India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ నిన్న విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజు ఈ మూవీ రూ.47.13 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు హిందూస్థాన్ టైమ్స్ పేర్కొంది. తెలుగులో రూ.38Cr, హిందీలో రూ.7Cr, తమిళ్‌లో రూ.2Cr వసూలు చేసినట్లు తెలిపింది. మార్నింగ్ షోల్లో 55.82%, మ్యాట్నీలో 39.33%, ఈవెనింగ్ షోల్లో 50.53% ఆక్యుపెన్సీ నమోదు చేసిందని వెల్లడించింది. మరి మీరూ మూవీ చూశారా? చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.

AP: మకర సంక్రమణ పుణ్యకాలం సందర్భంగా శ్రీశైలంలో నేటి నుంచి ఈ నెల 17 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఉ.8.45గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రేపటి నుంచి స్వామి, అమ్మవార్లకు వాహనసేవలు నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా నేటి నుంచి 17 వరకు ఆర్జిత, ప్రత్యక్ష, పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీ హోమం, స్వామిఅమ్మవార్ల కళ్యాణం, ఏకాంత సేవలు నిలిపివేశారు.

ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై దుష్ప్రచారం చేసిన మహిళను చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధమైనట్లు ఆయన టీమ్ తెలిపింది. సరస్వతుల కామేశ్వరిపై పరువు నష్టం దావా వేయడంతో పాటు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు SMలో ప్రకటించింది. అలాగే దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లకూ లీగల్ నోటీసులు పంపించినట్లు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంది. అభిమానులు ఈ విషయంలో ఇకపై ఆందోళన చెందరాదని గరికపాటి టీం పేర్కొంది.

TGలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పెండింగ్ నిధులు పూర్తిస్థాయిలో చెల్లించేవరకు సేవలు అందించబోమని ప్రైవేట్ ఆసుపత్రులు తేల్చిచెప్పాయి. ఈ నిలిపివేత తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశాయి. 2 రోజుల క్రితం ప్రభుత్వం రూ.120 కోట్ల బకాయిలు రిలీజ్ చేసింది. దీంతో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని అంతా భావించారు. కానీ అన్ని బిల్లులను క్లియర్ చేయాలని నెట్‌వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి.

AP: రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వెహికల్ కొని, రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి పూర్తిగా పన్ను రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0(2024-2029)ని అమల్లోకి తీసుకొచ్చామని, ఇది ఉన్నంతకాలం ఈవీలపై ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని పేర్కొంది. హైబ్రిడ్ 4 వీలర్స్‌కు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది.

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE) మెయిన్-2025 సెషన్-1 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను NTA విడుదల చేసింది. అభ్యర్థులు <

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఈనెల 15న ఆ దేశ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడి కాలమానం ప్రకారం రా.8 గంటలకు ఓవల్ ఆఫీస్ నుంచి ప్రెసిడెంట్ ఫేర్‌వెల్ స్పీచ్ ఇస్తారని వైట్‌హౌస్ తెలిపింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో బైడెన్ పదవీకాలం ఈనెల 20న ముగియనుంది. అదేరోజు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేస్తారు.

ట్రూడో రాజీనామా ప్రకటన నేపథ్యంలో కెనడా కొత్త PMని MAR 9న ప్రకటిస్తామని అధికార లిబరల్ పార్టీ తెలిపింది. ఆరోజు నిర్వహించే ఓటింగ్ ద్వారా నాయకుడిని ఎన్నుకుంటామని పేర్కొంది. అయితే కొత్తగా ఎన్నికయ్యే PMకి పెను గండం పొంచి ఉంది. మైనార్టీలో పడిపోయిన ప్రభుత్వంపై MAR 24న పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇందులో నెగ్గితేనే లిబరల్ పార్టీ నేత PMగా కొనసాగుతారు.

ఎన్ని గంటలు పని చేశామనే దానికంటే, ఎంత వర్క్ క్వాలిటీగా చేశామన్నదే ముఖ్యమని బజాజ్ ఆటో సంస్థ MD రాజీవ్ బజాజ్ అన్నారు. వారానికి 90 గంటలు పని చేయాలన్న సుబ్రమణ్యన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కామెంట్స్ చేశారు. 90 గంటల పనే కావాలంటే అది పైస్థాయి ఉద్యోగుల నుంచే మొదలుపెట్టాలన్నారు. ఆదివారాలు కూడా పనిచేయాలంటూ లేబర్ నిబంధనలు అతిక్రమిస్తున్న సుబ్రమణ్యన్‌పై చర్యలు తీసుకోవాలని CPI(ML) MP రాజారామ్ డిమాండ్ చేశారు.

కోలీవుడ్ హీరో విశాల్ అనారోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ‘వాడు వీడు’ మూవీ షూటింగ్ సమయంలో విశాల్ చెట్టుపై నుంచి కిందపడ్డట్లు తెలుస్తోంది. దీంతో బ్రెయిన్‌లో నరాలు దెబ్బతిని తీవ్రమైన తలనొప్పి, ఆకలి లేమితో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ఇటీవల అది తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కారణంగానే ఆయన ఈ స్థితికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.