India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి చెల్లించాల్సిన బకాయిలు 15 రోజుల్లో జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో తెలిపారు. గత ప్రభుత్వం మొత్తం రూ.1674.40 కోట్లు బకాయి పెట్టిందన్నారు. రైతుల ఇబ్బందులు గుర్తించి ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు చెల్లించామని, మరో రూ.674.40 కోట్లు 15 రోజుల్లో అకౌంట్లలో వేస్తామని ఆయన స్పష్టం చేశారు.
TG: పాలిటెక్నిక్ డిప్లొమాలో చేరాలనుకునే విద్యార్థులకు నేటి నుంచి ప్రత్యేక విడత ప్రవేశాలు నిర్వహిస్తామని ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన వెల్లడించారు. ఇందుకు ఈరోజు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. 27న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అదే రోజు ప్రారంభమవుతుందని తెలిపారు. 28న కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈనెల 31న సీట్లు కేటాయిస్తారు. AUG 2న సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి.
ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న పారిస్‌లోనే 124 ఏళ్ల క్రితం 1900లో తొలిసారిగా భారత్ పేరు వినపడింది. ఈ పోటీల్లో కోల్‌కతాలో జన్మించిన నార్మన్ ప్రిచార్డ్ అనే బ్రిటిష్ ఇండియన్ పాల్గొని 200m స్ప్రింట్‌లో వెండి పతకం సాధించారు. అయితే అతను ఇండియాకు ఆడలేదని కొందరు వాదించినా భారత్‌కే ప్రాతినిధ్యం వహించారని ఒలింపిక్ కమిటీ తేల్చి చెప్పింది. ఆ తర్వాత 1920 ఒలింపిక్స్‌లో ఐదుగురు భారతీయులు పాల్గొన్నారు. <<-se>>#Olympics2024<<>>
TG: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ మరణించాడు. చర్లపల్లిలో జైలులో ఉన్న సయ్యద్ అనారోగ్య కారణాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దేశవ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో అతను నిందితుడిగా ఉన్నట్లు NIA గుర్తించింది. కొన్ని నెలల క్రితమే అతనిపై HYDలో కేసు నమోదు కాగా ట్రాన్సిట్ వారెంట్‌పై ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు.
TG: భూమిలేని రైతుకూలీల ఆర్థిక, జీవన పరిస్థితులు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నిన్న బడ్జెట్ సందర్భంగా డిప్యూటీ CM భట్టి విక్రమార్క తెలిపారు. వారికి ఏటా రూ.12వేలు ఇస్తామని, ఆ బృహత్ కార్యక్రమాన్ని ఈఏడాదే ప్రారంభిస్తామని ప్రకటించారు. అలాగే ఈ సంవత్సరం నుంచి ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనలో చేరాలని నిర్ణయించినట్లు చెప్పారు. రైతుల తరఫున మొత్తం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.
AP: పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికల్లా పూర్తయ్యే అవకాశం ఉందని కేంద్రం ప్రకటించింది. ప్రాజెక్టు ప్రగతిపై లోక్‌సభలో TDP MPల ప్రశ్నలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ జవాబిచ్చారు. జాప్యానికి కారణాన్ని అన్వేషించే పనిని IIT-Hకు ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. ‘ఆలస్యానికి కాంట్రాక్టర్ మార్పు, భూసేకరణ, సహాయ పునరావాసం ఆలస్యం, కొవిడ్ మహమ్మారి కారణాలని IIT నివేదిక ఇచ్చింది’ అని తెలిపారు.
ఒలింపిక్స్‌కు మూలాలు గ్రీస్‌లోని ఒలింపియాలో ఉన్నాయి. ఈ గేమ్స్ తొలిసారిగా 776 BCEలో జరగగా, 393 CE తర్వాత ఇవి నిలిచిపోయాయి. 1894లో బారన్ పియరీ అనే ఫ్రెంచ్ వ్యక్తి ఒలింపిక్స్ నిర్వహించాలని ప్రతిపాదించడంతో ఈ పోటీలకు పునర్వైభవం వచ్చింది. తొలి మోడర్న్ ఒలింపిక్స్ గ్రీస్‌లో జరగగా 241 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ టోర్నీ ఇప్పుడు మళ్లీ ఒలింపిక్స్‌కు పునర్వైభవం తెచ్చిన బారన్ స్వదేశంలోనే జరగడం విశేషం. <<-se>>#Olympics2024<<>>
TG: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇవాళ బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో అత్యధికంగా 4.8c.m.ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. మరి మీ ప్రాంతంలో వర్షం పడుతోందా?
TG: రాష్ట్రంలో కొత్తగా మరో 9,000 బీటెక్ సీట్ల కల్పనకు కసరత్తు పూర్తయింది. ఇవి నేడో, రేపో అందుబాటులోకి రానున్నాయి. బీటెక్‌లో ప్రవేశాలకు నేటి నుంచి రెండో విడత కౌన్సెలింగ్ మొదలవుతుంది. 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరగనుంది. కాగా ఈ రెండు రోజుల్లోనే విద్యాశాఖ నుంచి కొత్త సీట్లపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
AP CM చంద్రబాబు ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. శనివారం(రేపు) అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో సీఎం పాల్గొంటారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సాయంత్రం 5గంటలకు ఆయన ఢిల్లీకి బయల్దేరుతారు. మరోవైపు కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల విషయంలో అన్యాయం చేసిన కారణంగా ఈ నీతి ఆయోగ్ మీటింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.