India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మూడేళ్లలోపు పిల్లల శరీరం అతి సున్నితమైంది. కొందరు పేరెంట్స్ వారికి హార్డ్ బ్రష్‌తో పళ్లు తోముతుంటారు. ఇది వారి మృదువైన చిగుళ్లకు హాని కలిగిస్తుంది. ఇక స్నానం చేయించేటప్పుడు స్క్రబ్బర్‌తో రుద్దడాన్ని చిన్నారుల సున్నితమైన చర్మం తట్టుకోలేదు. తలస్నానం చేయించాక హెయిర్ డ్రయ్యర్ వినియోగం వల్ల వారి కుదుళ్లు దెబ్బతిని త్వరగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇలా మీరు చేయిస్తున్నట్లయితే వెంటనే ఆపేయండి. SHARE IT

TG: వేములవాడ అభివృద్ధి పనుల నేపథ్యంలో LED స్క్రీన్ ద్వారా రాజరాజేశ్వర స్వామి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్జిత సేవలను కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మేడారం జాతర సందర్భంగా భక్తులు ఇక్కడికీ పెద్ద సంఖ్యలో తరలివస్తారని వెల్లడించారు. తొలుత భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక <<17983463>>ఏర్పాట్లు<<>> చేసిన విషయం తెలిసిందే.

స్వదేశంలో జరుగుతున్న ఉమెన్స్ వరల్డ్ కప్‌పై భారత జట్టుతో పాటు ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ SA, AUSపై వరుస ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు. గెలవాల్సిన మ్యాచ్‌ల్లో హర్మన్ కెప్టెన్సీ వల్లే ఓడిపోయామని ఫైరవుతున్నారు. బ్యాటింగ్‌లోనూ విఫలమవుతున్న తనను(21, 19, 9, 22) కెప్టెన్సీ నుంచి తొలగించాలని BCCIని డిమాండ్ చేస్తున్నారు. అటు IND సెమీస్‌కు వెళ్లాలంటే మిగతా 3 మ్యాచ్‌లూ కీలకం కానున్నాయి.

AP: ఈనెల 15 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె యథాతథంగా జరగనున్నట్లు విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. ఉద్యోగుల జేఏసీతో యాజమాన్యాల చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయానికి వచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేవరకు పోరాటం ఆపేదే లేదని జేఏసీ స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ర్యాలీలు, ధర్నాలతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

కన్నడ కమెడియన్, బిగ్‌బాస్-7 కంటెస్టెంట్ రాజు తాలికొటే మరణించారు. నిన్న అర్ధరాత్రి గుండెపోటుకు గురైన ఆయనను కర్ణాటకలోని ఉడుపి మణిపాల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మనసారె, పంచరంగి, లైఫ్ ఈజ్ దట్, రాజ్‌ధాని, మైనా, టోపీవాలా వంటి చిత్రాల్లో ఆయన నటించారు. BB-7లో పాల్గొనడంతో పాటు పలు టీవీ సీరియళ్లలోనూ సందడి చేశారు. రాజు మృతి పట్ల కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ సంతాపం తెలిపారు.

AP: నకిలీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి <<17996336>>జోగి రమేశ్<<>> మరోసారి స్పందించారు. ఇదంతా చంద్రబాబు అల్లిన కట్టు కథ అని ఆరోపించారు. తిరుమల సన్నిధిలో ప్రమాణం చేసేందుకు, లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ప్రమాణానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సిద్ధమా అని సవాల్ విసిరారు. జనార్ధన్‌తో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని, బలవంతంగా అతనితో తన పేరు చెప్పించారని మండిపడ్డారు.

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలతో జరిగిన భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసు తరహాలోనే నకిలీ మద్యం కేసూ ఉందన్నారు. అంతా వాళ్లే చేసి తమపై నింద మోపుతున్నారని చెప్పారు. క్రిమినల్ మాస్టర్ మైండ్‌కు జగన్ ఉదాహరణ అని, వైసీపీ క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వాళ్ల నేరాలను టీడీపీపై నెట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

TG: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీపై అనిల్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు పెట్టారని, లాటరీలో షాపు దక్కకపోతే ఆ డబ్బు ఎక్సైజ్ శాఖకే వెళ్తుందన్నారు. షాప్ రానివారికి రూ.3 లక్షలు తిరిగిచ్చేలా ఆ శాఖను ఆదేశించాలని, ఆ GOను కొట్టేయాలని కోర్టును కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఎక్సైజ్ శాఖకు నోటీసులు జారీ చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

ఫొటో చూడగానే ఏ అమెరికానో, యూరప్ కంట్రీనో అని అనుకున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఇది మన హైదరాబాద్ నగరంలో తీసిన ఫొటోనే. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో తీసిన ఈ పిక్‌ను Xలో ఓ యూజర్ పోస్ట్ చేయగా తెగ వైరలవుతోంది. ఎత్తైన భవనాలు, మధ్యలో బంగారు వర్ణం మబ్బులతో కనువిందు చేస్తోంది. మీకెలా అనిపించింది? COMMENT
credits: @beforeishutup

AP: CBNకు చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యంపై సీబీఐతో విచారణ జరిపించాలని YCP డిమాండ్ చేసింది. నేడు రాష్ట్రంలో ధర్నాలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందించినట్లు ఆ పార్టీ పేర్కొంది. తప్పు చేసిన వాళ్లే సిట్‌తో దర్యాప్తు చేయించడం హాస్యాస్పదమని విమర్శించింది. దోషులు ఎవరున్నా తక్షణమే అరెస్టు చేయాలని, కల్తీ సరకుతో మరణించిన కుటుంబాలను ఆదుకోవాలంది. మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేసింది.
Sorry, no posts matched your criteria.