News November 22, 2024

పెరిగిన చలి.. విజృంభిస్తున్న జలుబు, దగ్గు

image

TG: రాష్ట్రంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో చాలామంది వైరల్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారు. ప్రతి 20 మందిలో ఐదుగురికి జలుబు, దగ్గు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి వల్ల జ్వరం కూడా వస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. బ్లడ్ టెస్టులు చేయించుకుంటున్నారు. మరోవైపు చలి వల్ల హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పొల్యూషన్ విపరీతంగా పెరగడంతో శ్వాసకోశ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

News November 22, 2024

మహిళలకు నెలకు రూ.2500.. కీలక ప్రకటన

image

TG: మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2500, కళ్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం కొత్త ఏడాదిలో అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా ఇస్తామన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను DEC 9 నాటికి చెల్లించాలని CM నిర్ణయించినట్లు చెప్పారు. రూ.వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని BRS ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు.

News November 22, 2024

ఈనెల 25న తిరుమల రూ.300 దర్శన టికెట్లు

image

ఫిబ్రవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఈనెల 25న విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి <>ttdevasthanams.ap.gov.in<<>> వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల టోకెన్లు రిలీజ్ చేస్తారు. ఇక రేపు(23న) ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు జారీ అవుతాయి.

News November 22, 2024

డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్

image

TG: తమ డిమాండ్ల సాధనకు డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌తో పాటు HYDలో లక్ష మందితో భారీ ర్యాలీ, సభ నిర్వహిస్తామని రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ ప్రకటించింది. HYDలో 20వేల కొత్త ఆటోలకు పర్మిట్ ఇవ్వాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెల్లించి, యాక్సిడెంట్ బీమాను రూ.10లక్షలకు పెంచాలని డిమాండ్ చేసింది. ఒక్కో ఆటో డ్రైవర్ కుటుంబానికి రూ.12వేల ఆర్థిక సాయం పథకాన్ని వెంటనే అమలు చేయాలని పేర్కొంది.

News November 22, 2024

నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

image

ఈనెల 11న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ‘రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం సాగించిన విధ్వంసం, కూటమి ప్రభుత్వంలో రాజధాని పునర్నిర్మాణానికి చేపడుతున్న చర్యలు’ అనే అంశంపై నేడు సభలో చర్చ జరగనుంది. అనంతరం 2047-విజన్ డాక్యుమెంట్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన రిలీజ్ చేయనున్నారు. వరదలు, రుషికొండ ప్యాలెస్ తదితర అంశాలపైనా చర్చిస్తారని సమాచారం.

News November 22, 2024

కాస్కో రేవంత్: బీఆర్ఎస్

image

TG: లగచర్ల గ్రామస్థుల అరెస్టుకు నిరసనగా తాము <<14666575>>మహబూబాబాద్‌లో<<>> చేపట్టనున్న నిరసనకు హైకోర్టు అనుమతిచ్చిందని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ‘కాస్కో రేవంత్. నువ్వెన్ని ఆంక్షలు పెట్టినా పేద దళిత, గిరిజన, ఆది వాసీ ప్రజల పక్షాన నిలబడతాం. న్యాయం జరిగే వరకు పోరాడతాం’ అని పేర్కొంది. ఈనెల 25న ఉ.10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 1000 మందితో ధర్నా చేసుకోవచ్చని బీఆర్ఎస్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

News November 22, 2024

భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి పేరు: సీఎం చంద్రబాబు

image

AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. విమానాశ్రయం పక్కన అల్లూరి స్మారక మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పార్లమెంటులో అల్లూరి, ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టాలని అనుకున్నామని చెప్పారు. అవసరమైతే దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు.

News November 22, 2024

వచ్చే నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు

image

TG: అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 9 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారం నుంచి పది రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. ఈనెల 9న ఏడాదిలో చేసిన కార్యక్రమాలపై చర్చించిన అనంతరం సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని CM రేవంత్ ఆవిష్కరించనున్నారు. DEC 7 నాటికి ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ఆలోగా క్యాబినెట్ విస్తరణను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

News November 22, 2024

ఉద్యోగాలను ఏఐ ఇప్పట్లో భర్తీ చేయలేదు: గూగుల్ రీసర్చ్ హెడ్

image

టెక్ ఇండస్ట్రీలో AI వినియోగం పెరగడంపై గూగుల్ రీసర్చ్ హెడ్ యోస్సీ మాటియాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. హ్యూమన్ డెవలపర్లను ఇప్పట్లో AI భర్తీ చేయలేదని అన్నారు. కోడింగ్ నేర్చుకోవడం ఇప్పటికీ ముఖ్యమేనని పేర్కొన్నారు. కొన్ని టాస్క్‌లలో AI టూల్స్‌ను వినియోగిస్తున్నప్పటికీ, హ్యూమన్ కోడర్‌లకు AI ప్రత్యామ్నాయం కాదని తెలిపారు. AI- రూపొందించిన కోడ్‌కు హ్యూమన్ రివ్యూ, వాలిడేషన్ అవసరం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

News November 22, 2024

పాక్‌లోకి త్వరలో చైనా సైన్యం.. ఎందుకంటే?

image

పాక్‌లో ఉంటున్న తమ దేశస్థులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వారి భద్రత కోసం చైనా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మూడు ప్రైవేట్ కంపెనీలను నియమించుకుంది. అలాగే తమ సైన్యాన్ని కూడా పాక్‌లో మోహరించాలని యోచిస్తోంది. CPEC ప్రాజెక్ట్స్ కోసం దాదాపు 30వేల మంది చైనా ఇంజినీర్లు, కార్మికులు అక్కడ ఉంటున్నారు. వారి భద్రతపై చైనా ఆందోళన చెందడంతో పాక్ సర్కార్ కూడా రక్షణ రంగానికి నిధులను పెంచింది.