News July 12, 2024

కేజ్రీవాల్‌కు ఊరట దక్కేనా?

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ED అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పనుంది. జస్టిస్ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్ దీపాంకర్‌ దత్తతో కూడిన ధర్మాసనం మే17న దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ స్కామ్‌లో <<13608833>>కేజ్రీవాల్<<>> కీలక పాత్ర పోషించారని ED ఛార్జిషీట్ దాఖలు చేయగా, ఇది ఉద్దేశపూర్వకంగా పెట్టిన తప్పుడు కేసు అని ఆయన పేర్కొన్నారు. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

News July 12, 2024

భారతీయుడు-2 పబ్లిక్ టాక్

image

కమల్ హాసన్, శంకర్ 28 ఏళ్ల తర్వాత ‘భారతీయుడు’ సీక్వెల్ ‘భారతీయుడు-2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఫస్టాఫ్ విజువల్స్, సేనాపతిగా కమల్ నటన అదిరిపోయాయని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే లోకనాయకుడి గెటప్ ఫెయిల్ అయిందని, మునుపటిలా ఎమోషన్లు వర్కౌట్ కాలేదని మరికొందరు చెబుతున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.

News July 12, 2024

ఏపీపీఎస్సీ ఛైర్మన్ రాజీనామా ఆమోదం

image

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ హయాంలో సవాంగ్ డీజీపీగా పని చేశారు. ఆ తర్వాత ఆయనను ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించింది. 2022 మార్చిలో బాధ్యతలు చేపట్టగా.. వచ్చే ఏడాది జులై 9వరకు సవాంగ్ పదవీ కాలం ఉన్నా ముందుగానే రాజీనామా చేశారు.

News July 12, 2024

ఆ ఆకతాయిలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం: టీటీడీ

image

తిరుమలలో ఆకతాయి చర్యలకు పాల్పడి భక్తుల మనోభావాలతో ఆడుకున్న తమిళనాడు యూట్యూబర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు TTD తెలిపింది. ‘వారు చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దర్శనం కోసం వేచి ఉన్న ఎంతోమంది భక్తుల మనోభావాలను వారు దెబ్బతీశారు’ అని పేర్కొంది. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు తలుపులు తీస్తున్నట్లుగా నటించిన దుండగులు, వెకిలిగా నవ్వుతూ అక్కడి నుంచి పారిపోయారు. ఆ వీడియో వైరల్ అయింది.

News July 12, 2024

బాలయ్య 50 ఏళ్ల ప్రస్థానం.. సెప్టెంబరులో సన్మానం

image

నందమూరి బాలకృష్ణ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి వచ్చే నెలతో 50 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఆయన తొలి చిత్రం ‘తాతమ్మ కల’ 1974 ఆగస్టు 30న రిలీజైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది సెప్టెంబరు 1న ఆయన్ను సన్మానించాలని తెలుగు చిత్ర పరిశ్రమ నిర్ణయించింది. అందుకు ఆయన కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల్ని ఆహ్వానిస్తామని సినీపెద్దలు తెలిపారు.

News July 12, 2024

3వ తరగతి బాలికపై హత్యాచారం.. CM చంద్రబాబు సీరియస్

image

AP: నంద్యాల జిల్లాలో 3వ తరగతి బాలికపై ముగ్గురు మైనర్ బాలురు హత్యాచారానికి పాల్పడటంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటన కలచివేసిందని, ప్రభుత్వం నేరాలను అంగీకరించదని స్పష్టం చేశారు. ‘ఆడబిడ్డల సంరక్షణకు సంస్థాగతంగా మెకానిజం కావాలి. పిల్లలు తప్పులు చేయకుండా తల్లిదండ్రులు నిశితంగా పర్యవేక్షించాలి. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాల్లో మానవతా విలువలపై సిలబస్ చేర్చుతున్నాం’ అని సీఎం ట్వీట్ చేశారు.

News July 12, 2024

డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్ పొడిగింపు

image

AP: ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 20 వరకు పొడిగించింది. స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన 18 నుంచి 20వ తేదీ వరకు, కోర్సులు, కాలేజీల ఎంపికకు వెబ్ ఆప్షన్‌ల నమోదు 23-26 వరకు, 27న వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించింది. 31న సీట్ల కేటాయింపు చేయనుంది.

News July 12, 2024

కెనడాలో భారతీయుడి దుశ్చర్య.. అరెస్టు

image

కెనడాలో ఓ భారత వ్యక్తి దుశ్చర్యకు పాల్పడ్డాడు. న్యూ బ్రూన్స్‌విక్ ప్రావిన్స్‌లోని ఓ వాటర్ పార్కులో మహిళలపై వరసగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితుల్లో మైనర్లు కూడా ఉన్నారు. వారి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నోవా స్కాషియా ప్రాంతంలో అతడు నివాసం ఉంటున్నాడని వారు తెలిపారు. పరాయి దేశంలో ఇండియా పరువు పోయేలా వ్యవహరించాడంటూ స్థానిక భారతీయులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News July 12, 2024

మళ్లీ దేశవ్యాప్త ఉద్యమం.. సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన

image

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో ఉద్యమాన్ని చేపట్టిన సంయుక్త కిసాన్ మోర్చా మరోసారి పోరుబాట పట్టనున్నట్లు ప్రకటించింది. పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత, రైతుల రుణాలు మాఫీ, అన్నదాతలకు పెన్షన్ వంటి ప్రధాన డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే మహారాష్ట్ర, ఝార్ఖండ్, J&K, హరియాణా రాష్ట్రాలపై దృష్టి సారిస్తామని స్పష్టం చేసింది.

News July 12, 2024

కాంగ్రెస్‌లోకి మరో ఆరుగురు BRS ఎమ్మెల్యేలు?

image

TG: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆరుగురు BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేడు ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), రేపు అరికెపూడి గాంధీ (శేర్లింగంపల్లి) హస్తం తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు లక్ష్మారెడ్డి (ఉప్పల్), సుధీర్ రెడ్డి (ఎల్బీ నగర్), మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), వివేకానంద గౌడ్ (కుత్బుల్లాపూర్) కూడా కండువా మార్చుకోబోతున్నట్లు సమాచారం.