India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలన్న ఇంజినీర్ల ప్రతిపాదనకు CM రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని నుంచి సుందిళ్లకు 80TMCల నీటిని గ్రావిటీ ద్వారా తరలించి, అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టి నిర్మాణంతో MHలో ఏర్పడే ముంపుపై అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలని నీటిపారుదల శాఖ సమీక్షలో సూచించారు.

AP: తీవ్ర తుఫానుతో రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో విద్యాసంస్థలకు నేడూ సెలవులు ఉండనున్నాయి. విజయనగరం, మన్యం, అనకాపల్లి, అల్లూరి, విశాఖ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కడప, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సెలవు ఇచ్చారు. కాకినాడలో 31 వరకు సెలవులు కొనసాగుతాయి. నెల్లూరు, అనకాపల్లి, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో కాలేజీలకు ఇవాళ సెలవు ఉంది.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 50 మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, CA/CMA/CS/CFA, ఫైనాన్స్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC,ST,దివ్యాంగులు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in/

మన ఇంట్లో వస్తువుల అమరిక మనపై శుభాశుభ ఫలితాలను చూపుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ప్రతికూల శక్తి రాకుండా ఉండాలంటే.. వాడని, తుప్పు పట్టిన, ఆగిపోయిన గడియారం వంటి వస్తువులను వెంటనే తీసివేయాలని అంటున్నారు. ‘కిటికీలు, తలుపులపై సెలనైట్ రాళ్లు ఉంచడం శుభం. గ్యాస్ స్టవ్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. లేదంటే ఆర్థిక సమస్యలు రావొచ్చు. రోజూ అగరబత్తి వెలిగిస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది’ అంటున్నారు.

కొన్ని రకాల చెట్ల నుంచి పచ్చి లేత కొమ్మలను సేకరించి పొలంలో వేసి కలియదున్నడాన్నే పచ్చి ఆకు ఎరువు అంటారు. పొలంలో దుక్కి చేసే రోజే లేత కొమ్మలు, ఆకులను చేనంతా వేసి భూమిలో కలియదున్నాలి. ఇది క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి మట్టిని సారవంతం చేస్తుంది. ఈ భూమిలో వేసిన పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. కానుగ, సీతాఫలం, అవిశ, తంగేడు, వేప వంటి మొక్కలను పచ్చి ఆకు ఎరువు కోసం ఎంపిక చేసుకోవచ్చు.

EPFO వేతన పరిమితిని నెలకు ₹15,000 నుంచి ₹25,000కు పెంచే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం బేసిక్ పే గరిష్ఠంగా ₹15వేల వరకు ఉన్న ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు మాత్రమే దీని పరిధిలోకి వస్తున్నారు. వారికి EPF, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) అమలవుతున్నాయి. ఇప్పుడు ఈ పరిమితిని ₹25వేలకు పెంచే విషయంపై త్వరలో జరిగే EPFO సెంట్రల్ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

ఇంటి గుమ్మం, మెట్లపై కూర్చోవడం అరిష్టమని పండితులు చెబుతున్నారు. ఇది లక్ష్మీదేవిని ఆహ్వానించే మార్గాన్ని అడ్డుకున్నట్టు అవుతుందని అంటున్నారు. ‘గడపను మనం దైవసమానంగా భావిస్తాం. అందుకే పర్వదినాల్లో అలంకరిస్తాం. అలాంటి దైవసమానమైన గడపపై కూర్చుంటే ఆ దైవాన్ని అవమానించినట్లే. సైన్స్ పరంగా.. ఇంట్లో నుంచి బయటకి వెళ్లే బ్యాక్టీరియాను, నెగెటివ్ ఎనర్జీని వెళ్లకుండా అడ్డుకున్నట్లు అవుతుంది’ అని అంటున్నారు.

AP: మొంథా తీవ్ర తుఫానుతో రాష్ట్రంలో ఇవాళ అతిభారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, NTR, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

ఏ పంటకైనా అదును(అనుకూల సమయం) ముఖ్యం. సరైన సమయానికి విత్తనం వేయకపోతే పంట సరిగా రాదు, దాని వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ముసలి వయసులో పిల్లలు పుడితే, వారు తల్లిదండ్రులకు అండగా నిలబడలేరు లేదా వారికి సేవ చేయలేరు. ఈ రెండూ సమయానికి చేయని పనులు లేదా నిష్ప్రయోజనమైన పరిస్థితులను తెలియజేస్తాయి.
☛ మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి.

RRB 3,058 అండర్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు NOV 27 వరకు అప్లై చేసుకోవచ్చు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి. 18- 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
Sorry, no posts matched your criteria.