News October 29, 2025

మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా?

image

మన ఇంట్లో వస్తువుల అమరిక మనపై శుభాశుభ ఫలితాలను చూపుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ప్రతికూల శక్తి రాకుండా ఉండాలంటే.. వాడని, తుప్పు పట్టిన, ఆగిపోయిన గడియారం వంటి వస్తువులను వెంటనే తీసివేయాలని అంటున్నారు. ‘కిటికీలు, తలుపులపై సెలనైట్ రాళ్లు ఉంచడం శుభం. గ్యాస్ స్టవ్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. లేదంటే ఆర్థిక సమస్యలు రావొచ్చు. రోజూ అగరబత్తి వెలిగిస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది’ అంటున్నారు.

News October 29, 2025

పంట దిగుబడిని పెంచే పచ్చి ఆకు ఎరువు అంటే ఏమిటి?

image

కొన్ని రకాల చెట్ల నుంచి పచ్చి లేత కొమ్మలను సేకరించి పొలంలో వేసి కలియదున్నడాన్నే పచ్చి ఆకు ఎరువు అంటారు. పొలంలో దుక్కి చేసే రోజే లేత కొమ్మలు, ఆకులను చేనంతా వేసి భూమిలో కలియదున్నాలి. ఇది క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి మట్టిని సారవంతం చేస్తుంది. ఈ భూమిలో వేసిన పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. కానుగ, సీతాఫలం, అవిశ, తంగేడు, వేప వంటి మొక్కలను పచ్చి ఆకు ఎరువు కోసం ఎంపిక చేసుకోవచ్చు.

News October 29, 2025

EPFO వేతన పరిమితి త్వరలో రూ.25వేలకు పెంపు?

image

EPFO వేతన పరిమితిని నెలకు ₹15,000 నుంచి ₹25,000కు పెంచే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం బేసిక్ పే గరిష్ఠంగా ₹15వేల వరకు ఉన్న ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు మాత్రమే దీని పరిధిలోకి వస్తున్నారు. వారికి EPF, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) అమలవుతున్నాయి. ఇప్పుడు ఈ పరిమితిని ₹25వేలకు పెంచే విషయంపై త్వరలో జరిగే EPFO సెంట్రల్ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

News October 29, 2025

గుమ్మంపై ఎందుకు కూర్చోకూడదు?

image

ఇంటి గుమ్మం, మెట్లపై కూర్చోవడం అరిష్టమని పండితులు చెబుతున్నారు. ఇది లక్ష్మీదేవిని ఆహ్వానించే మార్గాన్ని అడ్డుకున్నట్టు అవుతుందని అంటున్నారు. ‘గడపను మనం దైవసమానంగా భావిస్తాం. అందుకే పర్వదినాల్లో అలంకరిస్తాం. అలాంటి దైవసమానమైన గడపపై కూర్చుంటే ఆ దైవాన్ని అవమానించినట్లే. సైన్స్ పరంగా.. ఇంట్లో నుంచి బయటకి వెళ్లే బ్యాక్టీరియాను, నెగెటివ్ ఎనర్జీని వెళ్లకుండా అడ్డుకున్నట్లు అవుతుంది’ అని అంటున్నారు.

News October 29, 2025

BIG ALERT: ఇవాళ అతిభారీ వర్షాలు

image

AP: మొంథా తీవ్ర తుఫానుతో రాష్ట్రంలో ఇవాళ అతిభారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, NTR, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

News October 29, 2025

అదును తప్పిన పైరు.. ముదిమిలో బిడ్డలు ఒక్కటే

image

ఏ పంటకైనా అదును(అనుకూల సమయం) ముఖ్యం. సరైన సమయానికి విత్తనం వేయకపోతే పంట సరిగా రాదు, దాని వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ముసలి వయసులో పిల్లలు పుడితే, వారు తల్లిదండ్రులకు అండగా నిలబడలేరు లేదా వారికి సేవ చేయలేరు. ఈ రెండూ సమయానికి చేయని పనులు లేదా నిష్ప్రయోజనమైన పరిస్థితులను తెలియజేస్తాయి.
☛ మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి.

News October 29, 2025

ఇంటర్ అర్హతతో RRBలో 3,058 పోస్టులు

image

RRB 3,058 అండర్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు NOV 27 వరకు అప్లై చేసుకోవచ్చు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి. 18- 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News October 29, 2025

మానవ జన్మకు అర్థమిదే..

image

ఈ ప్రపంచంలో మనం వేరే రూపంలో కనిపించడానికి కారణం మాయ ప్రభావం. అందుకే దీనిని జన్మ అంటారు. పుట్టిన ప్రతి వ్యక్తికి చివరికి నశించిపోయే స్వభావం ఉంటుంది. అందుకే అతన్ని జీవుడని పిలుస్తాము. జీవుడంటే పుట్టినప్పటి నుంచే అనేక కష్టాలు, ఆశలు అనే బంధాలలో చిక్కుకున్నవాడు అని కూడా అర్థం. మనం ఈ బంధాల నుంచి పూర్తిగా బయటపడాలంటే మాతాపితృ రూపమైన శివలింగాన్ని (జన్మలింగాన్ని) పూజించాలి. అర్చించాలి. <<-se>>#SIVOHAM<<>>

News October 29, 2025

తెలంగాణ న్యూస్ అప్‌డేట్స్

image

☛ ప్రభుత్వ జూ.కాలేజీలకు వైట్, అంచుల్లో బ్లూ కలర్ మాత్రమే వేయాలని ఇంటర్ విద్యాశాఖ ఆదేశాలు
☛ నేటి నుంచి CPGET (MA, M.Com, MSc) చివరి విడత కౌన్సెలింగ్.. NOV 1 వరకు రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, NOV 2-4 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు, 9న సీట్ల కేటాయింపు
☛ బీఫార్మసీ, బయో మెడికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో స్పాట్ ప్రవేశాలకు ఈనెల 30 వరకు గడువు

News October 29, 2025

ఆలయంలో దైవ దర్శనం ఎలా చేసుకోవాలి?

image

ఆలయానికి వెళ్తే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించాలి. గర్భాలయంలో దేవుణ్ని మొక్కేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు. దేవుని దృష్టికి అడ్డు రాకుండా పక్కకు జరిగి దర్శించుకోవాలి. కళ్లు మూయకుండా.. తెరిచే భగవంతున్ని దర్శించుకోవాలి. ఆయన దివ్య స్వరూపాన్ని, తేజస్సును మనసులో పదిలం చేసుకోవాలి. మన దృష్టిని భగవంతునిపై నిలిపి, అనుగ్రహాన్ని పొందాలి. దర్శనం తర్వాత ప్రశాంతంగా ప్రదక్షిణలు చేయాలి.