India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలో భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నెల్లూరు సహా పలు జిల్లాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదించాలని సూచించారు. కాగా వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
AP: రాష్ట్ర ప్రభుత్వ, అనుబంధ ఇంటర్ కాలేజీల్లో నేటి నుంచి ఒక గంట అదనంగా క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సా.4 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. తాజాగా సాయంత్రం 5 గంటలకు పొడిగించాలని తెలిపింది. ఈ క్రమంలో విద్యార్థులను పరీక్షలకు ప్రిపేర్ చేసేందుకు అదనపు సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
కంపెనీ నచ్చకో, మంచి జీతంతో మరో ఉద్యోగం వస్తేనో ప్రస్తుతం పనిచేస్తోన్న కంపెనీకి రాజీనామా చేస్తుంటారు. ఆ సమయంలో బాస్‌కి రిజిగ్నేషన్ లెటర్ సమర్పిస్తుంటారు. అయితే, ఓ వ్యక్తి తనకు కొత్త కంపెనీ నచ్చకపోతే మళ్లీ తిరిగొస్తానంటూ రాసిన రాజీనామా లేఖ వైరలవుతోంది. ‘నాకు ఓ కంపెనీలో జాబ్ వచ్చింది. అక్కడికి వెళ్లి ఎలా ఉంటుందో అనుభూతి చెందుతా. నచ్చకపోతే మళ్లీ వచ్చేస్తా’ అని లెటర్‌లో ఉంది.
ఇండియాపై దౌత్యపరమైన ఆంక్షలు విధించాలని కెనడాలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ (NDP) లీడర్, ఎంపీ జగ్మీత్ సింగ్ అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కెనడాలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ను బ్యాన్ చేయాలని ప్రధాని జస్టిన్ ట్రూడోని కోరారు. భారత హై కమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తలను కెనడా బహిష్కరించడాన్ని సమర్థించారు. భారత ఏజెంట్లు కెనడాలోని సిక్కులపై దాడులు చేస్తున్నారని సింగ్ ఫైరయ్యారు.
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు(D) జలదంకిలో అత్యధికంగా 23.5 cm, విడవలూరులో 20.6 cm, అల్లూరులో 19.7 cm, కావలిలో 18.7 cm, బోగోలులో 18.2 cmల వర్షపాతం నమోదైంది. రేపు వాయుగుండం తీరం దాటే అవకాశం ఉండటంతో అధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశారు.
బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రం టైటిల్‌ను అనౌన్స్ చేశారు. బ్లాక్‌బస్టర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ-2 తాండవం’ రానున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ట్వీట్ చేసింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని పేర్కొంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించనుండగా బాలకృష్ణ కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించనున్నారు.
TG: ఐదేళ్ల చిన్నారి గుండెపోటుతో మరణించిన ఘటన కరీంనగర్(D) జమ్మికుంటలో జరిగింది. రాజు-జమున కుమార్తె ఉక్కులు(5) నిన్న ఉదయం కళ్లు తిరుగుతున్నాయని చెప్పింది. చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా హన్మకొండకు రిఫర్ చేశారు. అక్కడ వైద్యులు పరీక్షిస్తుండగా ఉక్కులు చనిపోయింది. ఆమెకు పుట్టినప్పటి నుంచే గుండె సంబంధిత సమస్య ఉండొచ్చని, పేరెంట్స్ గుర్తించకపోవడంతో మృతి చెంది ఉంటుందని వైద్యులు తెలిపారు.
దేశంలో ఎక్కువ భాగాలకు నైరుతి రుతుపవనాల వల్ల జూన్-అక్టోబర్ వరకు వర్షాలు కురుస్తాయి. అయితే పశ్చిమ కనుమల వల్ల నైరుతి రుతుపవనాలు తమిళనాడు తూర్పు తీరానికి విస్తరించలేవు. ఫలితంగా అక్కడ పొడి వాతావరణం ఉంటుంది. నైరుతి రుతుపవనాలు OCTలో హిమాలయాలను తాకి వెనుదిరుగుతాయి. వాటినే ఈశాన్య రుతుపవనాలు అంటారు. ఇవి తమిళనాడుతో పాటు మధ్య, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో DEC వరకు వర్షాలను కురిపిస్తాయి.
TG: వికారాబాద్ అడవుల్లో నిన్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ శంకుస్థాపన చేసిన రాడార్ స్టేషన్ పూర్తి పేరు ‘వెరీ లో ఫ్రీక్వెన్సీ(VLF) రాడార్ కమ్యూనికేషన్ స్టేషన్’. ఇండియన్ నేవీకి సంబంధించిన ఓడలు, జలాంతర్గాముల్లోని సిబ్బందితో మాట్లాడటంతో పాటు ఇతర రేడియో కమ్యూనికేషన్‌కు దీన్ని ఉపయోగిస్తారు. ఇది 3 KHz నుంచి 30 KHz రేంజ్‌లో తరంగాలను ప్రసారం చేస్తుంది. ఈ సిగ్నల్ నీటి లోపల కూడా 40మీ. వరకూ వెళ్లగలదు.
సముద్రమే లేని తెలంగాణలో ఇండియన్ నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడం వెనుక ఓ కారణం ఉంది. భారత్‌కు తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రంలో నిత్యం నేవీ జలాంతర్గాములు ప్రయాణిస్తూ ఉంటాయి. వాటి కమ్యూనికేషన్‌కు 2 సముద్రాల మధ్య దాదాపు సమాన దూరంలో ఉన్న వికారాబాద్ అడవి సరైనదిగా నేవీ భావించినట్లు సమాచారం. భారత్‌లో ఇది రెండో రాడార్ స్టేషన్. మొదటిది తమిళనాడులోని తిరునల్వేలి వద్ద ఏర్పాటు చేశారు.
Sorry, no posts matched your criteria.