేజీలు బంద్ చేస్తామని హెచ్చరిక

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీకి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విజ్ఞప్తి చేశాయి. బకాయిలు విడుదల కాకపోతే కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించాయి. ఏడాది నుంచి సిబ్బంది జీతభత్యాలు, భవనాల అద్దెలు కూడా చెల్లించలేకపోతున్నామని యాజమాన్యాలు విన్నవించాయి. ప్రభుత్వం జాప్యం చేయకుండా ఫీజు బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని కోరాయి.