News July 11, 2024

image

https://sticky.way2news.co/sticky_jsps/Quiz1.jsp?id=305&langid=1&token={TOKEN}

News July 11, 2024

డీఎస్సీ హాల్‌టికెట్లు విడుదల

image

TG: ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్న డీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. <>https://tsdsc.aptonline.in/tsdsc/<<>> వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 11,062 టీచర్ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

News July 11, 2024

7,213KM రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించండి: పవన్ కళ్యాణ్

image

AP: గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని డిప్యూటీ CM పవన్ చెప్పారు. 250 పైన జనాభా కలిగిన ప్రతి పల్లెనూ మెయిన్ రహదారితో అనుసంధానించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ₹4,976 కోట్ల నిధులతో 7,213KM మేర రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన 30% మ్యాచింగ్ గ్రాంటును 10 శాతానికి తగ్గించేలా కేంద్రాన్ని కోరతామని తెలిపారు.

News July 11, 2024

బియ్యం or రోటీ: బరువు తగ్గేందుకు ఏది బెటర్?

image

బరువు తగ్గాలని చాలామంది ఆహారంలో మార్పులు చేస్తుంటారు. కొంతమంది రాత్రిపూట భోజనం మానేస్తుంటారు. సమతుల్య ఆహారం తీసుకుంటే బరువును తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. బియ్యం, రోటీ రెండూ ఆరోగ్యకరమైనవే. కానీ గోధుమ రొట్టెలో అధిక ఫైబర్, ప్రొటీన్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల బరువు తగ్గేందుకు కొంత వెసులుబాటు ఉంది. ఒక్కోసారి తెలియకుండా వైట్ రైస్‌ ఎక్కువగా తినడం వల్ల కొంచెం బరువు పెరుగుతారు.

News July 11, 2024

ఏపీలో ఆరోజు నుంచి మహిళలకు ఫ్రీ బస్?

image

రాష్ట్రంలో కీలక హామీల అమలు దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది. కాగా అదే రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్‌ను సైతం ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలు విధానంపై అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 16న మంత్రివర్గం సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

News July 11, 2024

అంబానీ పెళ్లి వేడుకకు ప్రధాని మోదీ?

image

బిలియనీర్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్- రాధిక వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నట్లు సమాచారం. రేపు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి వివాహం జరగనుంది. పశ్చిమ బెంగాల్ CM మమత ఇప్పటికే ముంబైకి చేరుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి, ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరుకానున్నారు.

News July 11, 2024

నీట్ పేపర్ లీకేజీ.. కీలక సూత్రధారి అరెస్ట్

image

నీట్ పేపర్ లీకేజీ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న రాజేశ్ రంజన్ అనే వ్యక్తిని CBI అధికారులు పట్నాలో అరెస్ట్ చేశారు. నిందితుడిని స్థానిక కోర్టు 10రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. అలాగే పట్నా, కోల్‌కతాలో సోదాలు చేసిన CBI.. కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో పది మందికి పైగా అరెస్ట్ అయ్యారు. కాగా నీట్ లీకేజీపై దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు జులై 18కి వాయిదా వేసింది.

News July 11, 2024

అగ్నివీర్లపై కేంద్రం కీలక నిర్ణయం

image

మాజీ అగ్నివీరులకు BSF, CISF కానిస్టేబుల్ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వారికి ఫిజికల్ టెస్ట్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. తొలి ఏడాది ఐదేళ్లు, తదుపరి ఏడాది మూడేళ్ల వయో సడలింపు సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. కాగా అగ్ని వీర్ పథకంపై పలు విమర్శలు రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News July 11, 2024

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

image

TG: HYDలోని పలు ప్రాంతాల్లో భారీ <<13609797>>వర్షం<<>> కురవగా రానున్న 2 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి, ఖమ్మం, మెదక్, మల్కాజిగిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట్, యాదాద్రి-భువనగిరిలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడొచ్చని పేర్కొంది. కాగా <<13608681>>రేపు<<>> కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

News July 11, 2024

కోహ్లీ ఇకపై ఎక్కువగా ఆడకపోవచ్చు: స్టెయిన్

image

రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజా వంటి సీనియర్ల పట్ల టీమ్‌ఇండియా నూతన కోచ్ గంభీర్ కఠినంగా వ్యవహరిస్తారనేది విశ్లేషకుల అంచనా. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘కోహ్లీ వంటి కొందరు సీనియర్లు ఇకపై ఎక్కువ కాలం జట్టులో కొనసాగకపోవచ్చు. వాళ్లను పూర్తిగా పక్కన పెడతారని చెప్పలేను కానీ.. గంభీర్ కచ్చితంగా కఠినంగా ఉంటారనే అనిపిస్తోంది’ అని చెప్పారు.