India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సందడి చేశారు. స్టైలిష్ లుక్‌లో హిట్‌మ్యాన్ అదిరిపోయారు. రోహిత్ రాకతో వింబుల్డన్ సెంటర్ కోర్టు కోలాహలంగా మారింది. మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ఈ పిక్స్ చూసిన అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.
TG: మాజీ సీఎం కేసీఆర్ తన మనుమడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారు. అతడికి కేసీఆర్ దంపతులు కేక్ తినిపించి, ఆశీర్వదించారు. ఈ ఫొటోలను హిమాన్షు ట్విటర్‌లో షేర్ చేశారు. తల్లిదండ్రులు కేటీఆర్-శైలిమ, చెల్లితో కలిసి దిగిన ఫొటోనూ పంచుకున్నారు.
నేపాల్‌లో ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలవగా, వ్యతిరేకంగా 194 మంది నిలిచారు. దీంతో ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అధ్వర్యంలోని ప్రభుత్వం కూలిపోయినట్లయ్యింది. CPN-UML పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. కాగా 2022 డిసెంబర్ 25న ప్రచండ నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన PM పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది.
APకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్ వెల్లడించారు. విశాఖలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, CII సభ్యులతో ఆయన భేటీ అయ్యారు. ‘పారిశ్రామికవేత్తలకు మెరుగైన రాయితీలు ఇవ్వడంతో పాటు పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడంలో ముందుంటాం. వ్యాపారం సులభతరం చేయడంపై త్వరలో CMతో చర్చించి పాలసీని రూపొందిస్తాం. ఏపీకి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ‘ఎమర్జెన్సీ’ నిర్ణయాన్ని యావత్ దేశం ఎప్పటికీ చీకటి అధ్యాయంగా గుర్తుంచుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. జూన్ 25ను ‘రాజ్యాంగ హత్యాదివస్’గా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు. ‘ఆనాడు రాజ్యాంగాన్ని కాలరాసి తర్వాత దేశం ఎదుర్కొన్న పరిస్థితులను ఈరోజు గుర్తుకుతెస్తుంది. ఎమర్జెన్సీ కారణంగా నష్టపోయిన ప్రతివ్యక్తికి నివాళులర్పించే రోజు జూన్ 25’ అని ఆయన రాసుకొచ్చారు.
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బెస్ట్ విషెస్ తెలిపారు. గత 21 ఏళ్లుగా అద్భుతమైన బౌలింగ్‌తో క్రికెట్ అభిమానులను జిమ్మీ అలరించారని ఆయన కొనియాడారు. ‘ఇన్నేళ్లుగా అంతే ఫిట్‌గా మీ బౌలింగ్ యాక్షన్, కచ్చితత్వం, స్వింగ్‌తో అలరించారు. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబంతో అద్భుతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
AP: కూటమి ప్రభుత్వం వచ్చిన 30 రోజుల్లో 30 కార్యక్రమాలు అమలు చేశామని TDP చేసిన <<13615395>>ట్వీట్‌పై<<>> YCP సెటైర్లు వేసింది. ‘వినేవాడు వెర్రివాడైతే చెప్పేవ్యక్తి చంద్రబాబు అని ఊరికే అంటారా? ఈ నెలలో చేసింది ఉసిరికాయంత.. చెప్పుకుంటోంది గుమ్మడికాయంత. చెయ్యనివన్నీ చేసినట్టు చెప్పారు.. చేసిన అప్పుల గురించి ఎందుకు చెప్పలేదు? పిచ్చి పబ్లిసిటీలు మానేసి హామీల అమలుపై దృష్టి పెట్టండి’ అని పేర్కొంది.
AP సముద్ర తీరంలో కోత నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తీర ప్రాంత నిర్వహణపై నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్(NCCR) రూపొందించిన ప్రణాళికను ఆయన విడుదల చేశారు. ‘రాష్ట్రంలో తీరం వెంబడి కోత సమస్య ఆందోళన కలిగిస్తోంది. ఉప్పాడ సహా కోత సమస్య ఎక్కడెక్కడ ఉంది? రక్షణ చర్యల గురించి అధ్యయనం చేయాలని ఆదేశాలిచ్చాం’ అని అధికారులతో భేటీలో ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో మరో 5 రోజులు(జులై 17 వరకు) భారీ వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉదయం 8.30 గంటల వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Sorry, no posts matched your criteria.