India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రవ్యాప్తంగా ఊళ్లలో రోడ్లను మరమ్మతులు చేసేందుకు రూ.1121.85 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. వీటిలో పెండింగ్ బిల్లుల చెల్లింపులకు రూ.258.85 కోట్లు ఇవ్వాల్సి ఉండగా పనుల్ని పూర్తి చేసేందుకు రూ.863 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. వర్షాకాలంలో అనేక చోట్ల రోడ్లు అధ్వానంగా తయారుకావడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లపాలవుతున్న సంగతి తెలిసిందే.
నేడు ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో మధ్యాహ్నం గం.1కు, రాజ్యసభలో మధ్యాహ్నం గం.2కు ఈ సర్వేను ప్రవేశపెడతారు. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. FY24 (2023-24)లో భారత్ ఆర్థిక స్థితి, సాధించిన వృద్ధి మొదలైన అంశాలపై ఈ సర్వే అవగాహన కల్పిస్తుంది. బడ్జెట్‌ను అంచనా వేయడంలోనూ ఇది కీలకంగా వ్యవహరిస్తుంది.
తెలంగాణలో మరో మూడు రోజులు, ఏపీలో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ఇరు రాష్ట్రాల వాతావరణ శాఖలు వెల్లడించాయి. పగటివేళంతా ముసురు వానలు కురుస్తుండగా రాత్రిళ్లు మాత్రం దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు గోదావరి, కృష్ణా నదులు వరద నీటితో ఉరకలెత్తుతున్నాయి. కాగా భద్రాచలంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
NEET-UG2024 వ్యవహారంపై నేటి నుంచి సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. CJI జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం నీట్‌కు సంబంధించిన 40 పిటిషన్లను విచారించనుంది. వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లు అన్నింటినీ సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలన్న ఎన్టీఏ అభ్యర్థనను కూడా విచారిస్తుంది.
ఎనిమిది అడుగుల పొడవు, ఏడడుగుల వెడల్పు ఉన్న బోనులో తనను బంధించి హింసిస్తున్నారని పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుంచే ఓ బ్రిటిష్ పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినట్లు డాన్ పత్రిక తెలిపింది. ‘కనీసం కదలడానికి కూడా చోటు లేదు. ఖైదీలకు ఉండే ప్రాథమిక హక్కులూ లేవు. ఉగ్రవాదిలా చూస్తున్నారు’ అని ఆయన వాపోయారంది. కాగా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇమ్రాన్ రావల్పిండి జైల్లో ఖైదీగా ఉన్నారు.
పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 12 వరకు ఇవి కొనసాగుతాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ సమావేశాల్లో ఆరు బిల్లులను సభామోదం కోసం ప్రభుత్వం తీసుకురానుంది. మరోవైపు నీట్ పేపర్ లీకేజీ, రైలు ప్రమాదాలు, కన్వర్ యాత్ర ఘటన వంటి అంశాలను విపక్షాలు లేవనెత్తనున్నాయి. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతోంది.
TG: రాష్ట్ర ఆర్టీసీలో వచ్చే ఐదేళ్లలో 10వేల ఖాళీలు ఏర్పడనున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60ఏళ్లకు పెంచడంతో 2020, 2021లో ఎవరూ రిటైర్ కాలేదు. 2022 నుంచి రిటైర్మెంట్లు ప్రారంభం కాగా గతఏడాది ఏకంగా 2325 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది 2196, 2025లో 1859, 2026లో 2001, 2027లో 1,927 మంది పదవీ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా 2029 వరకు పదివేల మందికిపైగా పదవీ విరమణ పొందనున్నట్లు సమాచారం.
TG: అల్యూమినియం టిన్నులను ఉత్పత్తి చేసే ‘బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్’ సంస్థ రాష్ట్రంలో ₹700కోట్లతో యూనిట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఈ యూనిట్ ఏర్పాటుతో 500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో అల్యూమినియం టిన్నుల్లో బీర్లను బాట్లింగ్ చేయడానికి ఎక్సైజ్ విధానంలో మార్పులు చేయాల్సి ఉంటుందని.. దీనిపై సీఎం, ఎక్సైజ్ మంత్రి జూపల్లితో చర్చిస్తానని పేర్కొన్నారు.
AP: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరగనుంది. సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. ఈనెల 26 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
యూపీలోని ఫతేపూర్ జిల్లాకు చెందిన <<13620550>>వికాస్<<>> ద్వివేదీ తాను ఏడుసార్లు పాముకాటుకు గురయ్యానని పేర్కొనడం ఇటీవల వైరలైంది. నిజంగానే పాము పగబట్టిందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ అతను ఒక్కసారే పాము కాటుకు గురయ్యాడని దర్యాప్తులో తేలింది. స్నేక్ ఫోబియా వల్ల ఆ తర్వాత పాముకాట్లకు గురైనట్లు భ్రమపడ్డాడని వైద్యాధికారులు తెలిపారు. అతనికి పరీక్షలు చేయకుండానే వైద్యులు ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఈ సంగతి తెలియలేదట.
Sorry, no posts matched your criteria.