India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: RTC బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ విధానం అందుబాటులోకి రానుంది. ఆగస్టుకల్లా సిటీ సర్వీసుల్లో, సెప్టెంబర్ నాటికి అన్ని జిల్లాల్లో ఇది అమలు కానుంది. ఇందుకోసం RTC 10వేల ఐ-టిమ్ మెషీన్లను తమ సిబ్బందికి అందించనుంది. దీని ద్వారా ప్రయాణికులు ఫోన్‌తో QR కోడ్ స్కాన్ చేసి డబ్బు చెల్లించి టికెట్ పొందవచ్చు. ఇప్పటికే కొన్ని రూట్లలో గరుడ, రాజధాని, సిటీ బస్సుల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
TG: విద్యార్థి పేరు మార్చుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాక కొత్త పేరుతో మరో సర్టిఫికెట్ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటని SSC, ఇంటర్ బోర్డును హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం అనుమతిచ్చాక ఆ పేరే అమల్లోకి వస్తుందని, సర్టిఫికెట్లలో మార్పు అనవసరమని బోర్డు తరఫు న్యాయవాది అన్నారు. అయితే భవిష్యత్తులో పేరు మారిన కారణంగా ఆ విద్యార్థి దరఖాస్తు తిరస్కరణకు గురైతే ఆ నష్టం ఎవరు భరిస్తారని కోర్టు ప్రశ్నించింది.
AP: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండి టీబీసీ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,392 మంది భక్తులు దర్శించుకోగా.. 29,015 మంది తలనీలాలు సమర్పించారు. హుండీకి రూ.4.23 కోట్ల ఆదాయం సమకూరింది.
ఏపీలో NDA ప్రభుత్వం కొలువుదీరి నేటికి నెల రోజులు పూర్తయింది. పెన్షన్ పెంపు, ఉచిత ఇసుక, DSC హామీలను అమలు చేస్తోంది. ఫ్రీ బస్సు, తల్లికి వందనం, మహిళలకు నెలకు రూ.1,500 లాంటి కీలక హామీలను నెరవేర్చాల్సి ఉంది. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ముందుకు కదులుతున్నాయి. పలుచోట్ల ఆడపిల్లలపై ఆకృత్యాలు కలవరపెడుతున్నాయి. మరి నెల రోజుల చంద్రబాబు పాలనపై 10కి మీరిచ్చే మార్కులెన్నో కామెంట్ చేయండి.
బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజు మూసివేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 3,000 మంది యాత్రికులు, ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. జోషిమఠ్ వద్ద కొండచరియలు విరిగి పడడంతో రహదారిని మూసివేశారు. మరో 24 గంటల పాటు రోడ్డును బ్లాక్ చేయనున్నట్లు సమాచారం. ప్రయాణికులను SDRF, NDRF బృందాల సహాయంతో సురక్షితంగా తరలిస్తున్నామని, ఆహారం, నీరు అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
సుప్రీం కోర్టు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రూ.75 వెండినాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 40 గ్రాముల బరువుండే నాణెం, 99.9 శాతం వెండితో తయారవుతుంది. ఒకవైపు అశోక స్తూపం, మరోవైపు సుప్రీం కోర్టు చిత్రాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
OCT18 నుంచి సింహపురి, పద్మావతి, నారాయణాద్రి, నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ వేళలు మారుతాయని SCR ప్రకటించింది. SECBAD-గూడూరు సింహపురి(12710) రా.10.35కి బదులు రా.10.05కి బయల్దేరుతుంది. SECBAD-తిరుపతి పద్మావతి(12764) గూడూరును ఉ.4.43కి బదులు ఉ.4.19కి చేరుతుంది. లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి(12734) సా.6.25కి బదులు సా.5.30 స్టార్టవుతుంది. నర్సాపూర్-నాగర్‌సోల్(17231) రా.11.15కు బదులు రా.9.50కి బయల్దేరుతుంది.
అమరవీరుడు కెప్టెన్ <<13575028>>అన్షుమాన్<<>> సింగ్‌కు ప్రభుత్వం ఇచ్చిన కీర్తిచక్రను తీసుకుని భార్య స్మృతి తమ ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆయన తల్లిదండ్రులు తెలిపారు. ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని కూడా ‘నెక్స్ట్ ఆఫ్ కిన్’(తదుపరి సంబంధీకులు) రూల్ ప్రకారం కోడలు, ఆమె కుటుంబీకులు తీసేసుకున్నారని పేర్కొన్నారు. బిడ్డను కోల్పోయిన తమకు గోడ మీద ఫొటో తప్ప ఏమీ మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోడలు స్పందించట్లేదని వాపోయారు.
AP: పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ కీలక నేతలు, మంత్రులను కలిసి చర్చించినట్లు సమాచారం. శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానం బుధవారం మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరో నలుగురు ఎమ్మెల్సీలు సైతం టీడీపీతో టచ్ ఉన్నట్లు సమాచారం. కాగా మండలిలో వైసీపీకి 38 మంది, టీడీపీకి 9, జనసేనకు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు.
నేపాల్‌లోని మదన్-ఆశ్రిత్ హైవేలో ఇవాళ తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. దీంతో డ్రైవర్లతో సహా 63 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎడతెరిపి లేని వర్షం వల్ల గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆ దేశ పీఎం ప్రచండ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులను వెంటనే రక్షించాలని అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.