News July 18, 2024

ఇన్సాల్వెన్సీ ఆర్డర్‌పై NLCATని ఆశ్రయించిన బైజూస్

image

NCLT విధించిన ఇన్సాల్వెన్సీ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ బైజూస్ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ ఈనెల 22న విచారణను చేపట్టే అవకాశం ఉంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, నెల రోజుల్లో ఒకే విడతలో బీసీసీఐకి ₹158కోట్ల బాకీని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని బైజూస్ తెలిపింది. కాగా NCLT ఇన్సాల్వెన్సీ ఆర్డర్‌తో బైజూస్ సీఈఓ రవీంద్రన్ తన అధికారాన్ని కోల్పోయారు.

News July 18, 2024

అనంత్-రాధిక పెళ్లి వేడుకలో స్పెషల్ వీడియో!

image

బిలియనీర్ ముకేశ్ అంబానీ తన కుమారుడు అనంత్-రాధిక పెళ్లి కోసం వేల కోట్లు ఖర్చు చేశారు. ఈ పెళ్లి వేడుకలను చిత్రీకరించేందుకు స్టార్ డైరెక్టర్ అట్లీకి అవకాశం ఇచ్చారు. ఆయన 10 నిమిషాల స్పెషల్ వీడియోను డైరెక్ట్ చేయగా దీనికి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ వీడియోను అతిథుల ముందు ప్రదర్శించారని యూట్యూబర్ రణ్‌వీర్ తన వీడియోలో రివీల్ చేశారు.

News July 18, 2024

ట్రాఫిక్ పోలీస్‌పై బదిలీ వేటు: TG పోలీస్

image

హైదరాబాద్‌లో లారీడ్రైవర్‌పై దుర్భాషలాడిన <<13652628>>ట్రాఫిక్<<>> పోలీస్‌పై తెలంగాణ పోలీసులు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. KTR ట్విటర్ వేదికగా చేసిన ఫిర్యాదు మేరకు TG పోలీసులు స్పందించారు. ‘ఈ ఘటన సైబరాబాద్ జీడిమెట్ల ట్రాఫిక్ లిమిట్స్‌లో జరిగింది. బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం. ఆయన్ను ఆ స్టేషన్ నుంచి బదిలీ చేశాం. మేము 24/7 గంటలూ ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాం’ అని పేర్కొన్నారు.

News July 18, 2024

బిహార్‌లో కూలిన మరో వంతెన.. నెటిజన్ల సెటైర్లు!

image

బిహార్‌లో నెలరోజుల వ్యవధిలోనే 15వ వంతెన కూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అరారియా జిల్లాలోని పర్మాన్ నదిపై ఉన్న వంతెన వరదల కారణంగా నిన్న కూలిపోయింది. చిన్నపాటి వరదలకే బ్రిడ్జిలు కూలిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలానే కొనసాగితే వర్షాకాలం పూర్తయ్యేలోపు బిహార్‌లో బ్రిడ్జిలే ఉండవని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ప్రభుత్వం పురాతన వంతెనల మరమ్మతులపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

News July 18, 2024

మహేశ్ బాబుతో సినిమా.. కృష్ణవంశీ రియాక్షన్ ఇదే

image

దర్శకుడు కృష్ణవంశీ, మహేశ్ బాబు కాంబినేషన్లో వచ్చిన ‘మురారి’ మూవీ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో సూపర్ స్టార్ తన పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. తాజాగా ఓ ఫ్యాన్ మహేశ్‌తో మళ్లీ మూవీ ఎప్పుడు చేస్తారని దర్శకుడు కృష్ణవంశీని Xలో అడిగారు. దీనికి ఆయన ‘కష్టం అండి.. అతను అంతర్జాతీయ నటుడు’ అని బదులిచ్చారు. కాగా మహేశ్ పుట్టిన రోజు AUG 9న ‘మురారి’ రీరిలీజ్ కానుంది.

