India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నటాషాతో విడాకుల వార్తల నడుమ హార్దిక్‌కు ఫ్యాన్స్ కొత్త సలహా ఇస్తున్నారు. పాండ్యతో ఓ అమ్మాయి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ‘హార్దిక్ ఆమెను పెళ్లి చేసుకో’ అని చెబుతున్నారు. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని ప్రచారమూ జరిగింది. ఆ ఫొటోలోని అమ్మాయి ప్రాచీ సోలంకి ఇన్‌స్టాలో ‘ఫ్యాన్ గర్ల్ మూమెంట్ ’ అని దీనిపై క్లారిటీ ఇచ్చారు. అయితే విడాకులపై స్పష్టత లేకుండా సలహాలివ్వడాన్ని కొందరు తప్పుబడుతున్నారు.
TG: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్(హైడ్రా) విధివిధానాలపై సీఎం రేవంత్ అధికారులకు సూచనలు చేశారు. ORR వరకు 2 వేల చ.కి.మీల పరిధిలో హైడ్రా విధులు నిర్వహించాలన్నారు. హోర్డింగ్స్, ఫ్లెక్సీల తొలగింపు బాధ్యత హైడ్రాకు ఇవ్వాలని, జోన్ల విభజనలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. నాళాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై నిబంధనలు కఠినంగా ఉండాలని, ఇదో బలమైన వ్యవస్థగా ఉండాలని ఆయన సూచించారు.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. నిందితులు భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. విచారణ కీలక దశలో ఉందని, నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోర్టును కోరారు. పోలీసులతో వాదనతో కోర్టు ఏకీభవించి బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసింది.
అంతర్గత కల్లోలం వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతోందంటూ 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఒత్తిడితో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ <<13615795>>ఎమర్జెన్సీకి<<>> ఆమోద ముద్ర వేశారు. ఎమర్జెన్సీ విషయాన్ని ఇందిరా రేడియోలో ప్రకటించారు. దీంతో దేశపౌరులు అణచివేతకు గురయ్యారు. సుమారు 1.50లక్షల మంది జైలుపాలయ్యారు. పత్రికాస్వేచ్ఛ మంటగలిసింది. అధికారం నుంచి దిగక తప్పదనే ఇందిర ఎమర్జెన్సీ విధించారని విమర్శలొచ్చాయి.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడంలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. కేసీఆర్‌ను అరెస్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. అటు స్థానిక సంస్థల ఎన్నికలపై సర్కార్ ఆలోచించడంలేదని, నెలరోజుల్లో ఎలక్షన్స్ జరపాలని రఘునందన్ డిమాండ్ చేశారు.
AP: సీఎం చంద్రబాబు రేపు సాయంత్రం ముంబైకి వెళ్లనున్నారు. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలో పాల్గొననున్నారు. రాత్రికి ముంబైలోనే బస చేసి ఆదివారం అమరావతికి సీఎం రానున్నారు.
ప్రజలను అవమానించడం బలం కాదని, వారి బలహీనతకు నిదర్శనమని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పారు. అమేథీలో ఓడిన కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీ లేదా ఇతర నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని అందరికీ సూచించారు. జీవితంలో గెలుపోటములు సహజమన్నారు. కాగా 2019లో రాహుల్‌పై అమేథీలో గెలిచిన స్మృతి.. 2024లో కిశోర్ లాల్ శర్మ చేతిలో ఓడారు. దీంతో కొన్ని రోజులుగా కాంగ్రెస్ అభిమానులు ఆమెపై విమర్శలు చేస్తున్నారు.
AP: రాష్ట్రంలో 4,151KM మేర రోడ్లపై గుంతలు ఉన్నాయని అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రహదారులు మరో 2,936KM మేర ఉన్నాయని చెప్పారు. వీటి కోసం కనీసం రూ.300 కోట్లు అవసరమన్నారు. దీంతో గుంతలు పూడ్చే పనులను వెంటనే చేపట్టాలని సీఎం ఆదేశించారు. రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో మెరుగైన సాంకేతికతను వినియోగించడంపై తిరుపతి IIT, SRM వర్సిటీ ప్రొఫెసర్లు, నిపుణులతో ఆయన చర్చించారు.
AP: ప్రజలను మోసం చేసి కూటమి అధికారంలోకి వచ్చిందని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. ఆరడుగుల అబద్ధానికి చంద్రబాబే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు ఇచ్చే ఉచిత ఇసుకలో ఉచితం ఉండదు. అమ్మకు వందనం అంటారు.. పిల్లలకు పంగనామం పెడతారు. హామీల అమలును మరిచి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పోలవరాన్ని నాశనం చేసింది చంద్రబాబే. తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్య పెడుతున్నారు’ అని ఆయన మండిపడ్డారు.
జూన్ 25ను ‘రాజ్యాంగ హత్యాదినం’గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీ రోజుల్లో ఇబ్బందులు పడ్డ లక్షలాది భారత ప్రజలను స్మరించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. లక్షలాది మందిని అక్రమంగా జైల్లో వేశారని, మీడియా గొంతు నొక్కేశారని గుర్తుచేశారు. కాగా 1975 జూన్ 25న ఆనాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం దేశంలో ‘ఎమర్జెన్సీ’ విధించింది.
Sorry, no posts matched your criteria.