News January 19, 2025

పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్

image

ప్రముఖ యంగ్ సింగర్ దర్శన్ రావల్ పెళ్లి చేసుకున్నారు. తన ప్రియురాలు ధరల్ సురేలియాతో కలిసి ఏడడుగులు వేశారు. వీరికి అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2014లో ఇండియాస్ రా స్టార్ ఫస్ట్ సీజన్ ద్వారా ఇతను గుర్తింపు పొందారు. హిందీ, గుజరాతీ సినిమాల్లో వందకు పైగా పాటలు పాడారు. తెలుగులో నాని ‘జెర్సీ’ సినిమాలో ‘నీడ పడదని మంటననగలరా’ పాటను ఆలపించారు.

News January 19, 2025

సైఫ్ అలీఖాన్ హెల్త్ అప్డేట్

image

కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ అలీఖాన్ కోలుకుంటున్నారని ఆయన సోదరి సోహా అలీఖాన్ తెలిపారు. ‘అన్నయ్య ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. కోలుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సైఫ్ కోసం ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు’ అని ఆమె మీడియాతో అన్నారు. ఈనెల 16న అర్ధరాత్రి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆయనను కత్తితో పొడిచాడు. మూడు రోజుల అనంతరం ఇవాళ నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

News January 19, 2025

లోకేశ్‌ను Dy.CM చేయడానికి అమిత్ షా ఒప్పుకోలేదు: అంబటి

image

AP: లోకేశ్‌ను Dy.CM చేస్తానన్న ప్రతిపాదనకు కేంద్రమంత్రి అమిత్ షా ఒప్పుకోలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‘షా ఏమన్నారో మాకు తెలుసు. లోకేశ్‌ అన్నిశాఖల్లో వేలు పెడుతున్నారని, కంట్రోల్‌లో ఉంచమని బాబుకు సూచించారు. లోకేశ్ వసూళ్ల కార్యక్రమంలో నిమగ్నమయ్యాడని, స్పీడ్ తగ్గించుకోవాలని హెచ్చరించారు’ అని తెలిపారు. ఈ విషయాలు బయటికి రాకుండా కూటమి నేతలు వేరే కథలు వండి వారుస్తున్నారని ఎద్దేవా చేశారు.

News January 19, 2025

కూటమి మాట నిలబెట్టుకోవాలి.. లేదంటే ఉద్యమం: బొత్స

image

AP: విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగదని మోదీ, అమిత్ షా, చంద్రబాబు ఎందుకు చెప్పట్లేదని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే రూ.11వేల కోట్ల ప్యాకేజీకి ఎన్నో షరతులు పెట్టారన్నారు. దీనివెనుక ఏదో మతలబు ఉందని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రైవేటీకరణ జరగకుండా కూటమి నేతలు మాట నిలబెట్టుకోవాలని, లేదంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

News January 19, 2025

ఈ ఏడాది అతిపెద్ద ముప్పు ఇదే..

image

2024లో ఎన్నో యుద్ధాలను చూసిన ప్రపంచానికి ఈ ఏడాది కూడా ఆ ముప్పు తప్పదని ఓ రిపోర్టు వెల్లడించింది. 2025లో దేశాల వార్ కారణంగానే 23% ప్రమాదం ఉంటుందని గ్లోబల్ రిస్క్ రిపోర్ట్-వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వెల్లడించింది. ఆ తర్వాత వాతావరణ మార్పులు(14%), భౌగోళిక ఆర్థిక సమస్యల(8%) వల్ల ముప్పు ఉందంది. వచ్చే రెండేళ్లలో తప్పుడు సమాచార వ్యాప్తి, పదేళ్లలో తీవ్ర వాతావరణ మార్పులు ప్రమాదకరంగా ఉంటాయని పేర్కొంది.

