India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డైరెక్టర్ తేజ కుమారుడు అమితోవ్ తేజ హీరోగా ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నవంబర్ లేదా డిసెంబర్‌లో షూటింగ్ మొదలు కావొచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఈ చిత్రానికి తేజానే దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాను ఆయనే నిర్మిస్తారా? వేరే నిర్మాత ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తారా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
హైదరాబాద్‌లో వచ్చే 3 నెలల పాటు ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. ఈ ఏడాది జనవరిలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. వచ్చే జనవరిలో 5 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావొచ్చని పేర్కొంది. అక్టోబరు-నవంబరు మధ్యకాలంలో పసిఫిక్ సముద్రంలో ఏర్పడే ‘లా నినా’యే దీనికి కారణమని వివరించింది. పొగ మంచు కూడా ఎక్కువగా ఉంటుందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ‘వైసీపీ నేతలను కేసుల్లో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన ఘటనలో ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. కేసు ముగిసే సమయానికి నోటీసులు ఏంటి? నటి జెత్వానీ కేసులోనూ ఇలాగే నన్ను ఇరికించారు. స్కిల్ కేసులో CBNకు ఈడీ క్లీన్ చిట్ ఎలా ఇస్తుంది? ఇంతకన్నా బరితెగింపు ఉంటుందా?’ అని ఫైర్ అయ్యారు.
TG: పథకాలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘మహిళలకు 2 బతుకమ్మ చీరలు ఇస్తానని ఇవ్వలేదు. రూ.15వేల రైతుబంధు అమలు చేయలేదు. ఆగస్టులో చేయాల్సిన చేప పిల్లల పంపిణీ అక్టోబర్ వచ్చినా చేయలేదు. KCR కిట్ కంటే మంచిది ఇస్తానని చెప్పి గర్భిణులను మోసం చేశారు’ అని మండిపడ్డారు. ఉన్న పథకాలను నిలిపివేయడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని అన్నారు.
రాజకీయ సభల్లో వేదికపై ఉన్న అతిరథ మహారథులు అంటూ ప్రసంగాలు మొదలుపెడుతుంటారు. అసలు ఆ పదాన్ని ఎవరికి వాడాలి? అతిరథ మహారథులు అంటే ఎవరు? అనే విషయాన్ని తెలుసుకుందాం. యుద్ధంలో పాల్గొన్న యోధుల సామర్థ్యాన్ని తెలిపేందుకు ఈ పదాన్ని వాడతారు. ఏకకాలంలో 5వేల మందితో యుద్ధం చేసేవారిని రథి అని, 60వేల మందితో యుద్ధం చేస్తే అతిరథ అని, 7లక్షల మందితో యుద్ధం చేసేవారిని మహారథి అని అంటారు. వీరు మాత్రమే ఆ పిలుపునకు అర్హులు.
నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్య దిశగా 15 కి.మీ వేగంతో వాయుగుండం కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. చెన్నైకి 280 కి.మీ, పుదుచ్చేరికి 320 కి.మీ, నెల్లూరుకి 370kmల దూరంలో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే అవకాశం ఉందని చెప్పింది.
రష్యాకు చెందిన ఓ వ్యక్తి 67 రోజుల పాటు సముద్రంలోనే ఉండి బతికి బట్టకట్టాడు. ఆగస్టు 9న మిఖాయిల్ పిచుగన్ (46), తన సోదరుడు (49), అతడి కుమారుడి(15)తో కలిసి చిన్న పడవలో తిమింగలాలను చూసేందుకు సఖాలిన్ ఐలాండ్‌కు వెళ్లారు. కొంతదూరం వెళ్లాక బోటు ఇంజిన్ పనిచేయలేదు. పిచుగన్ సోదరుడు, ఆయన కుమారుడు చలికి తట్టుకోలేక చనిపోయారు. దాదాపు 1,000 కి.మీ ప్రయాణించిన తర్వాత పడవ ఉస్త్-ఖెర్యుజోవా తీరానికి కొట్టుకువచ్చింది.
TG: ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్, వాణి ప్రసాద్‌ను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. డీవోపీటీ ఆదేశాల మేరకు ఈ నలుగురూ ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. వీరు రిలీవ్ కానున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ, టూరిజం, మహిళ-శిశు సంక్షేమశాఖ, GHMC కమిషనర్‌ను ప్రభుత్వం వేరే అధికారులతో భర్తీ చేయనుంది.
దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని ఆందోళన చెందుతున్న వేళ ఉద్యోగార్థులు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో ఓ కంపెనీ సీఈవో చెప్పుకొచ్చారు. Entourage కంపెనీ CEO అనన్య నారంగ్ తనకు వచ్చిన జాబ్ అప్లికేషన్‌ను Xలో పంచుకున్నారు. ఈ జాబ్‌కు తనకు అన్ని అర్హతలున్నాయని పేర్కొంటూ అనుభవాలు, తన స్కిల్స్‌ను చెప్పకుండా ఖాళీగా ఉంచేశారు. గూగుల్ నుంచి కాపీ చేసి అలానే పంపించేశారని, సొంతంగా ఆలోచించట్లేదని ఆమె మండిపడ్డారు.
అలనాటి అందాల తార, మాజీ ఎంపీ జయప్రదకు రాంపూర్ MP-MLA కోర్టు ఊరట కల్పించింది. ఎవిడెన్స్ లేని కారణంగా ఆమెపై కేసును కొట్టేసింది. 2019 ఎలక్షన్ల సమయంలో ఆమె ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఓ రోడ్డును ఆరంభించిన వీడియో వైరలైంది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆ విచారణ ఇప్పటికి ముగిసింది. ఒకప్పుడు సమాజ్‌వాదీ పార్టీలో కీలకంగా ఉన్న జయప్రద ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమవ్వడం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.