India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ట్రంప్ ప్రమాణం, డాలర్ దూకుడు, Q3 ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. SENSEX 76,775 (+151), NIFTY 23,231 (+28) వద్ద చలిస్తున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా షేర్లకు డిమాండ్ ఉంది. ఆటో, FMCG, IT, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. KOTAK, WIPRO టాప్ గెయినర్స్.

నాగసాధువులు ఒంటిపై నూలు పోగు లేకుండా ఉంటారు. దీనికి కారణం వారు ఎలాంటి కోరికలు లేకుండా ఉండటమే. మనిషి ప్రపంచంలోకి నగ్నంగా వస్తాడని ఇదే సహజ స్థితి అని వారు నమ్ముతారు. ఈ భావనతోనే వారు దుస్తులు ధరించరని చెబుతారు. ప్రతికూల శక్తుల నుంచి రక్షించేందుకు పవిత్రమైనదిగా భావించే బూడిదను ఒంటికి పూసుకుంటారు. వారు చేసే సాధనలు, అభ్యాసాలతో ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకొని జీవిస్తారు.

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అమెరికాలో భారీగా కలెక్షన్లు రాబడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా $2 మిలియన్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. గతంలో లేని విధంగా పండగకు ప్రభంజనం సృష్టిస్తోందని తెలిపింది. మరోవైపు ఓవరాల్‌గా ఈ సినిమా కలెక్షన్లు రూ.200 కోట్లకు చేరువైనట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

TG: ఏడాది కాంగ్రెస్ పాలనలో కటింగులు, కటాఫ్‌లు మినహా తెలంగాణకు ఒరిగింది ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ, రైతుభరోసా, కరెంట్, కేసీఆర్ కిట్, తులం బంగారం, మహాలక్ష్మీ రూ.2,500తో సహా ఇచ్చిన హామీలన్నింటిలోనూ కటింగ్ చేస్తుందని దుయ్యబట్టారు. ‘అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు కట్టించి ఎందుకు ఇవ్వరు? డబుల్ బెడ్రూంలకు మూడురంగులు వేసి మురిపిస్తున్న కాంగ్రెస్ సర్కార్? జాగో తెలంగాణ జాగో’ అని రాసుకొచ్చారు.

AP: విజయనగరం(D) నెల్లిమర్ల మిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థి సాయి మణిదీప్(24) ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు ఫ్యామిలీకి అతడు రాసిన లేఖ కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘డాడీ, అమ్మ, తమ్ముడు నన్ను క్షమించండి. కష్టపడి చదువుదామంటే నాతో కావడంలేదు. బతకాలంటే భయమేస్తోంది. 8-9 నెలల నుంచి సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి. పదేళ్లుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టా. నాలాంటి పిచ్చోడు బతకకూడదు’ అని రాసిన లేఖ వైరలవుతోంది.

బంగాళదుంపలను ఆహారంలో రోజు కాకుండా వారానికి రెండు, మూడు రోజులు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటికి వేడి స్వభావం ఉండటం వల్ల వాంతులు, విరేచనాలతో పాటు జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశముందని అంటున్నారు. రక్తపోటు, మధుమేహ సమస్యలు ఉన్న వారు తినడం తగ్గించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వీటిని నూనెలో వేయించి తినడం కంటే ఉడకబెట్టుకొని తినడం మేలు అని చెబుతున్నారు.

బెంగళూరులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. లాటరీలో మొబైల్ గెలుచుకున్నారంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌కి కొరియర్‌లో ఫోన్ పంపారు. నిజమేనని నమ్మిన అతను కొత్త ఫోన్‌లో సిమ్ వేశాడు. ఇదే అదనుగా నేరగాళ్లు మొబైల్‌ను తమ అధీనంలోకి తీసుకొని ఖాతా నుంచి రూ.2.8 కోట్ల నగదు కాజేశారు. మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోలీసులను ఆశ్రయించాడు.

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కి సీల్దా కోర్టు నేడు శిక్ష ఖరారు చేయనుంది. గతేడాది AUG 9న RGకర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిని రేప్ చేసి చంపేశారు. ఈ కేసులో అక్కడ పనిచేసే సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 3 రోజుల క్రితం కోర్టు అతడిని దోషిగా తేల్చింది. అటు దీని వెనుక మరింత మంది ఉన్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

నేటి నుంచి ఆఫీస్‌లు, పాఠశాలలు పూర్తిస్థాయిలో పనిచేయనున్న నేపథ్యంలో సంక్రాంతి పండగకు ఊరెళ్లిన ప్రజలు తెల్లవారుజామునే హైదరాబాద్‌లో వాలిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి నిన్న రాత్రి బయల్దేరి మహానగరంలో అడుగుపెట్టారు. దీంతో మెట్రో రైళ్లు, RTC బస్సులు రద్దీగా ప్రయాణిస్తున్నాయి. MGBS, JBS సహా అమీర్‌పేట్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, LBనగర్ తదితర ప్రాంతాలు RTC, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో సందడిగా మారాయి.

TG: ఇందిరమ్మ ఇళ్లు అందజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అర్హుల ఎంపిక కోసం సర్వే నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 30.29 లక్షల కుటుంబాలకు ఇళ్లు లేవని తేలింది. వీటిలో 18.68 లక్షల ఫ్యామిలీలకే సొంత స్థలం ఉంది. తొలి విడతలో సొంత స్థలం ఉన్నవారికే ఆర్థిక సాయం చేయాలని సర్కార్ భావిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత విడతలవారీగా రూ.5లక్షల చొప్పున మంజూరు చేయనుంది.
Sorry, no posts matched your criteria.