News January 19, 2025

ముగిసిన సీఎం రేవంత్ సింగపూర్ పర్యటన

image

TG: CM రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన ముగిసింది. ఆయన నేతృత్వంలోని రాష్ట్ర బృందం బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. రాష్ట్రంలో రూ.3500Crతో ఆర్ట్ డేటా సెంటర్ పెట్టేందుకు STT గ్లోబల్ డేటా సెంటర్, రూ.450Crతో IT పార్క్ నిర్మించేందుకు క్యాపిటల్ ల్యాండ్ అంగీకరించాయి. ఇండియన్ ఓషియన్ గ్రూప్, DBS, బ్లాక్‌స్టోన్, మైన్ హార్డ్ తదితర కంపెనీలతో CM చర్చించారు. రేపటి నుంచి ఆయన దావోస్‌లో పర్యటిస్తారు.

News January 19, 2025

Debate: తమ్ముళ్ల ఆలోచన అదేనా..?

image

లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే TDP డిమాండ్‌పై నెట్టింట డిబేట్ అవుతోంది. గతంలో కీలక మంత్రిగా, ప్రతిపక్షంలో పాదయాత్రతో జనాల్లోకి వెళ్లిన ఆయన ఈ పదవికి అర్హుడని TDP అంటోంది. కానీ ఇది పవన్‌ను కంట్రోల్ చేసే స్టెప్ అనేది జనసేన వర్షన్. చంద్రబాబు సైతం కంట్రోల్ చేయలేకపోతున్న పవన్‌ను బ్యాలెన్స్ చేయాలంటే లోకేశ్ No.2గా ఉండాలనేది తెలుగు తమ్ముళ్ల ఆలోచన అంటున్నారు. మరి నిజంగానే క్యాడర్ కోరికనా? కట్టడి ప్రయత్నమా?

News January 19, 2025

జుట్టు బాగా రాలుతోందా..? ఇలా చేశారంటే..

image

– మీ చర్మం, జుట్టుకు ఏ తరహా షాంపూ/ప్రొడక్ట్ సెట్ అవుతుందో డాక్టర్‌తో తెలుసుకుని వాటిని వాడటం బెటర్
– రోజూ తలస్నానం చేస్తే కుదుళ్లు పొడిగా మారి వెంట్రుకలు రాలుతాయి. చెమట, పనిని బట్టి వారానికి 2-3సార్లు తలస్నానం మంచిది.
– జడ/జుట్టు బంధించినట్లు కాకుండా కాస్త వదులుగా ఉంచితే రక్త ప్రసరణ సులువై వెంట్రుకలు బలంగా ఉంటాయి
– ఎక్కువ కాలం హెయిర్ డ్రయర్ వాడవద్దు
– ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా జుట్టు రాలుతుంది

News January 19, 2025

కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్

image

AP: సంక్రాంతి సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారంతా తిరుగుపయనం అవుతున్నారు. సోమవారం నుంచి స్కూళ్లు, ఆఫీస్‌లు ఉండటంతో ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో విజయవాడ బస్టాండ్ కిటకిటలాడుతోంది. ఇక్కడి నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్లే బస్సులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. పండగ నేపథ్యంలో విజయవాడ నుంచి 133 అదనపు బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.

News January 19, 2025

3 టెస్టులు, 60 వికెట్లు.. మొత్తం స్పిన్నర్లకే

image

ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో WIపై 127 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. పాకిస్థాన్ గడ్డపై బంతుల పరంగా ఇదే షార్టెస్ట్ టెస్టు మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌ 4 ఇన్నింగ్సుల్లో 1,064 బంతులను బౌలర్లు వేశారు. 1990లో WI-PAK మ్యాచ్‌లో 1,080 బంతులు డెలివరీ అయ్యాయి. అలాగే వరుసగా 3 హోం టెస్టుల్లో పాక్ స్పిన్నర్లు 60 వికెట్లు కూల్చేయడం మరో విశేషం. పేసర్లకు ఒక్కటీ దక్కలేదు.