News October 29, 2025

క్రెడిట్ కార్డులతో రికార్డు స్థాయి కొనుగోళ్లు

image

సెప్టెంబర్‌లో క్రెడిట్ కార్డులతో రికార్డు స్థాయి (₹2.17 లక్షల కోట్లు) కొనుగోళ్లు జరిగాయి. ఆగస్టుతో పోలిస్తే ఇది 14% అధికం. ఫెస్టివల్ సీజన్, బ్యాంకులు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల డిస్కౌంట్లు, ఆఫర్లతో పాటు GST రేట్లలో కోత ఇందుకు కారణాలుగా మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2025 మార్చిలో ₹2.015 ట్రిలియన్, ఆగస్టులో ₹1.91T కొనుగోళ్లు నమోదయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇది ₹1.76లక్షల కోట్లుగా ఉంది.

News October 29, 2025

సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడిలా ఎలా మారాడు?

image

పూర్వకాలంలో సంవత్సర ప్రారంభాన్ని కృత్తికా(కార్తీక) నక్షత్రంతో లెక్కించేవారు. ఆ నక్షత్రంతో సుబ్రహ్మణ్య స్వామికి ఓ గొప్ప అనుబంధం ఉంది. ఈ నక్షత్రం ఆరు తారల సమూహం. సుబ్రహ్మణ్య స్వామిని కూడా షణ్ముఖుడు అని అంటారు. అంటే ఆరు తలలు గలవాడు అని అర్థం. ఆకాశంలో ఉన్న ఈ ఆరు కృత్తికా నక్షత్రాలే తల్లి రూపంలో వచ్చి ఆయనకు పాలు ఇచ్చాయట. అందువల్లే ఆయనకు కార్తికేయుడు అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

News October 29, 2025

నేడు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

image

AP: తుఫాన్ వల్ల పత్తి రైతులు నష్టపోకూడదని తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 30 కొనుగోలు కేంద్రాలు నేడు ప్రారంభం కానున్నాయి. క్వింటాలుకు ₹8,110 మద్దతు ధర ఖరారు చేశారు. రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను CM యాప్‌లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకోవాలి. తర్వాత ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి.

News October 29, 2025

భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడే తొలి టీ20

image

భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి T20 మ్యాచ్ ఇవాళ కాన్‌బెర్రాలోని మనూక ఓవల్ మైదానంలో జరగనుంది. మ.1.45 గంటలకు మ్యాచ్ ప్రారంభవుతుంది. ODI సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన IND, 5 మ్యాచుల T20 సిరీస్‌ను గెలవాలని భావిస్తోంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు.
IND XI (అంచనా): అభిషేక్ శర్మ, గిల్, తిలక్, సూర్య(C), శాంసన్, దూబే, అక్షర్, సుందర్/కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్‌దీప్

News October 29, 2025

రెడ్ అలర్ట్‌లో ఆ జిల్లాలు: మంత్రి లోకేశ్

image

AP: తుఫాను వల్ల రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘కాకినాడ, కోనసీమ, ప.గో., కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను అత్యధిక తీవ్రత కలిగిన ప్రాంతాలుగా గుర్తించాం. అవి రెడ్ అలర్ట్‌లో ఉన్నాయి. ఎలాంటి ప్రాణ నష్టం ఉండకూడదనేదే మా లక్ష్యం’ అని ట్వీట్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఈ రాత్రికి ఆయన RTGS కేంద్రంలోనే బస చేయనున్నారు.

News October 29, 2025

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

image

◆ బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన పర్మినెంట్ ఉద్యోగులకు ₹15,400, కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ₹7,535 చొప్పున బహుమానం.. తిరుమల, తిరుపతి సిబ్బందికి అదనంగా 10%
◆ గోశాలల నిర్వహణకు నిపుణుల కమిటీ ఏర్పాటు.. నివేదిక ఆధారంగా సంస్కరణలు
◆ కొనుగోలు విభాగంలో అవకతవకలపై ACBతో విచారణ
◆ కాణిపాకం ఆలయం వద్ద ₹25Crతో యాత్రికుల వసతి సముదాయం, వివాహ హాల్స్ నిర్మాణానికి ఆమోదం

News October 29, 2025

సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్న రజినీ?

image

రజినీకాంత్, కమల్ హాసన్ కాంబోలో ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 2027లో షూటింగ్ ప్రారంభవుతుందని, రజినీకి ఇదే చివరి సినిమా అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు తర్వాత రిటైర్ కావాలని ఆయన డిసైడయ్యారట. కాగా ఆయన ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్-2’ చేస్తున్నారు. ఆ తర్వాత సి.సుందర్‌తో ఓ మూవీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. రజినీ-కమల్ మూవీని నెల్సన్ తెరకెక్కిస్తారని సమాచారం.

News October 29, 2025

రాబోయే 2-3 గంటల్లో వర్షాలు

image

TG: గద్వాల్, MBNR, NGKL, నారాయణపేట్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. HNK, HYD, మేడ్చల్, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్, WGL జిల్లాల్లోనూ వానలు కురుస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆయా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. మీ ప్రాంతంలో వాన పడుతోందా?

News October 29, 2025

తీరం దాటిన తీవ్ర తుఫాన్

image

AP: మొంథా తీవ్ర తుఫాన్ మచిలీపట్నం-కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రా.11:30 గంటల నుంచి రా.12:30 మధ్య తీరాన్ని దాటిందని APSDMA తెలిపింది. ఇది రానున్న 6 గంటల్లో తుఫానుగా బలహీనపడుతుందని వెల్లడించింది. కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో ఈదురుగాలులు భారీగా వీస్తున్నాయి. ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది.

News October 29, 2025

అక్టోబర్ 29: చరిత్రలో ఈరోజు

image

1899: కవి, స్వాతంత్ర్య సమరయోధుడు నాయని సుబ్బారావు జననం
1940: రచయిత కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి మరణం
1953: సినీ దర్శకుడు, నిర్మాత ఘంటసాల బలరామయ్య మరణం
1971: ఒడిశాలో తుఫాన్ తాకిడికి 10వేల మంది మృతి
1976: డాన్స్ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ జననం
2005: వలిగొండ వద్ద రైలు పట్టాలు తప్పి వాగులో పడిపోవడంతో 116 మంది మృతి (ఫొటోలో)