News April 8, 2024

‘మ్యాంగో’ పేరు ఎలా వచ్చిందంటే!

image

వేసవిలో మామిడి పండ్లపై మనసు పారేసుకోని వారు ఉండరు. ప్రపంచంలో సగానికి పైగా మన దేశమే ఉత్పత్తి చేస్తున్న ఈ మధుర ఫలాలకు 5 వేల ఏళ్ల చరిత్ర ఉంది. అయితే ‘మ్యాంగో’ అనే పేరు పోర్చుగీస్ పదం మాంగా నుంచి ఉద్భవించింది. ఆ దేశస్థులు 1498లో సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం కేరళకు వచ్చేవారట. అక్కడ మామిడిని మన్నా అనే వారు. ఆ పేరు పలికేందుకు ఇబ్బందిగా ఉండటంతో వారు మాంగా అని పిలిచేవారు. దీని నుంచి మ్యాంగో ఉద్భవించిందట.

News April 8, 2024

గర్ల్‌ఫ్రెండ్స్‌ ముందు సిక్సులు కొట్టొద్దని కొందరు కోరారు.. కానీ: రోహిత్

image

గర్ల్‌ఫ్రెండ్స్ స్టేడియానికి వచ్చినపుడు తమ బౌలింగులో సిక్సులు కొట్టొద్దని కొందరు కోరారని రోహిత్ శర్మ వెల్లడించారు. అయితే ఆ వినతులను తాను సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. కపిల్ షోలో మాట్లాడుతూ.. ‘వాళ్ల గర్ల్‌ఫ్రెండ్స్ గ్రౌండుకు వచ్చినట్లే.. నా భార్య రితికా కూడా వస్తుంది. మ్యాచ్‌ను టెన్షన్‌గా చూస్తూ ఉంటుంది. ఆమె నాకు చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు.

News April 8, 2024

రూ.1,000 పెన్షన్‌ను రూ.3,000 చేశాం: CM జగన్

image

AP: కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ‘వాలంటీర్లను నియమించి ఇంటింటికీ పెన్షన్లు అందించాం. 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు పెన్షన్ రూ.1,000 ఉండేది. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.3,000 పెన్షన్ ఇస్తున్నాం. గతంలో 29 లక్షల మందికి పెన్షన్ ఇస్తే మేం 66 లక్షల మందికి ఇస్తున్నాం. ప్రతి అవ్వాతాత దీని గురించి ఆలోచించాలి’ అని కోరారు.

News April 8, 2024

బ్రూక్ ఔట్.. విలియమ్స్‌ ఇన్

image

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. దీంతో అతడి స్థానంలో దక్షిణాఫ్రికా బౌలర్ లిజాద్ విలియమ్స్‌ను ఢిల్లీ జట్టులోకి తీసుకుంది. ‘ఇటీవల మా నానమ్మ కన్నుమూశారు. నా బాల్యమంతా ఆమెతోనే గడిపాను. ఈ కష్ట సమయంలో కుంటుంబంతో ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే ఈ సీజన్‌కు దూరమవుతున్నా’ అని బ్రూక్ వెల్లడించారు.

News April 8, 2024

ఇదీ ఓ ఇండస్ట్రీ ‘కలెక్షన్ల’ రికార్డే!

image

హిందీ ‘ఛత్రపతి’ హీరోయిన్ నుష్రత్ ఇండస్ట్రీలో ఓ అరుదైన అనధికార రికార్డు సృష్టించారు. అది బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డు కాదు.. చెప్పుల కలెక్షన్లలో రికార్డు. ఆమెకు ఫుట్‌వేర్ కలెక్షన్ అంటే ఇష్టమట. షాపులో చెప్పులైనా, షూస్ అయినా తనకు నచ్చితే వెంటనే అవి తన ఇంట్లో ఉండాల్సిందే. అలా.. ఇప్పుడు ఆమె ఇంట్లో దాదాపు ఓ చెప్పుల దుకాణం పెట్టడానికి సరిపడినన్ని చెప్పులు ఉన్నాయి.

News April 8, 2024

గొడ్డు మాంసంపై అప్పుడలా.. ఇప్పుడిలా..

image

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఆమె బీఫ్(గొడ్డు మాంసం)పై చేసిన రెండు రకాల ట్వీట్లే దీనికి కారణం. తాజాగా తాను గొడ్డు మాంసం తిననని ట్వీట్ చేసిన కంగన.. 2019 మే 19న ఇందుకు భిన్నంగా గొడ్డు మాంసం తినడం తప్పుకాదని, దానికి మతంతో సంబంధం లేదని ట్వీట్ చేశారు. దీంతో ఈ రెండు ట్వీట్లను పోల్చుతూ నెటిజన్లు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు.

News April 8, 2024

లక్నోకు షాక్.. మయాంక్ యాదవ్‌కు గాయం

image

GTతో మ్యాచ్‌లో LSG స్టార్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయపడ్డారు. ఒక ఓవర్ వేసిన తర్వాత పక్కటెముకలు పట్టేయడంతో గ్రౌండును వీడారు. మళ్లీ గ్రౌండులో అడుగుపెట్టలేదు. వైద్యులు అతనికి వైద్యం అందించారు. మయాంక్ గాయం, తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంపై జట్టు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అతను కోలుకోకపోతే లక్నోకు ఎదురుదెబ్బే. మ్యాచ్ తర్వాత మయాంక్‌తో మాట్లాడానని, బాగానే ఉన్నట్లు అనిపించిందని కృనాల్ తెలిపారు.

News April 8, 2024

MLC నవీన్ రావు గెస్ట్ హౌస్ నుంచే ఫోన్ ట్యాపింగ్!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని BRS ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్ కేంద్రంగా ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భుజంగరావు SIB ఆఫీసు కంటే ఈ గెస్ట్ హౌస్‌నే ఎక్కువగా వాడుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు అక్కడ తనిఖీలు చేస్తున్నారు. నవీన్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారని తెలుస్తోంది.

News April 8, 2024

ఉగాది ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పూల ధరలు

image

రేపు ఉగాది పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో తెల్ల చామంతి KG రూ.450, మిగిలిన చామంతులు రూ.350-రూ.400 పలుకుతున్నాయి. మల్లెలు కేజీ రూ.700-రూ.800, చిన్న గులాబీలు రూ.250-రూ.300, బంతిపూల రేటు రూ.80-రూ.100గా ఉంది. బహిరంగ మార్కెట్‌లో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఎండల కారణంగా పూల దిగుబడి తగ్గడం, ఉగాదికి డిమాండ్ పెరగడంతో రేట్లు పెరిగాయి.

News April 8, 2024

నేను గొడ్డు మాంసం తినను: కంగన

image

తాను గొడ్డు మాంసం తింటానని వస్తున్న వార్తల్లో నిజం లేదని బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ స్పష్టం చేశారు. ‘గొడ్డు మాంసం లేదా మరే విధమైన రెడ్ మీట్ తినను. నాపై రూమర్స్ చేయడం సిగ్గుచేటు. నేను దశాబ్దాలుగా యోగ, ఆయుర్వేద జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నాను. నా ప్రజలకు నేనేంటో తెలుసు. నేను గర్వించదగిన హిందువునని దేశ ప్రజలకు తెలుసు. జైశ్రీరామ్’ అని కంగన ట్వీట్ చేశారు.