India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీలంకతో <<13623200>>జరగబోయే<<>> వన్డే సిరీస్‌కు టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య దూరం కానున్నట్లు తెలుస్తోంది. లంకతో వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయొద్దంటూ బీసీసీఐని హార్దిక్ కోరినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన ఈ జట్టుకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది. కాగా లంకతో జరగబోయే టీ20 సిరీస్‌కు బీసీసీఐ హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించవచ్చని టాక్.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో సూపర్ సిక్స్ పథకాల అమలు, నూతన ఇసుక విధానం రూపకల్పన, బడ్జెట్ పొడిగింపు ఆర్డినెన్స్ తదితర కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కాగా సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.
తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని కలెక్టర్లకు CM రేవంత్ సూచించారు. ఏసీ గదులకే పరిమితమైతే సంతృప్తి ఉండదని, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకోవాలన్నారు. సచివాలయంలో కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే సరైన సేవలు అందించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రజలకు లబ్ధి చేకూరే నిర్ణయాలతో పాటు, ఎప్పటికీ గుర్తుండిపోయేలా పని చేయాలని ఆదేశించారు.
TG: అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్‌వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, సహాయకులకు రూ.లక్ష బెనిఫిట్స్ అందజేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. దీనికి సంబంధించిన జీవోను రెండు రోజుల్లో ఇస్తామని ‘అమ్మ మాట – అంగన్వాడీ బాట’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి వెల్లడించారు.
ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటలీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో భారత్ సత్తా చాటింది. స్కీట్ ఫైనల్స్‌లో భవతేగ్ సింగ్ సిల్వర్ మెడల్ సాధించారు. 60 క్లే టార్గెట్స్‌లో 52 షూట్ చేసి రెండో స్థానంలో నిలవగా 56 టార్గెట్స్ కొట్టిన బెంజమిన్ కెల్లర్ (US) గోల్డ్ మెడల్ సాధించారు. భారత్‌కు ఈ టోర్నీలో ఇది రెండో పతకం. అంతకుముందు Jr ఉమెన్స్ ట్రాప్‌లో సబీరా హ్యారీస్ కాంస్య పతకం గెలిచారు.
ట్రెయినీ IAS పూజా ఖేద్కర్ వ్యవహారంపై IAS స్మితా సబర్వాల్ స్పందించారు. ‘సివిల్ సర్వీసెస్‌లోకి వచ్చేందుకు కొందరు ఫేక్ సర్టిఫికెట్లు ఉపయోగించారనే వార్తలు ఆందోళనకరం. చాలా మంది తెలివైన విద్యార్థులు IAS, IPS కావడం వారి గమ్యస్థానంగా పరిగణిస్తారు. మెరిట్ ద్వారానే వారు దానిని చేరుకోగలరు. సమగ్ర విచారణ జరిపి ఇలాంటి మోసగాళ్లను ఏరివేయాలి. రిజర్వేషన్/ కోటాల విషయంలో వ్యవస్థలో మార్పులు అవసరం’ అని ట్వీట్ చేశారు.
TG: రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో రేవంత్ సర్కార్ తమ ఎమ్మెల్యేల పట్ల ప్రొటోకాల్ పాటించట్లేదని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో KTRతో సహా బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌ను కలవనున్నారు. నిన్న ఓ కార్యక్రమంలో ప్రొటోకాల్ వివాదంలో మాజీ మంత్రి <<13633194>>సబితా<<>> నిరసనకు దిగిన సంగతి తెలిసిందే.
జవాన్ల కాల్పుల్లో 13 మంది నాగాలాండ్ పౌరులు చనిపోయిన కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 30 మంది జవాన్లపై చర్యలకు కేంద్రం నిరాకరించడాన్ని నాగాలాండ్ సవాల్ చేసింది. తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. దీనిపై కోర్టు కేంద్రానికి నిన్న నోటీసులు ఇచ్చింది. 2021 DEC 4న మిలిటెంట్లపై ఆపరేషన్ చేపడుతున్న క్రమంలో పౌరులపై కాల్పులు జరిపినట్లు జవాన్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
బీఎస్పీ TN చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ <<13574585>>హత్య<<>> మరువకముందే తమిళనాడులో మరో పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. నామ్ తమిళర్ కాచి(NTK) పార్టీ నేత బాలసుబ్రమణియన్‌ను మధురైలోని తాళ్లకులం పోలీస్ స్టేషన్‌కు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతనిపై గతంలో 3 కేసులు ఉన్నాయని, వ్యక్తిగత కక్షలతో హత్య చేసి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు.
AP: రాష్ట్రంలోని SC, ST వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం ఇవ్వనుంది. దీన్ని వారు వాయిదాల రూపంలో చెల్లించాలి. 2024-25 ఏడాదికిగానూ రూ.250 కోట్లు రుణంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సంబంధిత ఫైల్‌పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారు.
Sorry, no posts matched your criteria.