News July 18, 2024

ముచ్చుమర్రి ఘటన: బాలిక మృతదేహం అందుకే దొరకటం లేదా?

image

AP: ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహం ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీనికి స్థానిక ప్రజలు మరో కారణం చెబుతున్నట్లు తెలుస్తోంది. నిందితుల్లో ఓ బాలుడి తాత ఆ చిన్నారి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కృష్ణా బ్యాక్ వాటర్‌లో పడేసినట్లు సమాచారం. ఆ ముక్కలను నీటికుక్కలు, చేపలు తినేసి ఉంటాయని, అందుకే శవం దొరకడం లేదట. లేదంటే రాయి కట్టినా శవం నీటిలోపైకి తేలేదని చర్చించుకుంటున్నట్లు టాక్.

News July 18, 2024

కుక్కల దాడులు.. పరిష్కారమేదీ?

image

TG: కుక్కల బెడదతో రాష్ట్రం వణుకుతోంది. నిన్న HYDలో <<13644434>>విహాన్‌ను<<>> అత్యంత దారుణంగా వీధికుక్కలు కరిచి చంపేశాయి. గడిచిన 3 నెలల్లో ఇది ఆరో ఘటన. ఇంకా ఎంతోమంది గాయపడ్డారు. రాష్ట్రంలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా HYDలో ప్రతివీధిలో కనీసం 5-10 కుక్కలు కనిపిస్తున్నాయి. చిన్నారులు కనిపిస్తే చాలు దాడి చేస్తున్నాయి. వాహనదారుల వెంటపడి భయపెడుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ ప్రభుత్వమే పరిష్కారం చూపాలి.

News July 18, 2024

‘తగిన ఆధారాలు ఇవ్వండి’.. నీట్ రీఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు

image

నీట్ యూజీని మళ్లీ నిర్వహించేందుకు తగిన ఆధారాలు చూపాలని సుప్రీంకోర్టు పిటిషనర్లను ఆదేశించింది. ‘ఈ లీక్ ఓ పథకం ప్రకారం జరిగిందని, ఇది దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహణపై ప్రభావం చూపిందనడానికి తగిన ఆధారాలు కావాలి. ఎక్కువ మంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించలేము. ఒకవేళ రీఎగ్జామ్‌కు మేము అంగీకరించకుంటే ఇతర దర్యాప్తు మార్గాలను సూచించండి’ అని CJI పేర్కొన్నారు.

News July 18, 2024

ఉమ్రాన్ మాలిక్ వెనుకబడటానికి కారణమదే: మాజీ కోచ్

image

జమ్మూకశ్మీర్‌ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్, టీమ్ ఇండియాలో తళుక్కున మెరిసి కనుమరుగైపోయారు. అందుకు గల కారణాన్ని భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే వెల్లడించారు. ‘146-148 కి.మీ వేగంతో నిలకడగా బౌలింగ్ చేయడం చాలా కష్టం. అయితే, ఎంత వేగంగా విసిరినా లైన్ అండ్ లెంగ్త్ కూడా ముఖ్యం. అది తప్పితే ధారాళంగా పరుగులిచ్చుకోవాల్సిందే. తనకు ఇప్పుడు అదే సమస్య. భవిష్యత్తులో మెరుగవుతాడని భావిస్తున్నాం’ అని తెలిపారు.

News July 18, 2024

విచారణకు హాజరు కాలేను: రాజ్ తరుణ్

image

TG: నార్సింగి పోలీసులు పంపిన నోటీసులపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. తాను అందుబాటులో లేనందున విచారణకు హాజరు కాలేనని తన లాయర్ ద్వారా వివరణ పంపారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ వివరణను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోసారి ఆయనకు నోటీసులు ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. కాగా తనను పెళ్లి చేసుకుని మోసం చేశారని లావణ్య అనే యువతి రాజ్ తరుణ్‌పై కేసు పెట్టారు. దీనికి సంబంధించి ఆయనకు నోటీసులు పంపారు.