India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌కు విండీస్ షాకిచ్చింది. కీలక మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ఛేదనలో విండీస్ 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దీంతో సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. అంతకుముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి. ఇంగ్లండ్ ఓటమితో దక్షిణాఫ్రికా కూడా చేరడం గమనార్హం.
ఏపీకి కేంద్రం మరో శుభవార్త అందించింది. కృష్ణా జిల్లా నాగాయలంకలో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. దీంతో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. దేశ రక్షణ, సౌకర్యాల కల్పనలో కృష్ణా జిల్లా కీలకపాత్ర పోషిస్తోందని CM చెప్పారు. DRDO ఆధ్వర్యంలో ఈ టెస్టింగ్ సెంటర్ అందుబాటులోకి రానుంది.
‘బలగం’ ఫేమ్ వేణు దర్శకత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ‘ఎల్లమ్మ’ కథను నాని, శర్వానంద్, తేజా సజ్జ వంటి హీరోలకు ఆయన వినిపించారు. తాజాగా ఈ కథ విన్న నితిన్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రాబిన్ హుడ్, తమ్ముడు అనే చిత్రాల షూటింగ్ ముగియగానే ‘ఎల్లమ్మ’ మొదలవుతుందని టాలీవుడ్ టాక్. ఈ మూవీని దిల్ రాజు నిర్మించనున్నారు.
తిరుమలలో ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నెల 17న పౌర్ణమి సందర్భంగా నెలవారీ గరుడసేవ జరుగనుంది. దీనిలో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీమలయప్ప స్వామి గరుడ వాహనంపై తిరు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
2022, అక్టోబరు 15న జనసేన చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం నమోదైందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విటర్లో అన్నారు. ‘అన్యాయానికి అడ్డుగా నిలబడేందుకు వీర మహిళలు, జనసైనికులు చూపిన సంకల్పబలం రాష్ట్రం మొత్తం చూసింది. నాకు సంఘీభావంగా ఓ తల్లి తన మూడేళ్ల బిడ్డతో అర్ధరాత్రి సమయంలో అక్కడ కూర్చుని తెలిపిన మద్దతు, దుర్మార్గపు పాలనపై పోరాడేందుకు నాకు తిరుగులేని ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చింది’ అని ట్వీట్ చేశారు.
TG: కొండా సురేఖపై సొంత పార్టీ నేతల్లో అసమ్మతి నెలకొంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని వరంగల్ పార్లమెంటు(PC) పరిధిలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీకి వినతి పత్రం అందజేశారు. అన్ని నియోజకవర్గాల్లో కొండా వర్గీయులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇదే విషయమై రేపు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను కలవనున్నారు.
టీమ్ ఇండియా తరఫున టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు భారత ప్లేయర్ సంజూ శాంసన్ తెలిపారు. రెడ్ బాల్ క్రికెట్లో సక్సెస్ అవుతానన్న నమ్మకం ఉందని చెప్పారు. దులీప్ ట్రోఫీకి ముందు టెస్టుల కోసం తనను పరిగణనలోకి తీసుకుంటామని, రంజీపై ఫోకస్ చేయమని హైకమాండ్ చెప్పినట్లు గుర్తు చేశారు. ఈ సారి ప్రిపరేషన్ మెరుగ్గానే ఉందని పేర్కొన్నారు. కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20లో సంజూ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే.
AP: రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తిరుపతి-0877-2236007, గూడూరు-8624252807, సూళ్లూరుపేట-8623295345, తిరుపతి RDO-7032157040, శ్రీకాళహస్తి-9966524952 నంబర్లను అందుబాటులో ఉంచారు. అటు పలు జిల్లాల్లో పునరావాస కేంద్రాలను ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేస్తున్నారు.
స్వర్గీయ రతన్ టాటాపై బెంగతో ఆయన పెంపుడు శునకం ‘గోవా’ చనిపోయిందంటూ వాట్సాప్‌లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వార్తల్ని ముంబైలో ఇన్స్పెక్టర్గా ఉన్న సుధీర్ కుడాల్కర్ ఖండించారు. ‘రతన్‌కి సన్నిహితుడైన శంతను నాయుడిని అడిగి తెలుసుకున్నాను. గోవా ఆరోగ్యంగా ఉంది. దయచేసి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయకండి’ అని విజ్ఞప్తి చేశారు. కాగా.. లైకుల కోసం ఇంత దిగజారాలా అంటూ ఆ వీడియో క్రియేటర్లపై పలువురు మండిపడుతున్నారు.
మసీదులో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేసిన ఇద్దరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఓ మసీదులో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారన్న ఆరోపణలపై దక్షిణ కన్నడ పోలీసులు గత ఏడాది ఇద్దర్ని అరెస్టు చేశారు. మసీదు బహిరంగ ప్రదేశం కావడం, స్థానికంగా మతసామరస్యంతో ఉంటున్నామని ఫిర్యాదుదారే చెప్పిన నేపథ్యంలో నిందితులు చేసింది క్రిమినల్ నేరం కిందికి రాదని కోర్టు అభిప్రాయపడింది.
Sorry, no posts matched your criteria.