News April 8, 2024

BREAKING: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్

image

TG: బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాభవన్ దగ్గర బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ ఘటన తర్వాత అతను విదేశాలకు పారిపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇవాళ హైదరాబాద్ తిరిగి రావడంతో ఎయిర్‌పోర్టులో రహీల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

News April 8, 2024

సజ్జలపై షర్మిల తీవ్ర ఆగ్రహం

image

AP: వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్ షర్మిల ఫైరయ్యారు. ‘నన్ను పెయిడ్ ఆర్టిస్టు అంటావా? నేను రాజన్న బిడ్డను గుర్తుపెట్టుకో.. అధికార మదం తలకు ఎక్కిందా? మతి ఉండే మాట్లాడుతున్నావా? నువ్వూ.. నీ కొడుకు పేమెంట్ తీసుకుని నన్ను, సునీతను హింసించారు. సోషల్ మీడియాలో హేళన చేశారు. మీ ఇంట్లో ఆడవాళ్లు కూడా పెయిడ్ ఆర్టిస్టులేనా?’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

News April 8, 2024

గీత దాటుతున్న విమర్శలు

image

AP: రాష్ట్రంలో ఎన్నికల వేళ అగ్రనేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నారు. ఎన్నికల కోడ్‌ ఉందనేది మరిచి విమర్శల్లో తగ్గేదే లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే CM జగన్‌, మాజీ CM చంద్రబాబుకు EC నోటీసులు ఇచ్చింది. ‘జగన్‌ రాక్షసుడు, దొంగ’ అని చంద్రబాబు విమర్శిస్తే.. ‘చంద్రబాబు సమాధి నుంచి లేచి వచ్చిన పశుపతి, రక్తం పీల్చేందుకు రెడీ అయ్యారు’ అని జగన్ అన్నారు.
<<-se>>#Elections2024<<>>

News April 8, 2024

గూగుల్ మ్యాప్స్‌లోనూ ట్రైన్ స్టేటస్

image

చాలామంది రైలు ప్రయాణికులు తమకు కావాల్సిన ట్రైన్ రన్నింగ్ స్టేటస్ కోసం రకరకాల యాప్స్ వాడుతుంటారు. అయితే.. అవేమీ అవసరం లేకుండా.. మీ ఫోన్లో డీఫాల్ట్‌గా ఉన్న గూగుల్ మ్యాప్స్‌లోనే ట్రైన్ స్టేటస్ చూసుకోవచ్చు. ఇందుకోసం మీరు డెస్టినేషన్ ఎంటర్ చేసి.. ట్రైన్ రూట్ ఎంచుకోవాలి. అక్కడ మీకు ఏ రైళ్లు అందుబాటులో ఉన్నాయో కనిపిస్తుంది. ఆ ట్రైన్ పేరుపై క్లిక్ చేస్తే.. దాని రన్నింగ్ స్టేటస్ కనిపిస్తుంది.
> SHARE

News April 8, 2024

సినీ ఇండస్ట్రీలో విషాదం

image

ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్, నిర్మాత గంగూ రామ్‌సే(83) కన్నుమూశారు. నెల రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈయన పురానీ హవేలీ, టేఖానా లాంటి క్లాసిక్ హారర్ చిత్రాలతో పాటు ఖిలాడీ, ఆషిక్ ఆవారా తదితర చిత్రాలకు పనిచేశారు. గంగూతోపాటు అతడి ఆరుగురు సోదరులు కలిసి బాలీవుడ్‌లో దాదాపు 50 చిత్రాలను నిర్మించారు.

News April 8, 2024

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

image

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. కంపార్టుమెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. నిన్న శ్రీవారిని 73,801 మంది భక్తులు దర్శించుకోగా.. 23,055 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

News April 8, 2024

చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం

image

AP: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రచారం చేయనున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఉభయగోదావరి జిల్లాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 10న నిడదవోలులో 11న పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో రోడ్ షో, సభ ఉంటుందని సమాచారం. ఇప్పటివరకు ఈ ఇద్దరు నేతలు కలిసి బహిరంగ సభల్లో పాల్గొన్నారు కానీ ఉమ్మడిగా రోడ్ షో చేయలేదు.

News April 8, 2024

ఓసారి గెలుపు.. మరోసారి డౌటు

image

తమిళ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. లోక్‌సభ పోరులోనూ విలక్షణ తీర్పు ఇస్తుంటారు. అసెంబ్లీలో ఐదేళ్లకోసారి అధికార మార్పిడి తప్పనిసరి. అక్కడ 39 MP స్థానాలుండగా, గత 3 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఒకే పార్టీ గెలవని సెగ్మెంట్లు ఏకంగా 27 ఉన్నాయి. ఎక్కువగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్య విజయాలు దోబూచులాడుతున్నాయి. 2019లో ఇండియా కూటమి 38, NDA 1 స్థానం గెలిచాయి. ఈసారి తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 8, 2024

మామిడి పండ్లు కేజీ రూ.200!

image

వేసవిలో విరివిగా లభించే మామిడి తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. అయితే ఈసారి మామిడి ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం కేజీ మామిడి పండ్ల ధర రూ.150-రూ.200 వరకు పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది వాతావరణ మార్పుల కారణంగా మామిడి కాత ఆశాజనకంగా లేదంటున్నారు. అటు ఉగాది తర్వాత పచ్చళ్లను పెట్టే ఆనవాయితీ ఉండటంతో పచ్చడి కాయల ధరలూ పెరుగుతాయని భావిస్తున్నారు.

News April 8, 2024

నడ్డా సతీమణి కారు దొరికింది

image

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి మల్లికా నడ్డాకు చెందిన ఎస్‌యూవీ టయోటా ఫార్చూనర్ కారు దొరికింది. గత నెల 19న ఢిల్లీలో చోరీకి గురైన కారును వారణాసిలో గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫరీదాబాద్‌ సమీపంలోని బాధ్‌కల్‌ ప్రాంతానికి చెందిన సలీం, త్రిపాఠి, మహమ్మద్ చోరీ చేసినట్టు గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కారును నాగాలాండ్‌ తరలించే క్రమంలో వారణాసి వద్ద పట్టుబడ్డారు.