India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: 2027లో జమిలి ఎన్నికలు వస్తే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లే అధికారంలో ఉంటుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. TDP నేతల మాటలు వినే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నూతన మద్యం పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని, 90% షాపులు TDP నేతలకే దక్కాయని ఆరోపించారు. ఇసుక, గ్రానైట్, విద్య, వైద్యంలో సిండికేట్ రాజ్యం కొనసాగుతోందని మండిపడ్డారు. దోచుకోవడంలో CM చంద్రబాబు దిట్ట అని దుయ్యబట్టారు.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. MHలో NOV 20న ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తామని CEC రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఇక ఝార్ఖండ్‌లో 2 దశల్లో (NOV 13న, రెండో దశ 20న) ఎన్నికలు ఉంటాయన్నారు. అటు 15 రాష్ట్రాల్లో 48 MLA, 2 MP స్థానాల బైపోల్ షెడ్యూల్‌నూ వెల్లడించారు.
47 AC, వయనాడ్ MP సెగ్మెంట్‌కు 13న, కేదార్‌నాథ్ MP, ఓ MLA స్థానానికి 20న ఓటింగ్ ఉంటుంది. NOV 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
భారత టెస్టు జట్టులో KL, అశ్విన్, జడేజా వంటి సీనియర్లున్నా వైస్ కెప్టెన్‌గా బుమ్రానే నియమించడం వెనుక కారణాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘బుమ్రాతో కలిసి నేను చాలా మ్యాచులు ఆడాను. చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఎన్నోసార్లు తను ఇచ్చిన సలహాలు జట్టుకు లాభించాయి. కెప్టెన్సీ అనుభవం లేనప్పటికీ ఎప్పుడు ఏం చేయాలో అతడికి తెలుసు. భారత జట్టు నాయకత్వ బృందంలో తను కీలకం’ అని పేర్కొన్నారు.
హార్ట్ ఆపరేషన్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తొలిసారి కనిపించారు. ఆయన నటించిన వేట్టయన్ చిత్రం సక్సెస్ కావడంతో చిత్రబృందం రజినీని కలిసింది. ఆయనతో దిగిన ఫొటోను యూనిట్ సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఫ్యాన్స్ ఆ ఫొటోను షేర్ చేస్తున్నారు. కాగా అనారోగ్యంతో గత నెల 30న రజినీకాంత్ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడటంతో వైద్యులు ఆయనకు స్టెంట్ వేశారు.
మొబైల్, టెలికాం విభాగాల్లో భారత్ ప్రయాణం ఇతర దేశాలు అధ్యయనం చేసేందుకు ఓ సబ్జెక్టుగా మారిందని PM మోదీ చెప్పారు. దేశంలో మొబైల్ తయారీ యూనిట్లు వేగంగా విస్తరిస్తున్నాయని, ఈ మొబైల్స్‌లో దేశీయంగా తయారు చేసిన చిప్‌లను వాడుతామని తెలిపారు. అంతర్జాతీయ టెలి కమ్యూనికేషన్ యూనియన్ సమావేశంలో (WTSA-2024) ఆయన మాట్లాడారు. ప్రపంచంలో జరిగే 40% రియల్ టైమ్ డిజిటల్ ట్రాన్సాక్షన్లు దేశంలోనే జరుగుతున్నాయన్నారు.
ఏపీలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. మద్యంపై 2 శాతం సెస్ విధిస్తూ జీవో జారీ చేసింది. డ్రగ్ రిహాబిలిటేషన్ సెస్ కింద దీన్ని వసూలు చేస్తుండగా, రూ.100 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నిన్న మద్యం షాపులను లాటరీ ద్వారా కేటాయించగా, రేపటి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది.
ఉద్యోగాలు పొందడంలో బంధుప్రీతి ప్రభావం ఉంటుందని స్టాండ్‌అవుట్ CV సర్వేలో తేలింది. సర్వేలోని 70.2% మంది వారి వ్యక్తిగత కనెక్షన్స్ ద్వారా సత్వరమే జాబ్ ఆఫర్‌ను అందుకున్నట్లు వెల్లడైంది. స్నేహితుల ద్వారా 62.1% మంది, ఫ్యామిలీ ద్వారా 37.9% మంది ఉద్యోగాలు పొందారు. 90.6% మంది బంధుప్రీతి అనైతికమని అంగీకరించారు. వ్యక్తిగత కనెక్షన్ల ద్వారా ఉద్యోగం పొందిన ప్రతి ముగ్గురిలో ఒకరు తమకు అర్హత లేదని ఒప్పుకున్నారు.
న్యూజిలాండ్‌లో టెస్ట్ సిరీస్ ముందు భారత్‌కు షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ మెడ, భుజం నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఒకవేళ గిల్ దూరమైతే సర్ఫరాజ్‌ను ఆడించే అవకాశం ఉంది. ఇటు న్యూజిలాండ్ పేసర్ బెన్ సియర్స్ మోకాలి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు తెలిపింది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ కూడా గాయం వల్ల మొదటి టెస్ట్ ఆడటం లేదు.
సెమీ కండక్టర్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీల తయారీ రంగంలో వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. తయారీ రంగంలో జాబ్స్ క్రియేట్ చేయలేకపోతే అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న భారత్ లక్ష్యం నెరవేరదని అన్నారు. 100మిలియన్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒక్కో మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్ వల్ల 8-10 ఇన్‌డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయన్నారు.
సరిహద్దుల్లో నిఘా వ్యవస్థ పటిష్ఠతకు అమెరికా నుంచి 31 ప్రిడేటర్ MQ-9B డ్రోన్ల కొనుగోలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు దేశాలు ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేశాయి. గత నెల అమెరికా పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ ఇదే విషయమై చర్చించారు. డ్రోన్ల కొనుగోలు సహా నిర్వహణ, మరమ్మతుల వ్యవస్థ ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందం విలువ రూ.34,500 కోట్లు.
Sorry, no posts matched your criteria.