India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నేటి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనుంది. సుమారు 45 కోట్ల మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమానికి వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో స్నానమాచరిస్తే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. దీని నిర్వహణ కోసం యూపీ ప్రభుత్వం రూ.7వేల కోట్లు కేటాయించింది. ఫిబ్రవరి 26వరకు ఈ కుంభమేళా కొనసాగనుంది.

TG: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు సమర్పించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 5 వరకు ఫైన్‌తో అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు www.ouadmissions.com, www.osmania.ac.in వెబ్‌సైట్‌లు సంప్రదించండి.

కపిల్‌దేవ్ హరియాణా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఎలాంటి కారణం లేకుండా తనను టీమ్ నుంచి తొలగించినట్లు యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ తెలిపారు. ఆ సమయంలో కోపంలో కపిల్ ఇంటికి తుపాకితో వెళ్లానన్నారు. కపిల్ తల్లితో కలిసి బయటకు రాగా అతడిని తీవ్రంగా తిట్టానని, తలలోకి బుల్లెట్ దించాలని అనుకున్నట్లు చెప్పారు. వాళ్ల అమ్మను చూసి ఆగిపోయానన్నారు. ఆ తర్వాత క్రికెట్ ఆడకూడదని డిసైడ్ అయినట్లు యోగ్‌రాజ్ తెలిపారు.

సంక్రాంతి పిండి వంటల్లో నువ్వులు లేకుండా దాదాపు ఏ వంటను పూర్తి చేయరు. వీటిని పరిమితంగా తింటే గుండెకు మేలని, ఎముకలు దృఢంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రోజూ మోతాదుకు మించి నువ్వులను తీసుకోవడం వల్ల బరువు పెరగడం, జీర్ణక్రియ సమస్యలు, రక్తపోటు తగ్గడం, అలర్జీ, కిడ్నీలో స్టోన్స్, శరీరంలో ఐరన్ పెరగడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు.

తనను ఢిల్లీ బీజేపీ సీఎంగా అభ్యర్థిగా ఆప్ చీఫ్ కేజ్రీవాల్ పేర్కొనడాన్ని రమేశ్ బిధూరి కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి పదవిపై తనకు ఎలాంటి ఆశ లేదని ఈ బీజేపీ నేత స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే ఆప్ చీఫ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ తనకు చాలా ఇచ్చినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు CM రేవంత్, చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని కుటుంబాల్లో సంక్రాంతి కొత్త వెలుగులు తీసుకురావాలని రేవంత్ ఆకాంక్షించారు. పతంగులు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలని చంద్రబాబు ట్వీట్ చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అందరి ఇళ్లలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

1948: హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టారు
1879: లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జననం
1919: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జననం
1949: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ జననం
1995: సినీ నటుడు వైష్ణవ్ తేజ్ జననం
2014: తెలుగు సినిమా నటి అంజలీదేవి మరణం

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

‘డాకు మహారాజ్’ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో మంత్రి లోకేశ్ తన మామ, హీరో బాలకృష్ణ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయన ఎనర్జీ, చరిష్మా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోందన్నారు. ఈ సినిమాకు విశేష స్పందన వస్తోందని, ప్రతిచోటా రికార్డులను బ్రేక్ చేస్తోందని పేర్కొన్నారు. బాలయ్య తెలుగు సినిమాకు కొత్త బెంచ్ మార్కులు సెట్ చేయడం చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.

TG: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సంక్రాంతి సెలవుల కారణంగా ఇవాళ ఉండదని హైడ్రా ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ సెలవులలో ప్రజావాణి నిర్వహించట్లేదని గతంలోనే ప్రకటించినట్లు తెలిపింది. వచ్చే సోమవారం(20.01.2025) తిరిగి నిర్వహిస్తామని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.