News April 14, 2024

2 చేపల ధర రూ.4 లక్షలు

image

AP: అంతర్వేది సముద్ర తీరంలో కృష్ణా జిల్లా మత్స్యకారులకు అరుదైన కచ్చిడీ చేపలు చిక్కాయి. వాటిని కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో వేలం వేశారు. ఓ వ్యాపారి రెండు చేపలకు రూ.4 లక్షలు చెల్లించి కొనుగోలు చేశాడు. ఈ చేపల్లో ఉండే తెల్లటి బ్లాడర్(మావ్)ను ఔషధాలకు పొరలా, శస్త్రచికిత్సలో కుట్లు వేసే దారంలా వాడతారని.. అందుకే వీటికి భారీ డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.

News April 14, 2024

IPL: ఇవాళ డబుల్ ధమాకా

image

ఆదివారం కావడంతో ఇవాళ IPLలో రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతాతో లక్నో తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు వాంఖడే స్టేడియంలో చెన్నైని ముంబై ఢీకొట్టనుంది. ఈ మ్యాచు కోసం ధోనీ, రోహిత్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పాయింట్ల పట్టికలో కోల్‌కతా 2, చెన్నై 3, లక్నో 4, ముంబై 7వ స్థానంలో ఉన్నాయి.

News April 14, 2024

రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు

image

AP: రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత పెరగనుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ 151 మండలాల్లో మోస్తరుగా.. 18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని అంచనా వేసింది. రేపు 135 మండలాల్లో స్వల్పంగా.. 33 మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. మూడు రోజుల పాటు ఇదే కొనసాగుతుందని అంచనా వేసింది.

News April 14, 2024

దేశంలోనే తొలిసారి.. ఏఐతో కణుతుల తొలగింపు!

image

TG: ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీతో నడిచే పరికరంతో మెదడులో కణుతుల తొలగింపు సులభం అయిందన్నారు కిమ్స్ వైద్యులు. దేశంలోనే తొలిసారిగా 18 శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామన్నారు. పాతపద్ధతిలో శస్త్రచికిత్సకు కనీసం 4-5 గంటలు పట్టేదని, కొత్త విధానం ద్వారా గంటలో సర్జరీ పూర్తవుతోందన్నారు. ఆపరేషన్ టైమ్ తగ్గడంతో రోగి త్వరగా కోలుకోవడమే కాక వారి ఖర్చులూ తగ్గనున్నాయని పేర్కొన్నారు.

News April 14, 2024

జగన్‌పై దాడి ఘటన.. వైసీపీ కీలక ప్రకటన

image

AP: రాయి దాడిలో గాయపడిన CM జగన్‌కు అర్ధరాత్రి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేశారు. గాయానికి 2 కుట్లు వేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి YCP కీలక ప్రకటన చేసింది. ఎవరూ ఆందోళన చెందవద్దని, దయచేసి అందరూ సంయమనం పాటించాలని X వేదికగా కోరింది. మరోవైపు జగన్‌పై దాడిని CBN నిజంగానే ఖండించారనుకుంటే టీడీపీ X అకౌంట్ నుంచి ఎందుకు నీచంగా పోస్టులు చేయిస్తున్నారంటూ వైసీపీ మండిపడింది.

News April 14, 2024

19న చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్

image

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈనెల 19న కుప్పంలో నామినేషన్ వేయనున్నారు. ఆయన తరఫున సతీమణి భువనేశ్వరి నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు. ఆరోజు ఉదయం కుప్పం లక్ష్మీపురంలోని శ్రీవరదరాజస్వామి ఆలయానికి చేరుకోకున్న భువనేశ్వరి.. నామినేషన్ పత్రాలకు పూజలు చేయించనున్నారు. అనంతరం పాతపేట చెరువుకట్ట కూడలి నుంచి పార్టీ శ్రేణులతో ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి చేరుకుంటారు.

News April 14, 2024

ఇజ్రాయెల్‌పై ముప్పేట దాడి!

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగిన వెంటనే లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా, యెమెన్ రెబల్స్ సైతం దాడులు ప్రారంభించాయి. ఇరాన్ మద్దతుతో నడిచే ఈ మిలిటెంట్ గ్రూపులు డ్రోన్లు, రాకెట్ దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు హమాస్ సైతం కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించింది. గాజాను వీడితేనే కాల్పులు విరమిస్తామని తేల్చి చెప్పింది.

News April 14, 2024

జగన్‌పై దాడి.. చంద్రబాబు, లోకేశ్ రియాక్షన్ ఇదే..

image

AP: సీఎం జగన్‌పై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ‘ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు. ఇక ‘రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా!’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్ అంటూ 2019లో కోడికత్తి, 2024లో రాయి అని వాటి ఫొటోలు పోస్ట్ చేశారు.

News April 14, 2024

అసలు పేరు ఒకటి.. వీళ్లకు అర్థమైంది మరోటి!

image

అనువాదంలో జరిగిన చిన్న పొరపాటుకు భారతీయ రైల్వే నెట్టింట విమర్శలను ఎదుర్కొంటోంది. హటియా నుంచి ఎర్నాకులం రైలు పేర్ల అనువాదంలో నిర్వహకులు తప్పు చేశారు. హటియా అనే పేరును హత్య అనుకుని దానికి మలయాళంలో అదే అర్థం వచ్చే ‘కోలపతకం’గా దానిని అనువదించారు. ఆ రైలు బోర్డు మీద అదే రాశారు. ఈ ఫొటో కాస్త వైరలవడంతో తప్పు గ్రహించిన అధికారులు దానిని సరిదిద్దుకున్నారు.

News April 14, 2024

మేడిగడ్డలో సాంకేతిక పరీక్షలు

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో సిబ్బంది ఇటీవల సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. 20వ పిల్లర్ కుంగిన నేపథ్యంలో 6,7,8 బ్లాక్‌లలో ఈ పరీక్షలు జరిపారు. మరోవైపు మిగతా బ్లాక్‌లలో పరిస్థితులు తెలుసుకునేందుకు నిర్మాణ సంస్థ, సంబంధిత అధికారులు పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎలక్ట్రో రెసిస్టివిటీ టెస్ట్, జియో ఫిజికల్ పద్ధతిలో జీపీఆర్ టెస్ట్ వంటి పరీక్షలు చేపట్టనున్నారు.