India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: మద్యంపై ఉన్న పలు రకాల పన్నులు, మార్జిన్‌లను కూటమి సర్కార్ తొలగించింది. గత ప్రభుత్వంలో ఉన్న 4శాతం రిటైల్ ఎక్సైజ్ పన్ను, ఏపీఎస్‌బీసీఎస్ రిటైల్ మార్జిన్(6శాతం), ల్యాండెడ్ కాస్ట్‌పై 10 శాతం అదనపు ఎక్సైజ్ సుంకాలకు స్వస్తి పలికింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మొత్తంగా 10 రకాల పన్నులు ఉండగా అవి 6కి తగ్గాయి.
పంజాబ్ కింగ్స్ ఒక్క ఆటగాడినే రిటైన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అది కూడా వేలంలో పొరపాటున కొన్న శశాంక్ సింగ్‌ను అట్టిపెట్టుకుంటున్నట్లు సమాచారం. కాగా పంజాబ్ మొదటి నుంచీ రిటెన్షన్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. అన్ని ఫ్రాంచైజీలు అందరినీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. అప్పుడే నాణ్యమైన ఆటగాళ్లు అన్ని జట్లకు దొరుకుతారని వాదిస్తోంది. కానీ ఆ జట్టు అభ్యర్థనను BCCI అంత సీరియస్‌గా తీసుకోలేదు.
AP: అమరావతి పనులను 20 రోజుల్లో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రూ.49వేల కోట్ల విలువైన పనులకు జనవరిలోగా టెండర్లు పిలుస్తామన్నారు. మౌలిక వసతులు, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, HODల కార్యాలయాల నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. MLAలు, MLCలు, IASల భవనాల నిర్మాణానికి రూ.524 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. 2 నెలల్లో వరల్డ్ బ్యాంక్ రూ.15వేల కోట్ల రుణం మంజూరు చేస్తుందన్నారు.
AP: రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో నేడు పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో సెలవు మంజూరు చేశారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కలెక్టర్లు హాలిడే ప్రకటించినా విద్యాసంస్థలు నడపటంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
AP: తిరుపతి జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 22 KM వేగంతో తీరాన్ని చేరినట్లు పేర్కొంది. ఈ సమయంలో భారీ ఈదురుగాలులు వీచినట్లు తెలిపింది. ప్రస్తుతం వాయుగుండం అల్పపీడనంగా బలహీన పడుతోందని పేర్కొంది. కాగా దీని ప్రభావంతో ప్రస్తుతం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఖలిస్థానీ తీవ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ జోక్యంపై తన వద్ద ఆధారాల్లేవన్న కెనడా ప్రధాని ట్రూడోపై ఇండియా మండిపడింది. భారత్-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతినడానికి ట్రూడో ఒక్కరే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. తమ జోక్యం లేదని ఎప్పటినుంచో వాదిస్తున్నామని, అయినా ట్రూడో తప్పుడు ఆరోపణలు చేశారని ఫైరయింది. ఇలాంటి తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన ఒక్క ఆధారం చూపలేకపోయారని విమర్శించింది.
AP: RTI ప్రకారం పోలీస్ శాఖలో 19,999 ఖాళీలు ఉన్నాయని, వీటిని ప్రభుత్వం భర్తీ చేయడం లేదంటూ ఓ వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విచారించిన ధర్మాసనం.. వీటి భర్తీకి ఏం చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోస్టుల భర్తీని పర్యవేక్షించాలని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపింది. దాన్ని అమలు చేయాల్సిందేనని పేర్కొంటూ విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.
భారత్‌ను దుర్భర పేదరికం వెంటాడుతోందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. దేశంలో 12.9 కోట్ల మంది పేదలు ఉన్నారని తాజా నివేదికలో వెల్లడించింది. దీనికి జనాభా పెరుగుదలే కారణమని వివరించింది. వీరంతా ధనవంతులుగా మారడానికి దశాబ్దాలు పట్టొచ్చని పేర్కొంది. భారత్‌లో పేదల ఆదాయం రోజుకు రూ.181 కన్నా తక్కువగా ఉందని తెలిపింది. అయితే 1990లో 43.1కోట్ల మంది పేదలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 12.9కోట్లకు చేరుకుందని వివరించింది.
TG: గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలన్న కొందరు అభ్యర్థుల డిమాండ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ప్రిలిమ్స్ రాశామని, మళ్లీ వాయిదా వేయడం ఎందుకని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయం, డబ్బులు వృథా అవుతున్నాయని వాపోతున్నారు. రిజర్వేషన్లపై కోర్టులో కేసులు ఉన్నాయని, ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే మళ్లీ మొదటికి వస్తుందని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
AP: వాయుగుండం ప్రభావంతో కాకినాడ(D) ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. భారీగా ఎగసిపడుతున్న రాకాసి అలలు, ఈదురుగాలుల ధాటికి పలు ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ఇళ్లలోకి సముద్ర జలాలు చేరాయి. దీంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రస్తుతం గంటకు 17KM వేగంతో వాయుగుండం కదులుతోంది. మరికొన్ని గంటల్లో పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటనుంది. దీనిప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.