India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం తన క్యాంప్ ఆఫీసు, పార్టీ ఆఫీసు, పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తానని డిప్యూటీ CM పవన్ వెల్లడించారు. ‘నిపుణుల ద్వారా వ్యర్థాల నిర్వహణపై అందరికీ అవగాహన కల్పిస్తాం. దీని ద్వారా ఏటా రూ.2643 కోట్ల సంపద సృష్టించడంతో పాటు 2.42 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు. ఈ ఆదాయాన్ని కార్మికులకు కేటాయిస్తాం’ అని వ్యర్థాల నిర్వహణపై సమీక్ష అనంతరం ఆయన వ్యాఖ్యానించారు.
టెన్నిస్, బ్యాడ్మింటన్ కంటే క్రికెట్ కష్టమేమీ కాదని సైనా నెహ్వాల్ చేసిన వ్యాఖ్యలపై KKR యువ ఆటగాడు రఘువంశీ సెటైర్ వేశారు. ‘బుమ్రా 150Kmph వేగంతో తలపైకి బౌన్సర్ విసిరితే ఆమె ఏం చేస్తుందో చూడాలి’ అని ట్వీట్ చేయగా నెటిజన్లు ఫైరయ్యారు. ఒలింపిక్ పతక విజేతపై అలాంటి కామెంట్ తప్పని చెప్పడంతో రఘువంశీ పోస్టును తొలగించారు. ‘అదొక బ్యాడ్ జోక్. నేను తప్పు తెలుసుకున్నా. క్షమించండి’ అని రాసుకొచ్చారు.
ఆవర్తన ప్రభావంతో APలో వర్షాలు కురుస్తున్నాయి. రేపు మన్యం, అల్లూరి, ఉభయగోదావరి, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, NTR, నెల్లూరు, కర్నూలు, YSR, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయంది. ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
యూపీలోని ఫతేపూర్‌లో విచిత్ర ఘటన జరిగింది. 24 ఏళ్ల వికాస్ దూబేను 40 రోజుల్లో ఏడు సార్లు పాము కాటేసింది. జిల్లాలోని సౌరా గ్రామానికి చెందిన దూబే జూన్ 2 నుంచి జూలై 6 మధ్య ఆరుసార్లు పాము కాటుకు గురయ్యాడు. ఏడవ కాటు తర్వాత ఆయన తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యాడు. పాము కాట్లు ఎల్లప్పుడూ శనివారం, ఆదివారాల్లోనే జరిగాయని దూబే తెలిపారు. వేరే ప్రాంతాలకు వెళ్లి ఉన్నా అతనిని పాముకాట్లు వెంటాడుతున్నాయి.
ఈ నెల 5న విడుదలైన మీర్జాపూర్-3 వెబ్ సిరీస్ చరిత్ర సృష్టించింది. స్ట్రీమింగ్ మొదలైన తొలి వారం INDలో అమెజాన్ ప్రైమ్‌లో అత్యధిక మంది వీక్షించిన సిరీస్‌గా నిలిచినట్లు OTT సంస్థ తెలిపింది. 180+ దేశాల ప్రజల వీక్షించగా, 85 కంట్రీస్‌లో టాప్-10లో ట్రెండ్ అవుతోందట. కాగా తొలి రెండు సీజన్లతో పోల్చితే ఈ సిరీస్ ఆకట్టుకోలేదని వీక్షకులు చెబుతున్నారు. మరోవైపు సీజన్-4 షూటింగ్ కూడా మొదలైనట్లు మేకర్స్ వెల్లడించారు.
కేరళకు చెందిన తెలుగు IAS అధికారి మైలవరపు కృష్ణతేజ ఏపీకి డిప్యుటేషన్‌పై రానున్నారు. ప్రస్తుతం త్రిసూర్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన్ను మూడేళ్లపాటు ఏపీకి పంపేందుకు అనుమతిస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కేరళలో సమర్థుడైన IASగా పేరు తెచ్చుకున్న కృష్ణతేజ.. రెండు అంతర్జాతీయ, ఏడు జాతీయ అవార్డులను అందుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ పర్యవేక్షించే శాఖల్లో కృష్ణతేజ పనిచేస్తారనే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరికాసేపట్లో వర్షం కురుస్తుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, జనగామ, గద్వాల్, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
AP, TGలో నడిచే 12 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా <
AP: వైసీపీ పాలనను విమర్శించాననే కక్షతో 2021లో తన హత్యకు కుట్ర పన్నారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తన పుట్టినరోజు నాడే అంతమొందించేందుకు ప్రయత్నించారని చెప్పారు. తనపై హత్యాయత్నం చేసిన వారందరికీ శిక్ష పడాలని ఆయన కోరారు. కూటమి అధికారంలోకి రాకపోయుంటే తనను ఇప్పటికే చంపేసేవారని చెప్పారు.
AP: రాజధాని అమరావతిలోని కట్టడాల పటిష్ఠతపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయాలని నిర్ణయించింది. సచివాలయాల ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ భవనాల బేస్‌మెంట్లు, ఐఏఎస్, ఎన్జీఓల సముదాయాల పటిష్ఠతపై స్టడీ చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. వీటి పటిష్ఠత నిర్ధారణ బాధ్యతలను ఐఐటీ చెన్నైకి అప్పగించాలని నిర్ణయించారు. ఐఐటీ చెన్నై ఇచ్చే నివేదిక ఆధారంగా భవన నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
Sorry, no posts matched your criteria.