News October 17, 2024

ప్రపంచంలో అతిపెద్ద దేవాలయాలు ఇవే!

image

తమిళనాడులో ఉన్న తిరువరంగం రంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం) ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆలయం. దాదాపు 156 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆలయం ఇండియాలోనే అతిపెద్దది. అయితే, కంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ మందిరం ప్రపంచంలోనే అతిపెద్దది కావడం గమనార్హం. 12వ శతాబ్ద కాలంలో కింగ్ సూర్యవర్మన్ -II ఏకంగా 402 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. న్యూజెర్సీలోని(USA)లో 183 ఎకరాల్లో నిర్మించిన స్వామినారాయణ్ అక్షర్‌ధామ్ రెండో అతిపెద్దది.

News October 17, 2024

STOCK MARKETS క్రాష్.. రూ.3 లక్షల కోట్లు ఆవిరి

image

భారత స్టాక్ మార్కెట్లలో బ్లడ్‌బాత్ కొనసాగుతోంది. నెగటివ్ సెంటిమెంటుతో బెంచ్‌మార్క్ సూచీలు క్రాష్ అవ్వడంతో రూ.3 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మధ్యాహ్నం బీఎస్ఈ సెన్సెక్స్ 80,952 (-548), ఎన్ఎస్ఈ నిఫ్టీ 24,740 (-231) వద్ద ట్రేడవుతున్నాయి. బజాజ్ ఆటో ఇంట్రాడేలో 12% నష్టపోయింది. ఆటో షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ విపరీతంగా ఉంది. Infy, TechM, LT, SBIN, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్.

News October 17, 2024

భారత్ చెత్త రికార్డు

image

కివీస్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్సులో భారత్ 46 పరుగులకే చాపచుట్టేసింది. ఇది టీమ్ ఇండియాకు మూడో అత్యల్ప స్కోరు. 2020లో 36(vsAUS), 1974లో 42(vsENG) పరుగులకు ఆలౌటైంది. ఆయా టెస్టుల్లో థర్డ్ ఇన్నింగ్సులో లోయెస్ట్ స్కోరుకు కుప్పకూలగా, సొంత గడ్డపై తొలి ఇన్నింగ్సులో భారత్‌కు ఇదే అత్యల్ప స్కోరు. స్వదేశంలో ఒక ఇన్నింగ్సులో ఐదుగురు డకౌట్ కావడం 25 ఏళ్లలో ఇదే తొలిసారి.

News October 17, 2024

ఉప్పల్ స్టేడియం కేసులో ఈడీ దూకుడు

image

TG: ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్‌మాల్ కేసులో 3కంపెనీలకు ED సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న అజారుద్దీన్‌ను విచారించిన ED, ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా బాడీడ్రెంచ్ ఇండియా, సర స్పోర్ట్స్, ఎక్స్‌లెంట్ ఎంటర్‌ప్రైజెస్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని ఆదేశించింది. జనరేటర్స్, జిమ్ పరికరాలు, క్రికెట్ బాల్స్, ఇతర వస్తువుల్లో అక్రమాలు జరిగాయని అజారుద్దీన్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

News October 17, 2024

సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్

image

TG: ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు. మూసీ సుందరీకరణ, హైడ్రా, గ్రూప్-1 మెయిన్స్, అప్పులపై ప్రతిపక్షాల విమర్శలపై స్పందించనున్నారు.

News October 17, 2024

బెయిల్ కండీషన్.. ‘భారత్ మాతాకీ జై చెప్పాల్సిందే’

image

మధ్యప్రదేశ్‌లో ‘పాకిస్థాన్ జిందాబాద్.. హిందుస్థాన్ ముర్దాబాద్’ నినాదాలు చేసిన నిందితుడు ఫైజల్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు ముగిసే వరకు ప్రతి నెలా మొదటి, చివరి మంగళవారం మిస్రోడ్ పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినదిస్తూ అక్కడి జాతీయ జెండాకు 21సార్లు సెల్యూట్ చేయాలని స్పష్టం చేసింది. స్టేట్ కౌన్సిల్ బెయిల్‌కు అడ్డుచెప్పగా, న్యాయమూర్తి తోసిపుచ్చారు.

News October 17, 2024

ఒకే రోజు 2 రాష్ట్రాల్లో రెండు సినిమాల షూటింగ్‌లో!

image

తాను ఒక్కరోజులోనే రెండు రాష్ట్రాల్లో 2 సినిమాల షూటింగ్‌లో పాల్గొన్నట్లు హీరోయిన్ నిధి అగర్వాల్ తెలిపారు. ‘కళాకారుల జీవితం ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు, రాజాసాబ్ సినిమాల్లో నటిస్తున్నా. ఆంధ్రా, తెలంగాణలో నిన్న జరిగిన రెండు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొన్నా. ఈ రెండింటి కోసం మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది వేడుకగా ఉండబోతోంది’ అని ట్వీట్ చేశారు.

News October 17, 2024

వైసీపీలోకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి

image

AP: వైసీపీ నేతలు అధికారంలో ఉన్న కూటమి పార్టీల్లో చేరుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ముదునూరి మురళీకృష్ణం రాజు ఆ పార్టీని వీడారు. ప్రస్తుతం ఆయన టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు ఉన్నారు. ఇవాళ మాజీ సీఎం జగన్ సమక్షంలో మురళీకృష్ణంరాజు వైసీపీలో చేరారు.

News October 17, 2024

46 పరుగులకే భారత్ ఆలౌట్

image

NZతో తొలి టెస్టులో టీమ్ ఇండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. 46 పరుగులకే భారత్ ఆలౌటైంది. పంత్ (20), జైస్వాల్ (13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. విరాట్, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, జడేజా, అశ్విన్ డకౌట్ అయ్యారు. హెన్రీ 5, విలియం 4, సౌథీ ఒక వికెట్ తీశారు.

News October 17, 2024

సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన షూటర్ అరెస్ట్

image

యాక్టర్ సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో ముందడుగు పడింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ షూటర్లలో ఒకరైన సుఖ్ఖాను నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారని IANS తెలిపింది. హరియాణా పోలీసుల సహకారంతో పానిపట్ సెక్టార్ 29లో అతడిని అధీనంలోకి తీసుకున్నారు. గురువారమే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సుఖ్ఖాది రైల్ కలాన్ విలేజ్. ఏప్రిల్‌లో బాంద్రాలోని సల్మాన్ ఇంటిపై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరపడం తెలిసిందే.