India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిందాల్ స్టీల్ సీఈవో దినేశ్ కుమార్ తనని వేధించారని ఓ యువతి Xలో సంస్థ ఛైర్మన్ నవీన్ జిందాల్‌కు ఫిర్యాదు చేశారు. ‘కోల్‌కతా నుంచి అబుదాబి వెళ్తుండగా ఫ్లైట్‌లో నా పక్కన దినేశ్ కూర్చున్నారు. మాటలు కలిపి అతని మొబైల్‌లో పోర్న్ వీడియోలు చూపించారు. భయంతో స్టాఫ్‌కి ఫిర్యాదు చేశా. ఎయిర్పోర్ట్ పోలీసుల ముందు ఆయన ఇది అబద్ధమనలేదు’ అని ట్వీట్ చేశారు. నవీన్ స్పందిస్తూ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మహారాష్ట్రకు చెందిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌పై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేయవద్దో వివరణ ఇవ్వాలంటూ ఆమెకు షోకాజ్ నోటీసులు పంపింది. యూపీఎస్సీకి నకిలీ ఐడెంటిటీ సమర్పించి ఉద్యోగం సాధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఆమె యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా ఆంక్షలు విధించింది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
IPL ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌లో వాటా అమ్మకానికి వచ్చినట్లు తెలుస్తోంది. ది ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. అదానీ లేదా టోరెంట్ గ్రూపులకు GTలో సింహభాగం షేర్‌ను విక్రయించాలని ప్రస్తుత యాజమాన్యం సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ యోచిస్తోంది. నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపుగా సీవీసీ విక్రయించాల్సి ఉంటుంది. GTని 2021లో రూ.5625 కోట్లకు సీవీసీ కొనగా.. ప్రస్తుత విలువ బిలియన్ డాలర్లకు పైమాటేనని అంచనా.
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, DECకు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డీఎస్సీ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
TG: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు 3న రాత్రి ఆయన తన బృందంతో బయల్దేరనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పెట్టుబడుల విషయమై పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. డల్లాస్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆయన పర్యటించనున్నారు. ఆగస్టు 11న తిరిగి భారత్‌కు రానున్నారు.
నటుడు, T-సిరీస్ ప్రొడ్యూసర్ క్రిషణ్ కుమార్ కుమార్తె తిశా(20) మరణించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె జర్మనీలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు T-సిరీస్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. చాలాకాలం నుంచి తిశా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. గతేడాది నవంబర్‌లో యానిమల్ ప్రీమియర్ తర్వాత ఆమె బాహ్య ప్రపంచానికి దూరమయ్యారు.
మరికొన్ని రోజుల్లో పారిస్ ఒలింపిక్స్-2024 ప్రారంభం కానున్న వేళ జపాన్ మహిళల జిమ్నాస్టిక్స్ కెప్టెన్ షోకో మియాటా పోటీ నుంచి వైదొలిగారు. ఆమె సిగరెట్ తాగడంతో జట్టు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందని, పారిస్ గేమ్స్ నుంచి తొలగించినట్లు జపాన్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ పేర్కొంది. దీంతో మహిళా జట్టు ఐదుగురికి బదులుగా నలుగురు అథ్లెట్లతో పోటీలోకి దిగుతుందని తెలిపింది.
TG: జూన్‌లో వేయాల్సిన రైతు భరోసా జులై వచ్చినా రైతుల ఖాతాలో జమకాలేదని KTR అన్నారు. కౌలు రైతులకు రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇవ్వలేదని X వేదికగా సీఎం రేవంత్‌ను దుయ్యబట్టారు. ఇంతకాలం అటెన్షన్ డైవర్షన్ చేసి ఇప్పుడు నిధులు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ‘ఎందుకీ సంబరాలు.. అర్హులైన లబ్ధిదారులకు రుణమాఫీ కాకుండా, మెజార్టీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా?’ అని ప్రశ్నించారు.
<<13660202>>మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్య కారణంగా<<>> ప్రపంచవ్యాప్తంగా పలు సేవలు స్తంభించాయి. ఆ సంస్థకు సైబర్ భద్రత అందించే ‘క్రౌడ్‌స్ట్రైక్’ వేదిక వైఫల్యమే దీనికి కారణంగా అంచనా వేస్తున్నారు. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే వంటి దేశాల్లో సమస్య తీవ్రంగా ఉంది. విమాన, ఆరోగ్య, అత్యవసర సేవలు నిలిచిపోవడంతో ఆయా దేశాల ప్రజలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన ‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదలైంది. సినిమాకు చాలా వరకు రివ్యూలు నెగటివ్‌గానే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ మూవీలో నటించిన బాబీ సింహా రివ్యూయర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రతి ఒక్కరూ వారే తెలివైనవాళ్లమనుకుంటారు. అన్నీ తమకే తెలుసనుకుంటారు. మేం బాగుందంటే మమ్మల్ని పిచ్చివాళ్లలా చూస్తారు. వారి అభిప్రాయాల గురించి చింతించాల్సిన పని లేదు’ అని తేల్చిచెప్పారు.
Sorry, no posts matched your criteria.