India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రైతు రుణమాఫీపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం సరికాదని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ‘డిసెంబర్ 12, 2018కి ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన అసమంజసం. రైతుకు రుణభారం తగ్గించడం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనిపిస్తోంది. రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డు), పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే’ అని విమర్శించారు.
2023 ఎన్నికల తర్వాత 10 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు.
*తెల్లం వెంకట్ రావు- భద్రాచలం *కడియం శ్రీహరి- స్టేషన్ ఘన్‌పూర్
*దానం నాగేందర్- ఖైరతాబాద్ *పోచారం శ్రీనివాస్ రెడ్డి- బాన్సువాడ *సంజయ్ కుమార్- జగిత్యాల *కాలే యాదయ్య- చేవెళ్ల *బండ్ల కృష్ణమోహన్ రెడ్డి- గద్వాల *ప్రకాశ్ గౌడ్- రాజేంద్రనగర్ *అరికెపూడి గాంధీ- శేరిలింగంపల్లి *గూడెం మహిపాల్ రెడ్డి- పటాన్‌చెరు
AP: గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్(GPS) జీవో, గెజిట్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ జీవో జారీ కావడంపై అధికారులను ఆయన ఆరా తీశారు. ఇప్పుడెందుకు బయటపెట్టారో విచారించాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. కాగా GPS అమలు చేస్తూ జూన్ 12న <<13630814>>గెజిట్<<>> ఇవ్వడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
ఆడవాళ్లపై వరుస అత్యాచారాలను సింగర్ చిన్మయి తీవ్రంగా ఖండించారు. తమిళనాడులో ఓ 16ఏళ్ల బాలికను రేప్ చేసిన కానిస్టేబుల్ POCSO చట్టం కింద అరెస్టయిన వార్తను షేర్ చేసిన ఆమె ‘ఈ కేసులో ఏం జరుగుతుందో? బెయిల్‌పై అతడు ఎలా బయటికొస్తాడో చూడాలి’ అని ట్వీట్ చేశారు. HYDలో మహిళపై ఊబర్ డ్రైవర్ల గ్యాంగ్ రేప్, UPలో బాలిక(4)పై అత్యాచారాన్ని ప్రస్తావిస్తూ ‘ఆడవాళ్లకు భద్రత ఎక్కువైంది’ అని ఆమె వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
AP: ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడే ఈ అల్పపీడనం వల్ల వచ్చే 5 రోజుల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరోవైపు వచ్చే 24 గంటల్లో మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులకు తెగబడి పోలీసుల చేతిలో హతమైన నిందితుడు ఓ 20ఏళ్ల కుర్రాడు. బ్రిలియంట్ స్టూడెంట్ అయిన థామస్ మ్యాథ్యూ క్రూక్స్‌కు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో అవార్డులు వచ్చాయట. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడే అతను రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదని క్లాస్‌మేట్స్ తెలిపారు. బాల్యంలో సరిగ్గా కాల్చలేకపోవడంతో క్రూక్స్‌కు స్కూల్ షూటింగ్ క్లబ్‌లో చోటు దక్కనట్లు తెలుస్తోంది.
T20I క్రికెట్‌కు సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్ జడేజా రిటైర్మెంట్ ఇవ్వడంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ఆసక్తి చాలామందిలో నెలకొంది. అయితే జింబాబ్వేతో తాజాగా ముగిసిన టీ20 సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణించారు. తాను జడేజా వారసత్వాన్ని అందుకునే రేసులో ముందున్నానని మెసేజ్ ఇచ్చారు. ఈ సిరీస్‌లో 5 మ్యాచుల్లో మెరుగైన ఎకానమీ(5.16)తో 8 వికెట్లు తీసిన సుందర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచారు.
ఫుడ్ డెలివరీ యాప్ ‘జొమాటో’లో కొత్తగా ‘డిలీట్’ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, దీన్ని తీసుకురావడానికి గల కారణాన్ని సంస్థ CEO దీపిందర్ గోయల్ తెలిపారు. ఆర్డర్స్ హిస్టరీ వల్ల లేట్ నైట్ బుక్ చేసుకుని తింటున్నట్లు తన భార్య తెలుసుకుంటోందని, డిలీట్ చేసే ఆప్షన్ ఉంటే బాగుండేదని ఓ నెటిజన్ ట్విటర్‌లో CEOకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారని దీన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరపడంపై యూట్యూబర్ ధ్రువ్ రాఠి స్పందించారు. ‘డొనాల్డ్ ట్రంప్ దాదాపు హత్యకు గురైన పరిస్థితి. ఎందుకంటే అమెరికాలో ఎవరైనా సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌ను పొందవచ్చు. అమెరికాలో ప్రతి సంవత్సరం 40,000 మంది కాల్పుల కారణంగా మరణిస్తున్నారు. అయినా దీనిని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆయుధ మాఫియాను నియంత్రించేందుకు ట్రంప్, బైడెన్ పెద్దగా కృషి చేయలేదు’ అని ట్వీట్ చేశారు.
టెన్నిస్‌లో <<13629724>>గ్రాండ్ స్లామ్<<>> అంటే ఏడాది కాలంలో 4 మేజర్ ఛాంపియన్షిప్స్ గెలవడం. ఒక గ్రాండ్ స్లామ్ సాధించాలంటే ఏడాదిలో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, US ఓపెన్ గెలవాలి. టెన్నిస్‌లో ఇదే అతి పెద్ద ఫీట్. డబుల్స్‌లో ఒక ప్లేయర్ వేర్వేరు పార్ట్‌నర్స్‌తో దీన్ని సాధించవచ్చు. ఆస్ట్రేలియాకు చెందిన రాడ్ లావర్(11) అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచారు. IND ఖాతాలో 4 డబుల్స్ గ్రాండ్ స్లామ్స్ ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.