India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఈ సీజన్లో గోదావరికి వరద ప్రారంభం కావడంతో పులస చేపల సందడి మొదలైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మం. రామరాజులంక వద్ద ఉన్న వశిష్ఠ గోదావరిలో కేజిన్నర బరువున్న పులస చేప చిక్కింది. దీన్ని ఓ వ్యక్తి రూ.24వేలకు కొనుగోలు చేశారు. ఏడాదిలో తక్కువ కాలం లభ్యం కావడం, రుచి అమోఘంగా ఉండటంతో పులస చేపలకు డిమాండ్ ఎక్కువ.
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దీన్ని దాఖలు చేశారు. అనర్హతకు తగిన ఆధారాలను తీసుకుని ఈ నెల 1న తాను స్పీకర్ కార్యాలయానికి వెళ్లానని, ఆయన లేకపోగా అక్కడి సిబ్బంది కూడా ఫిర్యాదును స్వీకరించలేదని అందులో తెలిపారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.
జింబాబ్వే-భారత్ 5 టీ20ల సిరీస్‌లో నేడు నాలుగో మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన మూడింటిలో 2 గెలిచిన భారత్, ఈరోజు కూడా విజయం సాధించి సిరీస్‌ను దక్కించుకునే అవకాశం ఉంది. టీమ్ ఇండియా ఆటగాళ్లందరూ చక్కటి ఫామ్‌లో కనిపిస్తున్నారు. సిరీస్ కాపాడుకోవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వే ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరం. సాయంత్రం 4.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
TG: ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు ఉన్నవారు ఉదయం ఎగ్జామ్ రాసిన సెంటర్‌లోనే రెండోదానికి హాజరుకావచ్చని విద్యాశాఖ తెలిపింది. కొందరు అభ్యర్థులు నాన్ లోకల్ పోస్టులకు అప్లై చేయడంతో వారికి ఇతర జిల్లాలో కేంద్రాలిచ్చింది. దీంతో ఉదయం ఒక జిల్లాలో మధ్యాహ్నం మరొక జిల్లాలో పరీక్ష ఉండటంతో వారికి హాల్ టికెట్లు మార్చి ఇస్తామని పేర్కొంది. ఈ నెల 18 నుంచి DSC పరీక్షలు జరగనున్నాయి.
AP: ఈ నెల 15 నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలను కలిసేందుకు మాజీ సీఎం జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయించినట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
నిన్న వెస్టిండీస్‌తో ముగిసిన టెస్టుతో క్రికెట్‌కు ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిపై మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ప్రశంసలు కురిపించారు. ‘నువ్వు అద్భుతంగా ఆడావు. ఇన్నేళ్లుగా ఇచ్చిన స్ఫూర్తికి, మనిద్దరి మధ్య జరిగిన పోరాటాలకు థాంక్యూ. నీ ఆఖరి మ్యాచ్‌ను చూసేందుకు వచ్చాను. కొన్నింటిని మిస్ కాకూడదు. కంగ్రాట్యులేషన్స్’ అని ట్వీట్ చేశారు.
TG: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను ఎండగట్టి సమస్యలపై పోరాటం చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను సాధిస్తామని పార్టీ సమావేశంలో జోస్యం చెప్పారు. ‘కాంగ్రెస్ ప్రజల్ని మభ్యపెట్టి గెలిచింది. ఆ పార్టీ నిరంకుశ, అప్రజాస్వామిక విధానాల కారణంగా ధర్నాలు, నిరసనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది’ అని విమర్శించారు.
గత నెలతో ముగిసిన త్రైమాసికంలో 20.3శాతం వృద్ధితో రూ.4257 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు హెచ్‌సీఎల్ ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.3534 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఆదాయంలో 7శాతం వృద్ధి సాధించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సంస్థ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.2 ఫేస్ వాల్యూ ఉన్న ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.12 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ఆమోదించింది.
అనంతమైనదీ విశ్వం. అందులో జరిగే ప్రతి ఘటన అద్భుతం. అలాంటి ఓ అద్భుతాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తన లెన్స్‌తో బంధించింది. పెంగ్విన్, ది ఎగ్ అనే రెండు నక్షత్ర సమూహాలు ఒకదానితో మరొకటి ఢీకొట్టి కలిసిపోతున్న ఆ ఫొటోను నాసా తాజాగా విడుదల చేయగా, నెట్టింట వైరల్ అవుతోంది. భూమికి 326 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో చోటు చేసుకుంటున్న ఆ ఖగోళ అద్భుతం, రెండు గెలాక్సీల మధ్య సయ్యాటలా ఉందంటున్నారు నెటిజన్లు.
AP: వచ్చే నెల 1 నుంచి గ్రామస్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు మొదలుపెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రధానంగా నోరు, గర్భాశయం, రొమ్ము క్యాన్సర్ పరీక్షలు ఉండనున్నాయి. ఇప్పటికే సుమారు 20వేలమందికి ఆరోగ్య శాఖ శిక్షణ పూర్తి చేసింది. చాలామంది ప్రజలు క్యాన్సర్ ముదిరేవరకు దాని గురించి తెలుసుకోలేపోతున్నారని.. ముందుగా వ్యాధిని గుర్తించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు వివరిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.