News July 13, 2024

నా సినిమా ఫ్లాపయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు: అక్షయ్

image

తన సినిమాలు ఫ్లాపయితే కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తాజాగా వాపోయారు. ఆయన గత సినిమాలు బడే మియాన్ చోటే మియాన్, రామ్ సేతు, రక్షాబంధన్, బచ్చన్ పాండే, సెల్ఫీ బాక్సాఫీస్ వద్ద వరసగా విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వైఫల్యాల్ని ఎదుర్కోవడాన్ని అమితాబ్ బచ్చన్‌ నుంచి తాను నేర్చుకున్నానని, శ్రమనే నమ్ముకుంటానని తెలిపారు.

News July 13, 2024

ఆ వర్సిటీలో 94 ఏళ్లలో తొలిసారిగా మాంసాహారం

image

కేరళలోని కళామండలం యూనివర్సిటీలో 94 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా క్యాంటీన్‌లో మాంసాహారాన్ని యాజమాన్యం ఏర్పాటు చేసింది. సంస్థ మొదలైనప్పటి నుంచి శాకాహారమే ఇక్కడ అందుబాటులో ఉండేది. నాన్ వెజ్ కోసం విద్యార్థులు డిమాండ్ చేస్తుండటంతో తాజాగా చికెన్ బిర్యానీ ఏర్పాటు చేసింది. దాన్ని త్రిస్సూర్‌లోని వియ్యూర్ జైలు ఖైదీలు తయారుచేయడం విశేషం. 1930లో ప్రారంభమైన కళామండలం గురుకుల వ్యవస్థలో నడుస్తోంది.

News July 13, 2024

వింబుల్డన్ ఫైనల్స్‌కు చేరుకున్న జకోవిచ్

image

సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ పురుషుల వింబుల్డన్‌లో ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఇటలీ ఆటగాడు లొరెంజో ముసెట్టిని ఆయన 3 వరస సెట్లలో ఓడించారు. రేపు జరిగే ఫైనల్‌లో ఆయన కార్లోస్ ఆల్కరాజ్‌తో తలపడతారు. అటు కార్లోస్ రష్యాకు చెందిన డానిల్ మెద్వెదేవ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే.

News July 13, 2024

15 నుంచి సర్దార్-2 షూటింగ్ షురూ

image

పీఎస్ మిత్రన్ డైరెక్షన్‌లో కార్తీ హీరోగా సర్దార్-2 షూటింగ్ ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇవాళ చెన్నైలో పూజా కార్యక్రమాలు జరిగాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సర్దార్ సినిమా 2022లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ‘కాంబోడియా స్పై మిషన్’లో హీరో ఏం చేశాడనే కథాంశంతో సీక్వెల్ రూపొందనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది.

News July 13, 2024

గంభీర్ 100శాతం ప్రదర్శనను ఆశిస్తారు: ఆవేశ్

image

భారత హెడ్ కోచ్ గంభీర్ జట్టు ఆటగాళ్ల నుంచి వందశాతం ప్రదర్శనను, అంకితభావాన్ని ఆశిస్తారని బౌలర్ ఆవేశ్ ఖాన్ అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేకుండా జట్టు ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారని కొనియాడారు. ‘ఆయన ఎక్కువ మాట్లాడరు. కానీ ఆటగాళ్లకు వారి వారి బాధ్యతల్ని సక్రమంగా కేటాయిస్తారు. ఏం చేయాలన్న పాయింట్‌ను సూటిగా అర్థమయ్యేలా చెబుతారు’ అని పేర్కొన్నారు. గంభీర్, ఆవేశ్ ఇద్దరూ లక్నో జట్టులో కలిసి పనిచేశారు.

News July 13, 2024

160 ఏళ్ల నాటి చీర ధరించిన అలియా!

image

అనంత్ అంబానీ వివాహానికి నటి అలియా భట్ అత్యంత స్వచ్ఛమైన పట్టుతో నేసిన చీరను ధరించారు. డిజైనర్ మనీశ్ మల్హోత్రా కలెక్షన్‌కు చెందిన ఆ చీర ప్రత్యేకత దాని వయసే. 160 ఏళ్ల క్రితం గుజరాత్‌లో నేసిన ఆశావలి చీర అది. 99శాతం స్వచ్ఛమైన వెండి, 6 గ్రాముల బంగారంతో కలగలిపి నేసిన నిజమైన జరీ అంచుతో ఉంటుంది. అలియా ఒంటిపై ధగధగలాడిపోయిన ఆ చీర గురించే ప్రస్తుతం మగువల మధ్య చర్చ నడుస్తోంది.

News July 13, 2024

వెంటాడుతున్న కాలనాగు.. ఇప్పటికే 7సార్లు కాటు!

image

యూపీలో వికాస్ దూబే అనే యువకుడు <<13592399>>35 రోజుల్లో 6సార్లు పాముకాటుకు గురైన<<>> సంగతి తెలిసిందే. అతడిని గురువారం మళ్లీ కరిచింది. ఎక్కడికి వెళ్లినా కాలనాగు వెంటాడుతుండటంతో బాధితుడి కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మొత్తం 9సార్లు కాటుకు గురవుతానని పాము కలలో చెప్పిందని యువకుడు చెబుతున్నాడు. ఆఖరి కాటు తర్వాత చనిపోతానని హెచ్చరించిందని పేర్కొన్నాడు.

News July 13, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 13, 2024

జులై 13: చరిత్రలో ఈరోజు

image

1905: భూదానోద్యమంలో భూమిని దానం చేసిన మొదటి భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డి జననం
1915: స్వాతంత్ర్య సమరయోధుడు గుత్తి రామకృష్ణ జననం
1964: మాజీ క్రికెటర్ ఉత్పల్ చటర్జీ జననం
1967: సినీ నటి సీత జననం
2004: గుమ్మడిదలలో తొలి గ్రామీణ సమాచార కేంద్రం ప్రారంభం
2013: తెలంగాణ పోరాట యోధుడు కోడి సర్వయ్య మరణం
2018: నేపథ్యగాయని కె. రాణి మరణం

News July 13, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జులై 13, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:29 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:49 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
అసర్: సాయంత్రం 4:56 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:54 గంటలకు
ఇష: రాత్రి 8.15 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.